పోలీసుల కాన్వాయ్‌పై కాల్పులు, 13 మంది మృతి | 13 Dead In Ambush On Mexico Police Convoy | Sakshi
Sakshi News home page

పోలీసుల కాన్వాయ్‌పై కాల్పులు, 13 మంది మృతి

Published Fri, Mar 19 2021 1:44 PM | Last Updated on Fri, Mar 19 2021 3:09 PM

13 Dead In Ambush On Mexico Police Convoy - Sakshi

మెక్సికో: సెంట్రల్‌ మెక్సికోలోని పోలీసు కాన్వాయ్‌పై క్రిమినల్‌‌ గ్యాంగ్‌ విరుచుకుపడింది. మెక్సికో రాష్ట్రంలోని కోటెపెక్ హరినాస్ మునిసిపాలిటీలో లానో గ్రాండే జిల్లాలో భద్రతా మంత్రిత్వ శాఖ, మెక్సికో రాష్ట్ర ప్రాసిక్యూటర్‌ కార్యాలయానికి చెందిన కాన్వాయ్‌పై గురువారం రాత్రి ఓ క్రిమినల్‌ గ్రూప్‌ ఆకస్మికంగా దాడికి తెగబడింది. పోలీసుల కాన్వాయ్‌పై నేరస్తుల‌ ముఠా జరిపిన ఈ దాడుల్లో 13 మంది మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఎనిమిది మంది పోలీసులు, అయిదుగురు విచారణాధికారులు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ కాల్పుల దాడిని అధికారులు ఖండించారు. మరోవైపు దాడికి కారణమైన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

చదవండి: కోవిడ్‌–19: మహిళలపై తీవ్రమైన వేధింపులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement