సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కామెంట్స్ చేసిన నేపథ్యంలో కేటీఆర్‌కు కమిషన్ నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆగస్టు 24వ తేదీన మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల బస్సుల్లో ప్రయాణిస్తున్న కొందరు మహిళలు చేస్తున్న పనులపై కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని తాజాగా నోటీసులు ఇచ్చింది.
Telangana State Commission for Women has issued a notice to Sri K. Taraka Rama Rao, asking him to appear in person on 24 Aug 2024 regarding alleged derogatory remarks about women.@sharadanerella
— Telangana State Commission for Women (@SCWTelangana) August 16, 2024
KTR's objectionable comments on women
మహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చు అంటూ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడిన కేటీఆర్.
మనిషికో బస్సు పెట్టండి ...కుట్లు, అల్లికలు అవసరం అయితే డాన్స్ లు, రికార్డింగ్… pic.twitter.com/Ytv04X4vwc— Congress for Telangana (@Congress4TS) August 15, 2024
Comments
Please login to add a commentAdd a comment