
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకరంగా నిరసనలు తెలుపుతున్నారు.
కాగా, రాష్ట్ర మహిళా కమిషన్(బుద్ధ భవన్) ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కేటీఆర్‌ను కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు ఆఫీసుకు వచ్చిన కేటీఆర్ ఆరోజు ఆఫీసుకు వచ్చారు. కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ నేతలు కమిషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
అనంతరం, కేటీఆర్ అక్కడికి చేరుకోగానే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో, అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట, ఉద్రికత్త చోటుచేసుకుంది. ఈ తోపులాటలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగినట్టు కూడా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment