మైనర్‌ను పెళ్లాడిన జార్ఖండ్ బీజేపీ చీఫ్ కొడుకు | Minor married to the son of the chief of the BJP in Jharkhand | Sakshi
Sakshi News home page

మైనర్‌ను పెళ్లాడిన జార్ఖండ్ బీజేపీ చీఫ్ కొడుకు

Published Sat, Jul 2 2016 2:33 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మైనర్‌ను పెళ్లాడిన జార్ఖండ్ బీజేపీ చీఫ్ కొడుకు - Sakshi

మైనర్‌ను పెళ్లాడిన జార్ఖండ్ బీజేపీ చీఫ్ కొడుకు

రెండేళ్లుగా మరో అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు

 రాంచీ: జార్ఖండ్ బీజేపీ చీఫ్ తాలా మరాండీ కొడుకు మున్నా 11ఏళ్ల మైనర్‌ను పెళ్లాడటం వివాదాస్పదమైంది. రెండేళ్లుగా మున్నా తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరో అమ్మాయి ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఆగమేఘాల మీద ఈ పెళ్లి జరిగింది. పెళ్లాడతానంటూ  రెండేళ్లుగా మున్నా తనతో సన్నిహితంగా ఉన్నాడని గోఢా జిల్లా కోర్టులో ఆ అమ్మాయి ఫిర్యాదుచేసింది.

బుధవారం ఆమె రాష్ట్ర మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదుచేసింది. మైనర్‌తో వివాహం విషయమై తాలా మరాండీకి నోటీసులలిస్తామని కమిషన్ పేర్కొంది. ఈ వివాహ విందుకు హాజరయ్యేందుకు సిద్ధమైన ఆ రాష్ట్ర సీఎం రఘువర్ దాస్.. పెళ్లి వివాదం తెల్సుకుని తన కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement