
భార్య అందంగా ఉందని యాసిడ్ పోసిన భర్త
భార్యపై అనుమానంతో ఒక భర్త యాసిడ్ దాడికి పాల్పడ్డ కిరాతక ఘటన బెంగళూరు కేజీ నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
గాయాలపాలైన ఆమెను తక్షణం స్థానికులు వెంటనే బాధితురాలిని విక్టోరియా ఆసుపత్రికి తరలించగా, స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మంజులకు 50 శాతం కాలిన గాయాలు అయ్యాయని, ఆమె ఎడమకన్ను పూర్తిగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. బాధితురాలు మంజులను రాష్ట్ర మహిళాకమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి శనివారం ఆస్పత్రిలో పరామర్శించి ఓదార్చారు. మహిళా కమిషన్ తరఫున రూ.3 లక్షల చెక్‌ను బాధితురాలికి అందజేశారు. ఆమెకు ప్రతినెలా రూ.3 వేల పింఛన్ అందిస్తామని, రూ.20 లక్షల వరకు ఆమెకు వైద్యఖర్చులు భరిస్తామని తెలిపారు.