
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ గుర్రుగా ఉంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే సుమోటోగా స్వీకరించింది రాష్ట్ర మహిళ కమిషన్.
ఈ క్రమంలో తాజాగా నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్.. డీజీపీని వ్యక్తిగత విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది కూడా. ఇక ఈనెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా మహిళ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి.. బండి సంజయ్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా.. బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment