
అర్చక బాలిక
కొవ్వూరు : ఆలయంలో భక్తులకు శఠగోపంతో పెట్టి తీర్థప్రసాదాలను సాధారణంగా అర్చకులు అందిస్తుంటారు. కానీ, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మాత్రం పన్నెండేళ్ల బాలిక అర్చకురాలిగా ఆధ్యాత్మిక సేవలో తరించిపోయింది. కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో విశాలక్ష్మి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో సంధ్య అనే బాలిక అర్చక విధులను నిర్వర్తించి ఆశ్చర్యపరిచింది.