Pooja Hegde: లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే.. ధర ఎంతో తెలిస్తే షాకే! | Pooja Hegde Bought New Range Rover Car | Sakshi
Sakshi News home page

Pooja Hegde: లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే.. ధర ఎంతో తెలిస్తే షాకే!

Published Thu, Oct 26 2023 12:43 PM | Last Updated on Thu, Oct 26 2023 1:31 PM

Pooja Hegde buys New Range Rover Car - Sakshi

కెరీర్‌ పరంగా పూజా హెగ్డే చాలా కష్టాల్లో ఉంది. ఇటీవల ఆమె నటించిన చిత్రాలేవి విజయం సాధించలేదు.  ప్రభాస్‌ సరసన నటించిన రాధేశ్యామ్‌, చిరంజీవి, రామ్‌ చరణ్‌తో కలిసి నటించిన ఆచార్య, తమిళంలో విజయ్‌తో జత కట్టిన బీస్ట్‌, హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో చేసిన ‘కిసీకా బాయ్ కిసికి జాన్’చిత్రాలన్ని వరుసగా రిలీజై..డిజాస్టర్స్‌గా మిగిలాయి. దీంతో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ బుట్టబొమ్మకు అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతానికైతే బాలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకుంది ఈ భామ. షాహిద్‌ కపూర్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

కెరీర్‌ పరంగా కొంత గ్యాప్‌ రావడంతో ఆ సమయాన్ని పర్సనల్‌ లైఫ్‌కి కేటాయించింది పూజా. ఇటీవల మాల్దీవుల ట్రిప్‍కు వెళ్లింది. బర్త్‌డేని కూడా గ్రాండ్‌గా సెలెబ్రేట్‌ చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త కారును కొనుగోలు చేసింది. దసరా సందర్భంగా రేంజ్ రోవర్ ఎస్‍వీ ఎస్‍యూవీ కారును పూజా హెగ్డే కొనుగోలు చేశారు.
ప్రసుత్తం పూజా కొత్త కారు ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్స్‌ .. ఆ కారు ధర ఎంత అనేది గూగుల్‌లో సెర్చ్‌ చేసి చూస్తున్నారు. పూజా కొనుగోలు చేసిన కొత్త కారు దాదాపు రూ. 4 కోట్ల వరకు ఉంటుందట. ఈ కారు గరిష్ట వేగం గంటకు 234 కిలోమీటర్లుగా ఉంటుంది.  పూజా గ్యారేజ్‌లో ఇప్పటికే ఆడి Q7, జాగ్వార్ సెడాన్, పోర్స్చే కయెన్ , BMW 5-సిరీస్ సెడాన్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement