Pooja Hegde Reacts on Costly Car Gift by Producers - Sakshi
Sakshi News home page

Pooja Hegde: అలా చేయాలనుకుంటే నాకు కారు కొనివ్వండి: పూజా హెగ్డే

Apr 16 2023 3:55 PM | Updated on Apr 16 2023 4:48 PM

Pooja Hegde Reacts On Costly Car Gift By Producers - Sakshi

బుట్ట బొమ్మ పూజా హెగ్డే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఒకలైలా కోసం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద, డీజే, మహర్షి, అరవింద సమేత, అలా వైకుంఠపురంలో లాంటి  హిట్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

తాజాగా సల్మాన్‌ ఖాన్‌తో కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్‌ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టాలీవుడ్‌లో మహేశ్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద సమేత వీర రాఘవ’, ‘అలా.. వైకుంఠపురములో’ తర్వాత ముచ్చటగా మూడోసారి పూజాకు ఛాన్స్‌ ఇచ్చాడు తివిక్రమ్‌. 

అయితే ఇటీవల బుట్టబొమ్మపై రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం 'కిసీకా భాయ్​ కిసీ కీ జాన్' మూవీ​ ప్రమోషన్లలో పాల్గొన్న రూమర్స్‌పై స్పందించింది. ఇటీవలే డేటింగ్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చిన బుట్టబొమ్మ.. ఓ నిర్మాత కాస్ట్లీ కారు గిఫ్ట్‌ ఇచ్చారన్న రూమర్స్‌పై తాజాగా స్పందించింది. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. కాగా.. బాలీవుడ్​ హీరో హృతిక్​ రోషన్  నటించిన చిత్రం​ 'మొహం​జదారో'తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'హౌస్‌ఫుల్‌- 4', సర్కస్ చిత్రాల్లో కనిపించింది. 

పూజా మాట్లాడుతూ.. 'నా గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. నేను వాటన్నింటినీ చదువుతా. కానీ సమాధానాలు ఇస్తూ కూర్చోలేను. అప్పుడప్పుడు నా పేరేంట్స్ కూడా ఇవన్నీ నిజమేనా అని అడుగుతుంటారు. నేను నటిస్తున్న ఓ సినిమా నిర్మాతలు నాకు కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చారంటూ వార్తలొచ్చాయి. ఒక వేళ నా గురించి చెడుగా ప్రచారం చేయాలనుకుంటే నిజంగా నాకు కారు ఇవ్వండి.' అంటూ చెప్పుకొచ్చింది బుట్టబొమ్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement