సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యాక మంచి సక్సెస్ అయితే డైరెక్టర్స్‌కి హీరోలు, నిర్మాతల నుంచి బహుమతులు వస్తుంటాయి. కానీ రిలీజ్‌కు ముందే ఖిలాడి డైరెక్టర్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ అందింది. మాస్‌రాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్వకత్వంలో రూపొందుతున్న సినిమా ఖిలాడి. ఫిబ్రవరి11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ విజయంపై ఇప్పటికే మేకర్స్ చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు.
ఈ క్రమంలో సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్ రమేశ్ వర్మకు నిర్మాత కోనేరు సత్యనారాయణ అదిరిపోయే బహుమతి ఇచ్చారు. కోటిన్నర రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment