
చైనాలోని హెవెన్ గేట్ ఎక్కుతున్న రేంజ్ రోవర్
చైనా హెవెన్ గేట్.. స్వర్గధామంగా పేరు పొందిన ఈ ప్రదేశాన్ని చేరుకోవాలంటే 99 మలుపులు, నిటారుగా ఉన్న 999 మెట్లు ఎక్కాలి. ఈ ప్రదేశానికి కేవలం నడక ద్వారా మాత్రమే సాధ్యమవుతోంది. కానీ అలాంటి ఈ మలుపులను, మెట్లను చేధించుకుని హెవెన్‌గేటును చేరుకుంది రేంజ్ రోవర్. ఇప్పటి వరకు ఎలాంటి వాహనాలు ప్రయాణించని ఈ మెట్లపై, రేంజ్‌రోవర్ రేంజ్ రోవర్ నాన్-స్టాప్‌గా ప్రయాణించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఎక్కడా ఆగకుండా హెవెన్ గేట్‌ను చేరుకుని రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ ప్రపంచ రికార్డు సృష్టించింది.
చెైనాలోని టియాన్‌మెన్ మౌంటెయిన్ రోడ్డులో అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఏడు మైళ్ల గుండా రోవర్ స్పోర్ట్ ప్రయాణించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ రోడ్డును డ్రాగన్ రోడ్డు అని కూడా పిలుస్తారు.ఈ డ్రాగన్ రోడ్డు ఛాలెంజ్‌లో మొత్తం 99 మలుపులు మరియు నిటారుగా ఉన్న 999 మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల సాధారణంగా మనుషులు నడవడమే ఎంతో కష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది. ఇలాంటి మెట్ల మీద రేంజ్ రోవర్ నాన్-స్టాప్‌గా ప్రయాణించింది. అంతా కొత్తగా రూపొందించిన రేంజ్‌రోవర్ స్పోర్ట్ పీ400ఈ కారు ద్వారా ఈ అసాధ్యాన్ని సుసాధ్యమైంది. తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు కూడా ఇదే కావడం విశేషం. 2.0 లీటరు ఇంజిన్‌తో 295బీహెచ్‌పీని, 85కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్‌తో 394 బీహెచ్‌పీ, 640 ఎన్‌ఎం టర్క్‌ను ఉత్పత్తి చేస్తోంది.
ఈ సవాల్‌ను అధిగమించడానికి ఎస్‌యూవీలో ప్రత్యేకమైన టైర్లను అందించారు. జాగ్వార్ రేసింగ్ బృందం నుంచి హో-పిన్ టుంగ్ రేసర్, రేంజ్ రోవర్ ఎస్‌యూవీని డ్రైవ్ చేసి ఛాలెంజ్ పూర్తి చేశాడు. ఎలాంటి ప్రమాదం సంభవించకుండా, సురక్షితంగా నిటారుగా ఉన్న 999 మెట్ల గుండా సహజ సిద్దంగా ఏర్పడిన ఈ హెవెన్ గేటును చేరుకున్నారు. ప్రపంచంలో ఈ మార్గాన్ని వెహికల్ ద్వారా చేరుకోవడం ఇదే తొలిసారి.
రేంజ్ రోవర్ స్పోర్ట్ నడిపిన డ్రైవర్ హో-పిన్ టుంగ్ మాట్లాడుతూ.. " నేను, ఇప్పటి వరకు ఫార్మాలా ఇ, ఫార్ములా 1, 24 గంటల లి మ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నాను. అయితే, ఇప్పటి వరకు ఇలాంటి కఠినమైన సవాల్‌తో కూడుకున్న డ్రైవింగ్ అనుభవాన్ని ఇదివరకెన్నడూ అనుభవించలేదు. రేంజ్ రోవర్ ఎస్‌యూవీలు తీసుకున్న అత్యంత కఠినమైన సవాళ్లలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. గతంలో పైక్స్ పీక్ కొండను ఎక్కడం, అరేబియన్ భూ భాగంలో నిర్జీవంగా ఉన్న సువిశాలమైన ఎడారిని దాటడం, స్విట్జర్లాండ్‌లోని 7,119 అడుగుల ఎత్తు ఉన్న పల్లపు మంచు పర్వతం నుండి క్రిందకు దిగడం వంటి ఎన్నో సవాళ్లను స్వీకరించింది'' అని తెలిపారు. ఈ మొత్తం ప్రయాణాన్ని 22 నిమిషాల 41 సెకన్లలో చేధించాడు.
Comments
Please login to add a commentAdd a comment