
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చైనా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చైనా తాజాగా.. తన మిత్ర దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ఆయా దేశాలపై ప్రతీకార చర్యలు కఠినంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా..‘బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదు. రాజీ పడితే గౌరవం లభించదు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరదు. స్వల్పకాలిక లాభాల కోసం వెళితే.. అది ఎప్పటికైనా మనకే హాని చేస్తుందన్న విషయాన్ని దేశాలు గుర్తుంచుకోవాలి. చైనా ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో వాణిజ్యపరంగా, ఆర్థికంగా ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని ఎన్నటికీ అంగీకరించబోం. మా నుంచి ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి తాత్కాలికంగా, స్వార్థపూరితంగా లాభం పొందాలనుకోవడం.. పులి చర్మం కోసం దాంతోనే డీల్ చేసుకోవడం లాంటిది’ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే చైనా సహా పలు దేశాలపై టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపివేశారు. అయితే, చైనాకు మాత్రం ఎలాంటి మినహాయింపు లేదని ప్రకటించారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగారు. ఈ మేరకు ఫ్యాక్టషీట్ విడుదల చేసింది.
BREAKING: China warns it will hit back at any country that sides with the US in ways that hurt its interests.
"Deals at China's expense won't be accepted. Expect countermeasures" says Min of Commerce.
During Trump’s #Tariffwar - China didn’t stay silent then, won’t now either. https://t.co/3U3Vv4KTAP pic.twitter.com/jz1WrTDOGh— Amit Bhawani 🇮🇳 (@amitbhawani) April 21, 2025