xi jing ping
-
మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు.. జిన్‌పింగ్ హెచ్చరిక
బీజింగ్: కొత్త ఏడాది వేడుకల వేళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తైవాన్ను చైనాలో కలుపుకోవడాన్ని ఎవరూ ఆపలేరంటూ జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. చైనా, తైవాన్ వేరు కాదంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చైనా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్బంగా జిన్‌పింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తైవాన్ను చైనాలో కలుపుకోవడం ఎవరూ ఆపలేరని అన్నారు. చైనాలో తైవాన్ అంతర్భాగమేనని తెలిపారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజలు ఒకే కుటుంబం. మన రక్త సంబంధాలను ఎవరూ తెంచలేరు. మాతృభూమి పునరేకీకరణను ఎవరూ ఆపలేరు. అందుకే తైవాన్ చుట్టూ వైమానిక, నౌకాదళ విన్యాసాలు చేపట్టినట్లు చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇక, ఇప్పటికే ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెల కొన్నవేళ జిన్‌పింగ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.ఇదిలా ఉండగా.. గత కొద్ది కాలంగా రెండు దేశాల మధ్య ఈ విషయమై ఘర్షణ నడుస్తోంది. చాలాసార్లు చైనా.. తైవాన్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిచింది. నిజానికి చైనా, తైవాన్ దేశాలు పరస్పర విరుద్ధమైన జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. తైవాన్ ప్రజాస్వామ్యదేశం కాగా, చైనా కమ్యూనిస్టు దేశం. ఇటీవల కాలంలో తైపీపై బీజింగ్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. ద్వీపదేశమైన తైవాన్‌కు ప్రపంచదేశాలతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. మే నెలలో తైవాన్ అధ్యక్షుడిగా లాయ్ చింగ్ ఎన్నికైన తర్వాత ఆదేశ ప్రాదేశిక జలాల్లో చైనా ఇప్పటి వరకు మూడు సార్లు భారీ మిలటరీ విన్యాసాలు చేపట్టింది. తైవాన్‌ని బలప్రయోగం ద్వారా తన ఆధీనంలోకి తీసుకురావడానికి చైనా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చాలా సార్లు జల, గగన తలాల్లో నియమాలను ఉల్లంఘించింది.మరోవైపు.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మరో మూడు వారాల్లో అధికారంలోకి రాబోతున్న తరుణంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తైవాన్‌ని అమెరికా ఆసియాలో వ్యూహాత్మక మిత్రదేశంగా భావిస్తోంది. అమెరికా తైవాన్‌కి అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉంది. చైనా నుంచి తైవాన్‌ని రక్షించేందుకు అమెరికా అండగా నిలుస్తోంది. -
మాస్ ఎంట్రీ.. చైనాలో పుతిన్‌కు గ్రాండ్ వెల్కమ్!
బీజింగ్: రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాకు చేరుకున్నారు. పుతిన్ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కీలక చర్చల్లో పాల్గొననున్నారు.ముఖ్యంగా ఉక్రెయిన్‌పై యుద్ధం గురించి చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, రష్యా ఆర్థికంగా బలపడేందుకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్టు సమాచారం. ఇక, ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు విధించడంతో క్రెమ్లిన్ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో, పుతిన్ దిద్దుబాటు చర్యలకు ప్లాన్ చేస్తున్నారు.కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం తెల్లవారుజామునే చైనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చైనాలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. రష్యాకు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పుతిన్ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. కాగా.. జిన్‌పింగ్, పుతిన్ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను మరో లెవల్‌కు తీసుకువెళ్తుందని ఇండిపెండెంట్ రష్యాన్ పొలిటికల్ అనలిస్ట్ కొస్టానియన్ కల్చేవ్ చెప్పుకొచ్చారు. అలాగే, ఇద్దరు నేతల మధ్య 2022 నుంచి మంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 🇷🇺🇨🇳Footage of the arrival of the Russian president in BeijingVladimir Putin made his first foreign visit to China in his new presidential term. pic.twitter.com/g8U5SatXE9— S p r i n t e r F a c t o r y (@Sprinterfactory) May 15, 2024ఇదిలా ఉండగా.. చైనా పర్యటన నేపథ్యంలో పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని పుతిన్ అన్నారు. యుద్ధం గురించి చర్చలు జరిపేందుకు మేమెప్పుడూ నిరాకరించలేదు. ప్రస్తుత ఘర్షణకు శాంతియుత మార్గాల్లో సమగ్ర, సుస్థిర పరిష్కారాన్ని మేం కోరుకుంటున్నాం. ఉక్రెయిన్ విషయంపై సంప్రదింపులకు మేం సిద్ధం. కానీ ఆ చర్చల్లో మాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి అని కామెంట్స్ చేశారు. 🇨🇳Chinese President Xi Jinping to hold a welcome ceremony for🇷🇺Russian President Vladimir Putin, who is paying a two-day state visit to China.What does this visit mean?More details and my analysis to come. pic.twitter.com/B4GFnzssY5— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) May 16, 2024 -
చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
అగ్ర రాజ్యం అమెరికాలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ తరుణంలో ట్రంప్.. చైనాపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలో చైనా తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మిలిటరీ ఏజ్’లో ఉన్న ఆ దేశ పౌరులు ఓ సైన్యంగా మారేందుకు అమెరికాకు వస్తున్నారని, వాళ్లు సైన్యంగా మారి దాడిచేస్తారని అన్నారు. వీరిలో యువకులే ఎక్కువగా ఉన్నారు. వారిని చూస్తుంటే మన దేశంలో చిన్న సైన్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారా అనిపిస్తోంది. వారి ప్రయత్నం కూడా అదేనా? అంటూ ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి వారికి తగిన బుద్ధిచెబుతామన్నారు.ఇదిలా ఉండగా.. కోవిడ్ పరిణామాల అనంతరం అమెరికాకు చైనాకు అక్రమ వలసలు పెరిగినట్టు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కోవిడ్ తర్వాత ఎక్కువ సంఖ్యలో చైనీయులు.. దక్షిణ అమెరికాకు విమానాల్లో చేరుకొని.. అక్కడి నుంచి ప్రమాదకరమైన మార్గాల్లో, కాలినడకన ఉత్తర అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైనే ట్రంప్ తాజాగా ఆరోపణలు చేశారు.మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనాకు షాకిచ్చారు. బ్యాటరీలు, ఈవీలు, స్టీల్, సోలార్ సెల్స్, అల్యూమినియంతో సహా చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారీ సుంకాలను విధించారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలపై 100%, సెమీకండక్టర్లపై 50% సుంకం, చైనా నుండి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలపై 25% సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు కావాల్సింది చైనాతో వివాదం కాదు. పోటీ కావాలి అని చెప్పుకొచ్చారు. ఆర్థికంగా చైనాతో పోటీ పడటానికి తాము మెరుగైన స్థితిలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. Biden claims he'll impose a 100% tariff on EVs made in China.He does not mention China barely relies on the U.S. for its EV sales (thanks to President Trump's Section 301 tariffs) and will simply manufacture vehicles in Mexico, then ship them into the U.S. pic.twitter.com/A0q97tgaUT— RNC Research (@RNCResearch) May 14, 2024 -
చైనాకు రష్యా అధ్యక్షుడు పుతిన్.. కీలక చర్చలు!
బీజింగ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపటి నుంచి(మే 16) నుంచి రెండు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్.. చైనా పర్యటనపై ఆసక్తి నెలకొంది. పుతిన్, జిన్‌పింగ్ మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందోనన్న చర్చ నడుస్తోంది.కాగా, పుతిన్ ఇటీవలే రష్యాకు ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా, తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా పుతిన్.. చైనాకు వెళ్లనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పుతిన్ తమ దేశంలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే, రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్‌పింగ్ ఆహ్వానంపైనే పుతిన్ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.ఇక, ఈ పర్యటనలో భాగంగా పుతిన్.. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీరి భేటీలో ఉక్రెయిన్-రష్యా దాడుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధం పరిణామాలు, సంక్షోభం గురించి మాట్లాడనున్నట్టు చైనా మీడియా పేర్కొంది. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో శాంతి కోసం చైనా ప్రతిపాదనలకు తాము సానుకూలంగా ఉండాలనుకున్నట్టు రష్యా తెలిపింది. President Putin gave an interview to Xinhua News Agency right before his China visitThe President noted that Russia positively assesses China’s approaches to resolving the Ukrainian crisis, and Beijing understands its “root causes”.President Putin responded to China's… pic.twitter.com/k2yaxzjQ3U— jamiemcintyre (@jamiemcintyre21) May 15, 2024 మరోవైపు.. గడిచిన ఎనిమిది నెలల్లో పుతిన్ చైనాను సందర్శించడం ఇది రెండోసారి. ఇదిలా ఉండగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతవారమే యూరప్‌లో ఐదు రోజుల పర్యటన ముగించుకొని చైనాకు వెళ్లారు. -
చైనాలో ఆర్థిక మాంద్యం?.. నిజాలు వెళ్లగక్కిన జిన్‌పింగ్!
నూతన సంవత్సరం తొలి రోజున చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు గురించి మాట్లాడారు. దేశంలోని ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. దేశ ప్రజలు నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు. నూతన సంవత్సర సందేశంలో జీ జిన్‌పింగ్ దేశ ఆర్థిక సవాళ్లను ప్రస్తావించడం ఇదే మొదటిసారి. జీ జిన్‌పింగ్ గడచిన పదేళ్లుగా అంటే 2013 నుండి నూతన సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా తర్వాత చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినప్పటికీ పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న వ్యాపార డిమాండ్ కారణంగా చైనా మాంద్యంతో పోరాడుతోంది. జీ జిన్‌పింగ్ తన టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడుతూ దేశంలో కొన్ని వ్యాపారరంగాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. జనం ఉద్యోగాలు దొరక్క, కనీస అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు తన మనసులో ఎప్పుడూ తిరుగాడుతుంటాయని జీ జిన్‌పింగ్ అన్నారు. ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడానికి, బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా జీ జిన్‌పింగ్ ప్రసంగానికి కొన్ని గంటల ముందు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)కి సంబంధించిన డేటాను విడుదల చేసింది. చైనాలో గడచిన డిసెంబర్లో పారిశ్రామిక కార్యకలాపాలు ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయని ఆ డేటా వెల్లడించింది. నవంబర్‌లో 49.4గా ఉన్న పీఎంఐ గత నెలలో 49కి పడిపోయింది. చైనా పీఎంఐ క్షీణించడం ఇది వరుసగా మూడోసారి. గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాల్లో స్వల్ప పెరుగుదల తర్వాత, అధికారిక పీఎంఐ సెప్టెంబర్ వరకు వరుసగా ఐదు నెలల పాటు 50 కంటే తక్కువగా ఉంది. -
Nuclear test: డ్రాగన్‌పై అణుమానాలు!
డ్రాగన్ దేశం మళ్లీ అణు పరీక్షలకు సిద్ధపడుతోందా? అందుకోసం చాపకింద నీరులా కొన్నేళ్లుగా క్రమంగా పక్కాగా ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వస్తోందా? ఏ క్షణంలోనైనా భారీ స్థాయిలో అణు పరీక్షలు చేపట్టనుందా? అంటే అవుననే అంటోంది తాజా పరిశోధన ఒకటి. అణు నిరాయు«దీకరణ చర్యలను వేగవంతం చేసేందుకు అమెరికా ప్రయతి్నస్తున్న ఈ తరుణంలో చైనా తాజా చర్యలు కలకలం రేపుతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ ఆయుధ పోటీ ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి... అది వాయవ్య చైనాలోని మారుమూల జిన్జియాన్ అటానమస్ ఏరియా. అక్కడి ఓ ప్రాంతంలో కొన్నేళ్లుగా పలురకాలుగా హడావుడి పెరుగుతూ వస్తోంది. రకరకాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. కొండల్ని తొలిచి సొరంగాల్లాంటివి వేసే పనులూ సాగుతున్నాయి. ఇంకోవైపు కొత్త వైమానిక స్థావరం నిర్మాణంలో ఉంది. దానికి కొద్ది దూరంలోనే ఓ చిన్నపాటి శాటిలైట్ టౌన్ పుట్టుకొస్తోంది. బయటి ప్రపంచం దృష్టిలో పడకుండా అత్యంత పకడ్బందీగా జరుగుతున్న ఈ కార్యకలాపాలన్నీ ప్రముఖ అంతర్జాతీయ నిఘా నిపుణుడు డాక్టర్ రెనీ బాబియార్జ్ బయట పెట్టిన ఉపగ్రహ చిత్రాలతో తాజాగా వెలుగులోకి వచ్చాయి. దాంతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ఇవన్నీ జరుగుతున్నది 1964లో చైనా తొలిసారి అణు పరీక్షలు జరిపిన లోప్‌నూర్ ప్రాంతంలో కావడమే అందుకు కారణం! త్వరలో భారీ ఎత్తున అణు పరీక్షలకు చైనా సిద్ధమవుతోందనేందుకు ఇవన్నీ తిరుగులేని ఆధారాలని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ మాజీ విశ్లేషకుడు కూడా అయిన రెనీ లోప్‌నూర్‌లో కార్యకలాపాలకు సంబంధించి కొన్నేళ్లుగా తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను లోతుగా పరిశీలించారు. ఆ మీదట ఆయన అందజేసిన సాక్ష్యాల ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. పక్కాగా ఏర్పాట్లు...!: న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని అభూత కల్పనగా చైనా కొట్టిపారేసింది. ఏదేదో ఊహించుకుని రాసిన నిరాధార కథనంగా దాన్ని అభివరి్ణంచింది. కానీ ఉపగ్రహ చిత్రాల్లో వెలుగు చూసిన విషయాలు మాత్రం చైనా కచి్చతంగా ఏదో దాస్తోందనేందుకు ఊతమిస్తున్నాయి. ఎందుకంటే ఒకట్రెండు శిథిల భవనాలు తప్ప 2017 దాకా నిద్రాణావస్థలోనే ఉన్న లోప్‌నూర్ ప్రాంతంలో గత కొన్నేళ్లలో అత్యాధునిక భవనాల భవన సముదాయాలు పుట్టుకొచి్చన వైనం ఆ చిత్రాల్లో స్పష్టంగా కని్పస్తోంది. అంతేగాక నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చిన ఓ పటిష్టమైన బంకర్ కూడా ఉందక్కడ. దాని చుట్టూ ఎత్తైన రక్షణ గోడలు, పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థలు తదితరాలు కూడా కొట్టొచ్చినట్టు కని్పస్తున్నాయి. వీటితో పాటు ఏకంగా 90 అడుగుల ఎత్తైన డ్రిల్లింగ్ యంత్రం, ఆ పక్కనే డ్రిల్లింగ్ పైపులు కూడా ఉన్నాయి. దాని సాయంతో బహుశా నేలలోకి నిలువుగా కనీసం పావు మైలు లోతైన రంధ్రం చేసి అందులో అణ్వాయుధంతో కూడిన పేలుడు పదార్థాన్ని పేల్చి పరీక్షిస్తారన్నది బాబియార్జ్ అంచనా. లోప్నూర్కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో మలాన్ ప్రాంతంలో కూడా ఓ అత్యాధునిక శాటిలైట్ సిటీ నిర్మాణంలో ఉన్నట్టు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. అక్కడ కూడా రిగ్గింగ్ యంత్రాలు తదితర సెటప్ కనబడుతోంది. ఇదంతా బహుశా లోప్‌నూర్ అణు పరీక్ష పనుల్లో పాల్గొనే సిబ్బందికి పూర్తిస్థాయిలో ముందస్తు శిక్షణ కోసమని భావిస్తున్నారు. ప్రాంతీయ భద్రతకు ముప్పే చైనా అణు దూకుడు ఆసియాలో ప్రాంతీయ భద్రతను కూడా ప్రమాదంలో పడేసే పరిణామమేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చైనాతో సాయుధ ఘర్షణలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇది మరీ ఇబ్బందికర పరిణామమే కానుంది. 1998 ఫోఖ్రాన్ అణు పరీక్షల అనంతరం వాటిపై భారత్ స్వీయ నిషేధం విధించుకోవడం తెలిసిందే. అణు పరీక్షలు ఎందుకంటే... చైనా అణు పరీక్షలకు దిగనుండటమే నిజమైతే అందుకు కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. అందుకు రక్షణ నిపుణులు పలు కారణాలను చూపుతున్నారు.... ► అణు కార్యకలాపాల విషయంలో కొద్దికాలంగా చైనా దూకుడు పెంచింది. ► దశాబ్దం క్రితం దాకా దానివద్ద కేవలం 50 ఖండాంతర క్షిపణులు మాత్రమే ఉండేవి. ► వాటిని 2028 కల్లా ఏకంగా 1,000కి పెంచాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇటీవలే పెంటగాన్ వార్షిక నివేదిక వెల్లడించింది. ► వీటిలో 507 క్షిపణులను అణు సామర్థ్యంతో కూడినవిగా చైనా తీర్చిదిద్దనున్నట్టు తెలుస్తోంది. ► ఈ దిశగా కొంతకాలంగా పలు అత్యాధునిక అణు వార్హెడ్లను చైనా తయారు చేస్తోంది. ► వాటిని అధునాతన ఖండాంతర, క్రూయిజ్ మిసైళ్లకు అనుసంధానిస్తూ వస్తోంది. ► ఆ వార్హెడ్లను పూర్తిస్థాయిలో పరీక్షించి సరిచూసుకునే ఉద్దేశంతో డ్రాగన్ దేశం ఇలా అణు పరీక్షలకు సిద్ధమవుతోందని అనుమానిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జిన్‌పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట!
వాషింగ్టన్: రెండు అగ్రరాజ్యాల అధ్యక్షులు జో బైడెన్, జిన్‌పింగ్ బుధవారం భేటీ అయ్యారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దాదాపు ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ అనంతరం బయటకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని నియంతగానే విశ్వసిస్తున్నానని చెప్పారు. చైనా ప్రభుత్వం, తమ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుందని అన్నారు. జిన్‌పింగ్‌ను నియంతలాగే చూస్తున్నారా..? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో బైడెన్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఏడాది జూన్‌లోనూ బైడెన్ ఇదే మాట మాట్లాడారు. అప్పట్లోనే బైడెన్ తీరును చైనా ఖండించింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. కాగా.. కాలిఫోర్నియాలోని ఒక విశాలమైన భవనంలో ఈ సమ్మిట్ ముగిసింది. రెండు దేశాల మధ్య విబేధాలు సమసిపోయేలా, దౌత్య సంబంధాలు తప్పదోవపట్టకుండా కృషి చేయడానికి అధ్యక్షులు అంగీకరించారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్, పశ్చిమాసియా, ఉక్రెయిన్, తైవాన్, ఇండో-పసిఫిక్, ఆర్థిక సమస్యలు, కృత్రిమ మేధస్సు, మాదక ద్రవ్యాల సరఫరా, వాతావరణం వంటి ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు. అమెరికాలో అక్రమ మాదక ద్రవ్యాల వాణిజ్యం చేపడుతున్న చైనా సంస్థలపై చర్యలు తీసుకుంటానని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. అమెరికాను ఇరుకున పెట్టాలనే ఉద్దేశం లేదని జిన్‌పింగ్ స్పష్టంగా తెలియజేశారు. అలాగే.. అమెరికా కూడా చైనాను అణగదొక్కే చర్యలకు పాల్పడకూడదని పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు వివాదాలకు దారితీయకుండా చర్యలు తీసుకోవాలని ఇద్దరు అధ్యక్షులు అంగీకారానికి వచ్చారు. తైవాన్ అంశం ఇరుదేశాల మధ్య సంబంధాలకు చాలా సున్నితమైన అంశంగా మారిందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. తైవాన్ స్వాతంత్య్రానికి అమెరికా మద్దతు ఇవ్వకూడదని కోరుతూ.. ఆయుధ సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ -
చైనా ప్రధానిగా కియాంగ్
బీజింగ్: చైనా ప్రధానిగా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్తుడైన లీ కియాంగ్ (63) నియమితులయ్యారు. పాలక చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) తీసుకున్న ఈ నిర్ణయానికి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సు ఈ మేరకు లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. లీ పేరును జిన్‌పింగ్ స్వయంగా ప్రతిపాదించారు. అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడం విశేషం! మొత్తం 2,936 మంది ఎన్పీసీ సభ్యుల్లో ముగ్గురు లీకి వ్యతిరేకంగా ఓటేయగా మరో 8 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అనంతరం లీ నియామక ఉత్తర్వులపై జిన్‌పింగ్ సంతకం చేశారు. ఆ వెంటనే ప్రస్తుత ప్రధాని లీ కీ కియాంగ్ నుంచి లీ బాధ్యతలను స్వీకరించారు. ఒడిదుడుకులమయంగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే గురుతర బాధ్యత ఆయన భుజస్కందాలపై ఉంది. అందుకు చేపట్టబోయే చర్యలను మార్చి 13న మీడియా సమావేశంలో వెల్లడిస్తారని భావిస్తున్నారు. లీకి వ్యాపారవేత్తల పక్షాన నిలుస్తారని పేరుంది. తాజా మాజీ ప్రధాని లీ కి కియాంగ్‌కు కొన్నేళ్లుగా జిన్‌పింగ్‌తో దూరం పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు అధ్యక్ష పీఠానికి పోటీదారుగా నిలిచిన ఆయన ప్రధానిగా తన అధికారాలకు జిన్‌పింగ్ పూర్తిగా కోత పెట్టడంపై అసంతృప్తిగా ఉన్నారు. పదవి నుంచి వైదొలగిన ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా రిటైరవుతున్నారు. -
మరింత శక్తివంతంగా చైనా సైన్యం
బీజింగ్: భారత్, తైవాన్లతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. అందులోభాగంగా రక్షణ బడ్జెట్‌ను వరసగా ఎనిమిదోసారి పెంచింది. దీంతో చైనా రక్షణ బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే 7.2 శాతం ఎగసి 1.55 ట్రిలియన్ యువాన్లకు చేరుకుంది. గత ఏడాది 1.45 ట్రిలియన్ యువాన్లు కేటాయించింది. డాలర్లలో చూస్తే గత కేటాయింపులు 230 బిలియన్ డాలర్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి డాలర్‌తో యువాన్ మారకం విలువ తగ్గడంతో కేటాయింపులు గతంతో పోలిస్తే కాస్త తక్కువగా 225 బిలియన్ డాలర్లుగా నమోదవడం గమనార్హం. బడ్జెట్ వివరాలను ఆదివారం దేశ పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్–ఎన్సీపీ)లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆ దేశ ప్రధాని లీ కెక్వియాంగ్ సరిహద్దులో సైన్యం విజయాలను గుర్తుచేశారు. ‘ సరిహద్దుల్లో ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. సరిహద్దు రక్షణ, ప్రాదేశిక సముద్రజలాలపై హక్కుల పరిరక్షణ, కోవిడ్ సంక్షోభం వంటి వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నాం’ అంటూ పరోక్షంగా తూర్పు లద్దాఖ్‌ను ప్రస్తావించారు. ‘ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతాబ్ది ఉత్సవాల నాటికి పెట్టుకున్న లక్ష్యాలను పూర్తిచేసేలా సైనిక చర్యలను చేపట్టాలి’ అని ఆర్మీనుద్దేశించి అన్నారు. దక్షిణ, తూర్పు సముద్ర జల్లాలపై పూర్తి హక్కులు తమకే దక్కుతాయని వాదిస్తూ పొరుగు దేశాలతో చైనా ఘర్షణలకు దిగడం తెల్సిందే. వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్‌లతో చైనా తగవులకు దిగుతోంది. ఈ ఆర్థికసంవత్సరంలో భారత రక్షణ బడ్జెట్ కేటాయింపులు 72 బిలియన్ డాలర్లుకావడం గమనార్హం. -
చైనాలో ‘సైనిక కుట్ర’పై... అదే అస్పష్టత
బీజింగ్: చైనాలో సైనిక కుట్ర జరిగిందనీ, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను నిర్బంధించారని వచ్చిన వార్తల్లో నిజానిజాలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ వదంతులే కావచ్చని పరిశీలకులు అంటున్నారు. ఎస్సీవో శిఖరాగ్రం కోసం రెండేళ్ల తర్వాత దేశం దాటిన నేపథ్యంలో జిన్‌పింగ్ తిరిగి రాగానే క్వారంటైన్లో ఉండి ఉంటారని అంటున్నారు. 2021లోనూ జిన్‌పింగ్ కొన్ని రోజులు కనిపించకపోయేసరికి ఇలాగే పుకార్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. కాకపోతే శనివారమంతా ఇంటర్నెట్ ‘కుట్ర’ వార్తలతో హోరెత్తినా ఇలాంటి వాటిపై చురుగ్గా ఉండే చైనా సోషల్ మీడియా ఇప్పటిదాకా స్పందించకపోవడం ఆశ్చర్యమేనంటున్నారు. బహుశా అక్టోబర్ 16వ తేదీన అధ్యక్ష ఎన్నిక నాటికే దీనిపై స్పష్టత వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
తైవాన్‌కు మద్దతు తెలిపిన అమెరికా ప్రజాప్రతినిధులు
తైపీ: తైవాన్ను దురాక్రమణ చేయాలని చైనా రంకెలు వేస్తున్న నేపథ్యంలో అయిదుగురు అమెరికా ప్రజాప్రతినిధులు ఆకస్మికంగా ఆదేశానికి వెళ్లారు. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ను శుక్రవారం కలుసుకున్నారు. తైవాన్ స్వయం పాలనకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా తైవాన్, చైనా మధ్య ఘర్షణలు తారాస్థాయికి వెళ్లాయి. తైవాన్ స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా అధినేత బైడెన్‌కు ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. -
సెటైర్: మా ఎన్నికల కోసం చైనా అధ్యక్షుడు!!
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. ఈ తరుణంలో చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ మా ఎన్నికల కోసం రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? ఎవరికీ అందని ఈ ఊహను తన కామెడీ టైమింగ్‌తో తెర మీదకు తెచ్చాడు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ నటుడు బ్రహ్మాజీకి ఏకంగా షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, కరోనా జాగ్రత్తతో మన నటుడు మర్యాదపూర్వకంగా ఆ షేక్‌హ్యాండ్‌ను తిరస్కరించి.. నమస్తే పెట్టాడు. పైగా ఆ ఫొటోలో జింగ్ పిన్ కనీసం మాస్క్ లేకుండా ఉన్నాడు. అఫ్కోర్స్.. అది జింగ్ పిన్ పాత ఫొటోనే అయినా ఎడిటింగ్ గమ్మత్తుతో భలేగా దానిని ప్రజెంట్ చేశాడు బ్రహ్మాజీ. ‘‘క్యాజువల్ మీట్.. ఎలాంటి రాజకీయాలు లేవు. కాకపోతే మా ఎన్నికల గురించి చర్చించాం. జింగ్ పిన్ కొన్ని సలహాలు ఇచ్చాడు. అలాగే..’’ అంటూ ఫన్నీ ఎమోజీతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బ్రహ్మాజీ. ఇక తన తోటి నటులతో పాటు సమకాలీన విషయాలపై సెటైర్లు వేసే బ్రహ్మాజీ.. ఈమధ్యే తనకు భారీగా బంఫర్లాటరీ తగిలిందంటూ ‘ఫేక్ స్కాంకు సంబంధించిన ఒక అలర్ట్ మెసేజ్‌ను నెటిజన్స్ దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Actor Brahmaji (@brahms25) చదవండి: మా ఎన్నికల్లో మరో ట్విస్ట్.. బరిలో ఆయన! -
బ్రహ్మపుత్రపై చైనా భారీ ప్రాజెక్టు
బీజింగ్: తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారక ముందే చైనా మరో వివాదానికి తెరలేపింది. టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది దిగువ భాగంలో అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. చైనా అభివృద్ధి పేరుతో మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికకు గురువారం ఆ దేశ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (సీపీసీ) ఆమోదించింది. అందులో బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ నిర్మాణం కూడా ఉంది. గత ఏడాది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ఆమోదించిన బ్లూ ప్రింట్‌ను ఆ దేశ పార్లమెంటు య«థాతథంగా ఆమోదించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని లీ కెక్వియాంగ్, 2 వేల మందికి పైగా ఇతర నాయకులు కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఏడాదే బ్రహ్మపుత్రపై ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కమ్యూనిస్టు పార్టీ టిబెట్ అటానమస్ రీజియన్ డిప్యూటీ చీఫ్ చె డల్హా ఇప్పటికే వెల్ల డించారు. ఈ డ్యామ్ నిర్మాణానికి సంబం«ధించిన ప్లాన్, ఇతర పర్యావరణ అనుమతులు యుద్ధ ప్రాతిపదికన ఇస్తారని గతంలోనే దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలోనే ఎత్తయిన నది కాలుష్యం, తద్వారా భూతాపం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో 2060 నాటికి కర్బన్ ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. టిబెట్‌లో హైడ్రో పవర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. జల విద్యుత్ ప్లాంట్లను నిర్మించనుంది. చైనా చర్యలను టిబెట్ పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిని డోర్జీ పాగ్మో అనే దేవత శరీరంగా టిబెట్ ప్రజలు ఆరాధిస్తారు. టిబెటన్ సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ పవిత్ర నదికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. పశ్చిమ టిబెట్‌లోని హిమానీనదాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నదిగా పేరుగాంచింది. చైనాలో యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలో భారీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. బ్రహ్మపుత్రపై నిర్మించే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో త్రీ గోర్జెస్ కంటే మూడు రెట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. మెడోగ్ కౌంటీలో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 14 వేల మంది నిరాశ్రయులవుతారని అంచనా. భారత్ ఆందోళనలేంటి? టిబెటన్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో (టీఏఆర్) బ్రహ్మపుత్రపై (యార్లంగ్ సాంగ్‌పొ నది) చైనా తలపెట్టిన ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కానుంది. దీని నిర్మాణంపై భారత్, బంగ్లాదేశ్‌లు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్‌లలో నీటి అవసరాలను తీరుస్తోంది. బ్రహ్మపుత్ర ఎగువ భాగంలో ఎన్నో ప్రాజెక్టుల్ని నిర్మించిన చైనా ఇప్పుడు దిగువ భాగంపై కన్నేసింది. అరుణాచల్‌కి సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైంది. 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగే ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలకు నీటికి కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అంతే కాకుండా వరదలు వంటివి సంభవించినప్పుడు గేట్లు ఎత్తేస్తే దిగువ ప్రాంతాలు కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు భారత్‌కి చైనా ఎలాంటి సమాచారం అందించలేదు. హాంకాంగ్ ఎన్నికల వ్యవస్థపైనా చైనా నియంత్రణ హాంకాంగ్‌పై మరింతగా పట్టు పెంచుకునేలా చైనా అడుగులు ముందుకి వేస్తోంది. అక్కడ ఎన్నికల వ్యవస్థని తన గుప్పిట్లో ఉంచుకునేలా పాట్రియాట్స్ గవర్నింగ్ హాంకాంగ్ తీర్మానాన్ని చైనా పార్లమెంటు గురువారం ఆమోదించింది. దీని ద్వారా హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రతినిధుల సంఖ్య తగ్గి, చైనా అనుకూల ప్యానెల్ తమకు నచ్చినవారిని నామినేట్ చేసే అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజాస్వామ్య స్థాపన కోసం హాంగ్‌కాంగ్‌లో వెల్లువెత్తుతున్న ఉద్యమాలను అణచివేతకే చైనా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలొచ్చాయి. ఈ తీర్మానానికి చైనా పార్లమెంటు 2,895–0 ఓట్ల తేడాతో ఆమోదించింది. దీనిని పార్లమెంటు సభ్యుల్లో ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. మరో పార్లమెంటు సభ్యుడు సమావేశాలకు హాజరు కాలేదు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా చేసిన తీర్మానాలను అక్కడ పార్లమెంటు ఎప్పుడూ ఏకగ్రీవంగానే ఆమోదిస్తుంది. తీర్మానంపై ఓటు వేస్తున్న జిన్‌పింగ్ -
కరోనా పాపం చైనాదే
ఐక్యరాజ్య సమితి: కరోనా పాపం చైనాదే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తికి చైనాదే బాధ్యతగా ఐక్యరాజ్య సమితి గుర్తించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఆన్లైన్లో చేరిన ట్రంప్ మాట్లాడుతూ చైనా వైరస్ కారణంగా 188 దేశాల్లో ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు. ‘కనిపించని శత్రువు చైనా వైరస్‌తో తీవ్రమైన యుద్ధం చేశాం. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్న మనం ప్రపంచం మీదకు ప్లేగు లాంటి వ్యాధిని వదిలిన చైనాను... ఆ పాపం తనదే అని అంగీకరించేలా చేయాలని ట్రంప్∙అన్నారు. కరోనా వైరస్ చైనా లోనే పుట్టిందని, ఆ దేశ ప్రభుత్వం ఈ ప్రమాద కరమైన వైరస్ వ్యాప్తి విషయంలో బాధ్యతా రహి తంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు. కోవిడ్ విషయంలో అమెరికా యుద్ధ ప్రాతిపదికన స్పందించిందని, రికార్డు సమయంలో వెంటి లేటర్లను సమకూర్చడంతోపాటు, చాలా వేగంగా అత్యవసర చికిత్సలను అభివృద్ధి చేశామని, తద్వారా వ్యాధి కారణంగా జరుగుతున్న ప్రాణనష్టాన్ని 85 శాతం వరకూ తగ్గించగలిగామని ట్రంప్ వివరించారు. కోవిడ్ నివారణకు టీకాను అభివృద్ధి చేసిన తరువాత ప్రపంచం సరికొత్త శాంతి, సహకార, సమృద్ధతల్లో కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరితోనూ యుద్ధం చేసే ఉద్దేశం లేదు: జిన్‌పింగ్ ఒకవైపు అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూండగానే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జనరల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏ దేశంతోనూ ప్రత్యక్ష లేదా పరోక్ష యుద్ధం చేసే ఉద్దేశం చైనాకు లేదని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ‘ఇతరులతో ఉన్న భేదాభిప్రా యాలను, వివాదాలను తగ్గించుకునేందుకు ప్రయత్నం కొనసాగుతుంది. చర్చలు, ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వివాదాల పరిష్కా రానికి ప్రయత్నిస్తాం’ అని ఆయన తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. కరోనావ్యవహారాన్ని రాజకీయం చేయడం, విభేదాలు సృష్టించడం ఆపాలని స్పష్టం చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం తల్లకిందులైపోయిందని ప్రభుత్వాధినేతలతో కిటకిటలాడే జనరల్ అసెంబ్లీ నేడు బోసిపోయి కనిపించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అసమానతలను కరోనా వైరస్ అందరి దృష్టికి తెచ్చిందని, భారీ స్థాయి ఆరోగ్య విపత్తును తీసుకొచ్చిందని∙వివరించారు. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతోపాటు కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని, మానవ హక్కుల వంటి అనేక సమస్యలు మళ్లీ సవాళ్లుగా పరిణమిస్తున్నాయని అన్నారు. -
చైనా దుస్సాహసం జిన్‌పింగ్ ఆలోచన
వాషింగ్టన్: భారత్ సరిహద్దుల్లో ఇటీవలి చైనా దుశ్చర్యలకు వ్యూహరచన ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌దేనని తాజాగా వెల్లడైంది. తన భవిష్యత్తును పణంగా పెట్టి ఈ ప్రమాదకర ఎత్తుగడకు జిన్‌పింగ్ తెరతీశారని, అయితే, భారత సైనికులు వీరోచితంగా ఎదురు నిలవడంతో ఆ వ్యూహం విఫలమైందని అమెరికాకు చెందిన పత్రిక ‘ద న్యూస్‌వీక్’ పేర్కొంది. ఈ వైఫల్యం విపరిణామాలను జిన్‌పింగ్ ఎదుర్కోవాల్సి రావచ్చని అభిప్రాయపడింది. అయితే, దీన్ని కారణంగా చూపి సైన్యంలోని విరోధులకు చెక్ పెట్టేందుకు ఆయన ప్రయత్నించవచ్చని వెల్లడించింది. అలాగే, భారత్‌పై సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు దిగవచ్చని పేర్కొంది. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. అయితే, చైనా వైపు కూడా మరణాలు సంభవించినప్పటికీ.. ఆ సంఖ్యను చైనా నేటికీ వెల్లడించలేదు. ఆ ఘర్షణల్లో చైనాకు చెందిన కనీసం 43 మంది సైనికులు చనిపోయి ఉంటారని తాజాగా న్యూస్‌వీక్ పేర్కొంది. ఆ సంఖ్య గరిష్టంగా 60 వరకు ఉండొచ్చని ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్‌కు చెందిన క్లియొ పాస్కల్‌ను ఉటంకిస్తూ వెల్లడించింది. ఐదు దశాబ్దాల్లో తొలిసారి గత నెలలో చైనా ఆర్మీపై భారత సైనికులు దుందుడుకుగా ముందుకువెళ్లి, కీలక పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్నారని, ఇది చైనా సైనికులను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆ కథనంలో న్యూస్‌వీక్ పేర్కొంది. గతంలో చైనా ఆధీనంలో ఉన్న మూడు కీలక ప్రాంతాలను తాజాగా భారత్ కైవసం చేసుకుందని వెల్లడించింది. ముఖాముఖి ఘర్షణల్లో చైనా గ్రౌండ్ ఫోర్స్‌కు ఘన చరిత్ర ఏమీ లేదని, వియత్నాంతో యుద్ధంలో ఓటమిని గుర్తు చేస్తూ వ్యాఖ్యానించింది. భారత సైనికులు కొత్తగా నూతనోత్తేజంతో కనిపిస్తున్నారని, దూకుడుగా ఎదురుదాడికి దిగుతున్నారని ప్రశంసించింది. -
మూడ్ లేదు.. ఇక తెగతెంపులే
వాషింగ్టన్: కరోనావైరస్ మహమ్మారి విషయంలో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందంటూ పదే పదే విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో చర్చలు జరిపే మానసిక స్థితి (మూడ్) తనకు లేదని మండిపడ్డారు. అంతేకాదు చైనాతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోనున్నామని, జిన్‌పింగ్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు. తాము చేయాల్సినవి చాలా వున్నాయి...చైనాతో మొత్తం సంబంధాలను తెంచుకునే యోచనలో ఉన్నామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. నిజానికి జీ జిన్‌పింగ్ తనకు చాలా మంచి సంబంధాలే ఉన్నాయనీ, కానీ ప్రస్తుతం అతనితో మాట్లాడే ఆసక్తిలేదు. చాలా నిరాశకు గురయ్యానని ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా సరిగా వ్యవహరించలేదని, వైరస్ వ్యాప్తిని ఆపి వుండాల్సిందంటూ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చైనా పెట్టుబడుల నుండి యుఎస్ పెన్షన్ ఫండ్‌ను ఉపసంహరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. (కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక) కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షలమందిని పొట్టన పెట్టుకోగా, ఇందులో 86 వేలకు పైగా మరణాలు అమెరికాలోనే నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటన వెలువడింది. కాగా కోవిడ్-19 వ్యాప్తి విషయంలో చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ట్రంప్ ప్రతీకారంగా చైనా ఈక్వీటీ మార్కెట్లలో పెట్టాలని నిర్ణయించిన భారీ పెట్టుబడుల్ని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు ఇటీవల వ్యార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే. (వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు) -
కోవిడ్ మృతులు 2 వేలు
బీజింగ్/టోక్యో: చైనాలో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 2,004కు చేరుకోగా, బాధితుల సంఖ్య 74,185కు చేరుకుంది. దాదాపు 25 దేశాల్లోని వెయ్యిమందికి వ్యాధి సోకినట్లు అధికారులు నిర్ధారించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు వ్యాధిబారిన పడడంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా పౌరులు తమకు కావాల్సిన ఆహారం, నిత్యావసరాలను ఆన్లైన్లో ఇంటి వద్దకే తెప్పించుకుంటున్నారు. దీంతో ఈ కామర్స్ సంస్థలకు గిరాకీ భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే తమ వద్ద ఉన్న 1.80 లక్షల మంది సిబ్బందికి అదనంగా 20వేల మందిని నియమించుకున్నట్లు జేడీ డాట్ కామ్ పేర్కొంది. కోవిడ్ భయంతో జపాన్ తీరంలో 14 రోజులుగా నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్ ఓడ నుంచి కరోనా లక్షణాలు లేని 500 మంది బయటకు వచ్చారు. ఓడలోని 3,711 మందిలో 542 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. కోవిడ్ కట్టడిలో చైనా విఫలమైందంటూ ఈ నెల 3వ తేదీన ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన ‘చైనాయే అసలైన రోగి’ (చైనా ఈజ్‌ది రియల్ సిక్ మ్యాన్ ఆఫ్ ఆసియా)కథనంపై ఆ దేశం మండిపడింది. క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌కు వాల్‌స్ట్రీట్ జర్నల్ తలొగ్గక పోవడంతో ఆ పత్రిక రిపోర్టర్లు ముగ్గురికి చైనా దేశ బహిష్కారం విధించింది. -
జిన్‌పింగ్‌కు బహుమతులు ఇవ్వనున్న మోదీ
మామల్లాపురం : ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు విలువైన బహుమతులు ఇవ్వనున్నారు. తమిళనాడులోని మహాబలిపురం వేదికగా వీరి బేటీ అనధికారికంగా జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ భారతీయ సంప్రదాయం ఉట్టిపడే కళాకండాలను బహుమతిగా ఇవ్వనున్నారు. ఆరుగడుల ఎత్తుండే దీపపు స్తంబాలు, మూడడగుల ఎత్తుండే తంజావూరు పెయింటింగ్‌లను కానుకగా అందజేస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ బహుమతులు తమిళనాడు హస్తకళ నైపుణ్యం ఉట్టిపడే విధంగా ఉండనున్నాయి. బంగారం పూత పూసిన ఇత్తడి దీపపు స్తంబాలు ఆరుగడుల ఎత్తు, 108 కేజీల బరువు ఉంటాయి. వీటిని తయారు చేయడానికి 12 రోజులు పట్టింది. కలపతో తయారు చేసిన మూడు అడుగుల ఎత్తున్న తంజావూరు పెయింటింగ్‌లో నాట్యం చేస్తున్న సరస్వతి దేవితో పాటు, సంగీతం ప్రాముఖ్యాన్ని తెలియజేసే పరికరాలను ఉంచారు. దీనిని తయారు చేయడానికి 45 రోజులు పట్టినట్లు తెలిసింది. -
చైనాలో ‘చాయ్ పే చర్చా’..!
వుహాన్, చైనా : భారత్, చైనాల మధ్య సుహృద్భావ సంబంధాలను నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య జరుగుతున్న రెండు రోజుల అనధికార భేటీల్లో భాగంగా శనివారం ఉదయం ఇరు దేశాధినేతలు ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరూ టీ తాగుతూ తూర్పు సరస్సు తీరంలోని ప్రకృతి అందాల్ని ఆస్వాదించారు. తీరం వెంబడి పక్క పక్కనే నడుచుకుంటూ ఇరుదేశాల మధ్య మెరుగుపడాల్సిన సంబంధాలపై మాట్లాడుకున్నారు. ప్రధానంగా భారత్, చైనాల మధ్య సంబంధాల బలోపేతం, ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొల్పడం వంటివి ఈ సందర్భంగా చర్చకు వచ్చాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఎంఈఏ ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. మోదీ, జిన్‌పింగ్‌ల ఫోటోలను ట్వీట్‌కు జోడించారు. షీ జిన్‌పింగ్‌తో రెండు రోజుల ఈ అనధికార చర్చలు చరిత్రాత్మకం అంటూ మోదీ పేర్కొన్నారని రవీష్ తెలిపారు. రెండు దేశాల మధ్య బలమైన దీర్ఘకాలిక సత్సంబంధాలు ఏర్పడాలంటే.. ‘కామన్ థింకింగ్, కామన్ రిలేషన్స్, కామన్ కో-ఆపరేషన్, కామన్ ఆస్పిరేషన్, కామన్ డ్రీమ్స్’ అనే అయిదు కీలకాంశాలు అవసరమని మోదీ పేర్కొన్నారని రవీష్ ట్వీట్లో వివరించారు. Taking India-China relations on a forward-looking path, charting the future direction of the relationship! PM @narendramodi and Chinese President Xi take a walk together along the East Lake in Wuhan today morning. pic.twitter.com/KzBSbgR4dB — Raveesh Kumar (@MEAIndia) April 28, 2018 -
చైనాకు ఇక తిరుగులేని నేతగా జీ జిన్‌పింగ్
బీజింగ్ : చైనాకు తిరుగులేని నేతగా జీ జిన్‌పింగ్ అవతరించారు. రెండోసారి కూడా ఆయన చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తమ దేశ రాజ్యాంగంలో ఉన్న కాల పరిమితి నిబంధనను పూర్తిగా తొలగించి మరీ జీ జిన్‌పింగ్‌కు ఈ బాధ్యతలు కట్టబెట్టారు. చైనా అధ్యక్షుడిగా కొనసాగే వ్యక్తికి కాలపరిమితిని తొలగిస్తూ చైనా పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాని ద్వారా జీ జిన్‌పింగ్ 2023 తరువాత కూడా చైనా అధ్యక్షుడిగా ఉండడానికి అధికారికంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలిగినట్లయింది. అంతేకాదు.. మున్ముందు కూడా చైనా జీజిన్పింగ్నే శాశ్వతంగా కొనసాగించాలని భావిస్తోంది. చైనాకు రెండోసారి ఐదేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగనున్న ఆయన అత్యంత శక్తిమంతమైన చైనా సెంట్రల మిలటరీ కమిషన్‌కు అత్యున్నతాధికారిగా కూడా వ్యవహరించనున్నారు. ఈ నెల (మార్చి) 11న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌కు చెందిన 2900 మంది డిప్యూటీలంతా కలసి రాజ్యాంగ సవరణకు ఓటు వేసి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి కాలపరిమితి నిబంధనను తొలగించారు. ఆ దేశంలో ఉన్న ఏకైక పెద్ద పార్టీ కమ్యునిస్టు పార్టీ ఆఫ్ చైనా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జీవితాంతం చైనా అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. 1982లో డెంగ్ జియావోపింగ్ కాలంలో.. అప్పటి ప్రభుత్వం ఏ వ్యక్తి అయినా అధ్యక్ష పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలని చట్టం చేసింది. ఆ తరువాత మళ్లీ 36 ఏళ్లకు రాజ్యాంగ సవరణ చేశారు. -
చైనా మరో ఉత్తర కొరియా అవుతుందా?
బీజింగ్ : చైనాను నిరవధికంగా పాలించాలన్న అధ్యక్షుడు జింగ్ పింగ్ ఆలోచనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన పాలనలో చైనా మరో ఉత్తర కొరియాలా మారుతుందన్న ఆందోళనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు గల కారణాలను వివవరిస్తున్న విశ్లేషకులు మున్ముందు ఆ నిర్ణయం చైనాకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. 2013లో మార్చి 14న 64 ఏళ్ల జింగ్ పింగ్ తొలి దఫా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఈ మార్చితో ఆయన పదవీకాలం ముగియబోతోంది. చైనా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించేందుకు అర్హుడు. కానీ, జీ జిన్‌పింగ్ మాత్రం ఆ నిబంధనను సవరించేదిశగా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. దేశ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నిరవధికంగా కొనసాగేలా పార్టీ కేంద్ర కమిటీ ఓ కీలక ప్రతిపాదన చేసింది. త్వరలో దానికి పార్లమెంట్ అధికారిక ముద్ర కూడా వేయబోతోంది. గతేడాది అక్టోబర్‌లోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ ప్రతిపాదనను పార్లమెంట్ ఆమోదించింది. లీకుల ద్వారా ఆ విషయం బయటికి పొక్కటంతో విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆయన పదవీ కాలం దగ్గరపడుతుండటం, ఆ ప్రతిపాదనకు చట్టబద్ధత కల్పించేందుకు పావులు కదుపుతుండటంతో విమర్శకులు, విశ్లేషకులు రంగంలోకి దిగిపోయారు. జింగ్ పాలనను విశ్లేషిస్తే... నిజానికి జింగ్ పింగ్‌కు పాలనపరంగా తొలినాళ్లలో మంచి మార్కులే పడ్డాయి. అయితే రాను రాను అవినీతి పెరిగిపోవటం.. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోలేకపోవటం... మరీ ముఖ్యంగా పొరుగు దేశాలతో సఖ్యత విషయంలో ఆయన తీరు మూలంగా విమర్శలు మొదలయ్యాయి. దీనికి తోడు దక్షిణ, తూర్పు చైనాల వెంబడి సముద్ర తీరాల సరిహద్దు విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ఉత్తర కొరియా, పాకిస్తాన్ విషయంలో సానుకూల ధోరణిని పాటించటం అంతర్జాతీయ సమాజంలో చైనా పట్ల వ్యతిరేకతను పెంపొందించేలా చేశాయన్నది మరో వాదన. వర్తక, వ్యాపారాల విషయంలో కఠినవైఖరి అవలంభిస్తుండటంతో ఆదాయ గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏకఛత్రాధిపత్య పాలనలో చైనా అభివృద్ధిని కుంటుపరిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో ఏకఛత్రాధిపత్య పాలనలో చైనా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితులను వారు గుర్తు చేస్తున్నారు. రాజకీయపరంగా విమర్శలు... మరోవైపు రాజకీయపరంగా కూడా విమర్శలు తారాస్థాయికి చేరాయి. మిగతా పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉండటంతో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మావో మాదిరిగా ఎక్కువ కాలం చైనాను పాలించాలని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక తాజా చట్టం అమలులోకి వస్తే గనుక కీలక నిర్ణయాల విషయంలో మద్ధతు ప్రస్తావనే ఉండదు. అధికారమంతా ఆయన ఒక్కడి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అదే జరిగితే జింగ్పింగ్ నియంత పాలన కొనసాగించటం ఖాయమని.. మరో ఉత్తర కొరియాలా మారిపోతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్లో అధికార పార్టీలో ఆయన మద్ధతుదారులే ఎక్కువగా ఉన్నారు. మెజార్టీ మద్ధతు ఉండటంతో చట్టం కార్యరూపం దాల్చేందుకు అడ్డంకులేం లేకుండా పోయాయి. దీంతో జింగ్ నిరవధిక పాలనకు లైన్ క్లియర్ అయినట్లేనని అర్థమౌతోంది. సోషల్ మీడియాలో .. మరో పక్క సోషల్ మీడియాలో జింగ్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మెమెలతో, పోస్టులతో విరుచుకుపడుతున్నారు. చైనా అధికారిక సోషల్ మీడియా వెబో అయితే మొత్తం జింగ్ పింగ్వ్యతిరేక పోస్టులతో నిండిపోవటం విశేషం. -
‘యేసుక్రీస్తు ఫొటో తీసేసి.. జిన్ పింగ్ ఫొటో పెట్టుకోండి..’
బీజింగ్ : ప్రభుత్వం పేదలకు అందించే ప్రయోజనాలు కావాలంటే ఇంట్లో గోడకు ఉన్న యేసుక్రీస్తు ఫొటోను తీసేసి.. ఆ స్థానంలో అధ్యక్షుడు జిన్ పింగ్ ఫొటోను పెట్టుకోవాలంటూ దేశంలోని క్రిస్టియన్లకు చైనా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు చైనాలోని యుగాన్ కౌంటీలోని క్రిస్టియన్ల ఇళ్లకు వెళ్లిన అధికారులు ‘యేసుక్రీస్తు మిమ్మల్ని పేదరికం నుంచి బయటకు తేలేరు. కేవలం చైనా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఆ పని చేయగలుగుతుంది. మిమ్మల్ని ధనికులుగా మార్చుతుంది. మీ అవసరాలను తీర్చగలుగుతుంది. కాబట్టి అందరూ మీ ఇళ్లలో ఉన్న యేసుక్రీస్తు ఫొటోలను తీసేసి.. జిన్ పింగ్ ఫొటోను ఆ స్థానంలో పెట్టండి.’ అని సూచనలు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో 11 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు. అందులో సింహభాగం(10 శాతం) మంది క్రిస్టియన్లే. దీన్ని అదనుగా తీసుకున్న చైనా ప్రభుత్వం.. క్రిస్టియన్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వారిని పేదరికం నుంచి బయటకు తెస్తామని, యేసుక్రీస్తు ఫొటోలను ఇళ్లలో నుంచి తొలగించి జిన పింగ్ ఫొటోలు పెట్టుకోవాలని కోరుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనతో ఇప్పటికే 624 క్రిస్టియన్ కుటుంబాలు ఇళ్లలో నుంచి జీసస్ ఫొటోలను తొలగించాయి. అందులో 453 కుటుంబాలు క్రీస్తు ఫొటోలను ఉంచిన స్థానంలో జిన్ పింగ్ ఫొటోలను పెట్టినట్లు చైనా పత్రికలు ప్రచురించాయి. లక్ష్యం పేరుతో : 2020 కల్లా దేశంలో పేదరికాన్ని సమూలంగా అంతమొందించేందుకు చైనా కంకణం కట్టుకుంది. ఇందుకోసం చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన నేతలు దేశవ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగమే ఈ ఫొటోల మార్పిడి. క్త్రైస్తవ ప్రభావం ఎక్కువ కలిగిన ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ నేతలు విస్తృతంగా తిరుగుతున్నారు. హ్వాన్జిబూ అనే ప్రాంతంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్వి యాన్ అనే నాయకుడు మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి నుంచి ఈ పేదరిక నిర్మూలనకు క్రైస్తవ ప్రభావం కలిగిన ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ పేదరికాన్ని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలను క్రైస్తవులకు వివరిస్తునట్లు తెలిపారు. ముఖ్యంగా జిన్ పింగ్ పేదరికంలో మగ్గుతున్న క్రిస్టియన్లను ధనికులుగా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. ఈ విషయం స్థానిక క్రిస్టియన్లకు అర్థం అయ్యేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫొటోల మార్పిడి దేనికి.. చైనా తొలి నాయకుడు మావో జెడాంగ్. ఆయన ఫొటో లేని ఇళ్లు దాదాపు చైనాలో ఎక్కడా కనిపించవు. అచ్చూ అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో తన ఫొటో ఉండేలా చేయడానికి ‘పేదరికం’ అంశాన్ని జిన్ పింగ్ పావుగా వాడుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, మావో జెండాంగ్ తర్వాత అంతటి బలీయమైన నాయకుడిగా నిలదొక్కుకునేందుకు దేశంలోని గ్రామాలను జిన పింగ్ టార్గెట్ చేసుకున్నారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. -
మావో తర్వాత జిన్‌పింగ్
బీజింగ్: ఆధునిక చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రస్తుత చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. జిన్‌పింగ్‌కు దిగ్గజ గౌరవాన్ని కల్పిస్తూ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) మంగళవారం తీర్మానం చేసింది. జిన్‌పింగ్ పేరును, ఆయన సిద్ధాంతాలను సీపీసీ రాజ్యాంగంలో చేరుస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. తాజాగా సెంట్రల్ కమిటీకి ఎన్నికవడంతో రెండోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జిన్‌పింగ్‌కు లాంఛనమే. అయితే మావో తరహాలో మూడోసారి కూడా అధ్యక్ష పదవి చేపట్టేలా ఆయన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సమావేశాల చివరి రోజున జిన్‌పింగ్ సిద్ధాంతాలను రాజ్యాంగంలో చేరుస్తూ సీపీసీ ఆమోదం తెలిపింది. జిన్‌పింగ్‌కు ముఖ్యనేత(కోర్ లీడర్) స్థాయిని ప్రకటించింది. దీంతో ఇకపై పార్టీలోని నేతలందరికంటే అత్యున్నత స్థాయిలో జిన్‌పింగ్ ఉంటారు. ఇప్పటి వరకూ మావోతో పాటు మాజీ అధ్యక్షుడు డెంగ్ జియావోపింగ్ ఆలోచనలకు మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగంలో చోటు దక్కింది. చైనాలో సంస్కరణలకు నాంది పలికిన నాయకుడిగా పేరున్న జియావోపింగ్ మరణానంతరం ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలకు రాజ్యాంగంలో చోటు కల్పించారు. సీపీసీ చరిత్రకారులు 64 ఏళ్ల జిన్‌పింగ్‌ను పార్టీ వ్యవస్థాపకుడు మావోతో పోలుస్తున్నారు. జిన్‌పింగ్‌కు ముందు అధికార పగ్గాలు చేపట్టిన జియాంగ్ జెమిన్, హుజింటావో ఆలోచనలకు కూడా రాజ్యాంగంలో చోటు దక్కినా వారి పేర్లు మాత్రం చోటు సంపాదించలేకపోయాయి. తన ఆలోచనలతో పాటు పేరుకు కూడా రాజ్యాంగంలో చోటు దక్కిన మూడో నాయకుడు జిన్‌పింగ్ కావడం గమనార్హం. జిన్‌పింగ్‌తో పాటు అధ్యక్షుడు లీ కెకియాంగ్ కేంద్ర కమిటీలోకి మళ్లీ చోటుదక్కించుకున్నారు. భారత్–చైనా సరిహద్దు చర్చల ప్రత్యేక ప్రతినిధి యాంగ్ జిచికి సీపీసీ కేంద్ర కమిటీలో స్థానం లభించింది. -
మళ్లీ భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు
న్యూఢిల్లీ: ఈశాన్య లడఖ్‌లోని చుమర్ ప్రాంతంలోని భారత భూభాగం నుంచి వెనక్కు వెళ్లి రెండు రోజులైనా గడవకముందే.. చైనా సైనికులు మరోసారి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చారు. 50 మంది చైనా సైనికులు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను దాటి.. దగ్గర్లోని ఒక పర్వతంపైకి చేరారని శనివారం అధికార వర్గాలు వెల్లడించాయి. 35 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) బలగాలు శుక్రవారం భారత భూభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే మరో 300 మంది సైనికులు ఎల్ఏసీకి దగ్గరలో కనిపిస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. దాంతో భారత సైనికులు కూడా ఆ ప్రాంతంలో మోహరించడం ప్రారంభించారు. లడఖ్ ప్రాంతానికి చెందిన చివరి గ్రామం చుమర్. ఇది హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉంది. ఆ ప్రాంతం తమదేనని చాన్నాళ్లుగా చైనా వాదిస్తూ.. తరచుగా చొరబాట్లకు పాల్పడుతూ వస్తోంది. అయితే భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్‌తో సైనికుల చొరబాటు అంశాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించారు.దాంతో దాదాపు ఎనిమిది రోజుల తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చాలావరకు సడలిపోయాయని భావిస్తున్న తరుణంలో చైనా బలగాలు మళ్లీ భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు యత్నాలు ఆరంభించాయి. -
వెనుదిరిగిన చైనా సైన్యం.. మోడీ ఎఫెక్ట్?
ఇన్నాళ్లుగా లడఖ్ ప్రాంతంలో భారత సరిహద్దు దళాలకు కంటిమీద కునుకు లేకుండా పదే పదే కవ్విస్తూ, చొరబాట్లకు పాల్పడుతున్న చైనా సైన్యం.. వెనకడుగు వేసింది. గురువారం నుంచి ఆ ప్రాంతంలో చైనా బలగాలు వెనక్కి వెళ్లడం మొదలుపెట్టాయి. ఇదంతా చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్‌తో భారత ప్రధాని నరేంద్రమోడీ చర్చించిన తర్వాతే జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు తెరదించాల్సిందేనని, అసలు అక్కడి విషయం ఏంటో త్వరగా తేల్చాల్సిందేనని మోడీ కుండ బద్దలుకొట్టినట్లు చెప్పడం ఇందుకు ఉపయోగపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఇలాంటి ఉద్రిక్తతలు ఉండటం తన పర్యటన మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుందని జింగ్ పింగ్ సైతం ఇదే సందర్భంలో మోడీతో చెప్పారట. దాంతో దాదాపు ఎనిమిది రోజుల తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చాలావరకు సడలిపోయాయి. ఇంతకాలం చైనాతో ఈ సమస్య గురించి ప్రస్తావించడానికే మన దేశం ముందు, వెనక ఆడేది. కానీ ఒక్కసారిగా దౌత్య సంబంధాల విషయంలో ప్రభుత్వం తీరు మారిపోవడం ఇప్పుడు ఉపయోగపడింది. ఎన్నాళ్లనుంచో చైనాతో సరిహద్దు సమస్య నలుగుతున్నా, ఇప్పటికి దానికి ఒక పరిష్కార మార్గం లభించినట్లయింది.