యాంకర్ ఉద్యోగం ఊడబీకిన చైనా అధ్యక్షుడు
చైనా అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించడం ఏమో గానీ.. దూరదర్శన్ ఛానల్లో పనిచేసే ఓ న్యూస్ రీడర్ ఉద్యోగం పోయింది. విదేశీ నాయకులు వచ్చినప్పుడు వాళ్ల పేర్లను తెలుసుకోవడం సాధారణంగానే కాస్త కష్టం అవుతుంది. దేన్ని ఎలా పలకాలో తెలియకపోతే ఇబ్బందులు తప్పవు.
దూరదర్శన్లో పనిచేస్తున్న ఓ న్యూస్రీడర్ చైనా అధ్యక్షుడు జి జింగ్పింగ్ అనే పేరులో మొదట ఉన్న 'ఎక్స్ఐ' అనే అక్షరాలను రోమన్ సంఖ్య 11గా పొరబడ్డాడు. దాంతో 11వ జింగ్ పింగ్ అని చదివేశాడు. కానీ, వాస్తవానికి ఆయన పేరు జి జింగ్ పింగ్. రాత్రి దాటిన తర్వాత వచ్చే న్యూస్ బులెటిన్లో ఇలా 11వ జింగ్ పింగ్ అని రాసేయడం వల్ల అతడి ఉద్యోగం కాస్తా ఊడిపోయింది. అతడు కాజువల్ ఉద్యోగి అని తెలియవచ్చింది.