Chinese President
-
జిన్‌పింగ్‌తో ట్రంప్ చర్చలు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘‘వ్యాపారం, వాణిజ్యం, టిక్‌టాక్ తదితర అంశాలపై జిన్‌పింగ్‌తో చక్కటి సంభాషణ జరిగింది. ప్రపంచాన్ని మరింత భద్రంగా మార్చడానికి చేయాల్సిందంతా చేస్తాం’’ అని ట్రంప్ ఉద్ఘాటించారు. అధ్యక్షుడిగా రెండో టర్మ్‌లో చైనాతో సంబంధాలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. -
బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చైనా అధినేత షీ జిన్‌పింగ్ సమావేశానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన ఈ భేటీ జరుగనుంది. ఇటీవలి కాలంలో అమెరికా–చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరువురు నాయకుల సమావేశం అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధాలను పునరుద్ధరించుకొనే దిశగా వారిద్దరూ చర్చలు జరుపునున్నట్లు తెలుస్తోంది. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జిన్‌పింగ్ మంగళవారం అమెరికా చేరుకున్నారు. ఆయన అమెరికాకు రావడం ఆరేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. -
మనం సక్సెసే కానీ...
రష్యా అధ్యక్షుడు లేడు. చైనా అధినేత రాలేదు. ఉక్రెయిన్‌పై సాగుతున్న రష్యా యుద్ధంపై సభ్య దేశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఒక్కముక్కలో జీ20లో దేశాలు ఏకాభిప్రాయంతో కానీ, ఏక లక్ష్యంతో కానీ ఉన్నట్టు కనిపించదు. అయినా సరే, ఆదివారం ఢిల్లీలో ముగిసిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సును ఘనంగా నిర్వహించి, అన్ని దేశాల తరఫునా ఎవరినీ నొప్పించని 83 పేరాల ఏకాభిప్రాయ ప్రకటన, అదీ ఒకరోజు ముందరే చేయించడమనేది అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌కు అసాధారణ విజయమే! దక్షిణార్ధగోళంలోని వర్ధమాన, పేదదేశాల పక్షాన నిలబడి, వాటి ప్రయోజ నాల్ని సదస్సు అజెండాలో మేళవింపజేయడమూ సామాన్యం కాదు. అలాగే బాలీలో నిరుడు అంగీ కరించినదే అయినా, ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ)కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వడం ద్వారా దక్షిణార్ధగోళానికి తాను సరైన ప్రతినిధినని భారత్ చాటుకున్నట్టయింది. అందుకే, వంతుల వారీగా ఏడాదికొకరికి వచ్చే అధ్యక్షహోదాయే అయినా... జీ20 సారథిగా భారత్ సక్సెస్ కావడం, ప్రపంచ వేదికలో మరో మెట్టు పైకి ఎక్కడం కచ్చితంగా సంతోషించదగ్గ సమయం, సందర్భం. జీ20 సదస్సు ముగింపు వేళ చేసిన ఏకాభిప్రాయ ప్రకటనపై కొన్ని అసంతృప్తులూ లేకపోలేదు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంపై పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్న రీతిలో రష్యాను నిలదీయ లేదనీ, నిరుటి బాలీ డిక్లరేషన్ నుంచి పక్కకు జరిగారనీ ఒక వర్గపు అసంతృప్తి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా మానుకోవడంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం స్థిరసంకల్పం, చిత్త శుద్ధి లేమిని తెలియజేస్తోందన్నది మరో ప్రధానమైన అసంతృప్తి. జీ20 సదస్సులు ఆయా ఆతిథ్య దేశాల ఘనత చాటుకోవడానికే తప్ప, అసలు పనిలో తూతూమంత్రంగా మారాయనే నింద కొంత కాలంగా ఉన్నదే. అది నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత జీ20 వేదికదే! తాజా జీ20 లోనూ ప్రకటించిన లక్ష్యాలు బలహీనంగా ఉన్నాయనీ, ఇప్పటికే తాము కట్టుబడిన లక్ష్యాలనే దేశాధి నేతలు వల్లెవేశారని విశ్లేషకుల మాట. వెరసి, నిర్వహణలో పేరుప్రఖ్యాతులతో ఇండియా హిట్టే కానీ, కీలక ప్రపంచ సమస్యలపై నిర్ణయంలోనే సదస్సు విఫలమైందనే మాట మిగిలిపోయింది. చర్చించడానికి ఆహారభద్రత, ఋణాల ఉపశమనం, పర్యావరణ సంక్షోభం, వ్యాధులు, బ్యాంకింగ్ సంస్కరణలు, డిజిటల్ ప్రాథమిక వసతుల లాంటి అనేక ప్రపంచ సమస్యలున్నాయి. కానీ, వాటి పరిష్కారానికి అందరికీ అంగీకారయోగ్యమైన, విశ్వసనీయ కార్యాచరణ జీ20లో లోపించింది. పరస్పర భిన్నమైన 20 దేశాలు సమష్టి ఆశయాలు, ఆలోచనలు, అనుభవాల పునాదిపై కాక ఆర్థిక బలిమి ప్రాతిపదికన ఇలా ఒక వేదికపై చేరడమే అసలు చిక్కు. అందుకే, రానురానూ జీ20 వార్షిక సదస్సు ఫలితాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. నిరుటి బాలీ సదస్సుతో పోలిస్తే తాజా సదస్సులో అగ్ర దేశాల మధ్య చీలికలు పెరిగాయి. దానివల్ల సదస్సు ప్రధాన అజెండా పట్టాలు తప్పకుండా భారత్ సంక్లిష్ట దౌత్యవిన్యాసంతో సమతూకం సాధించడం విశేషం. అలాగే, ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యాపై ఆంక్షల లాంటివి సమర్థించడంలో దక్షిణార్ధగోళానికి సమస్యలున్నాయని పాశ్చాత్య ప్రపంచం గుర్తించింది. అందుకే, ఆ అంశంపైనే పట్టుబట్టి కూర్చోలేదు. రష్యా కన్నా చైనాతో పెను ముప్పు అని గ్రహించిన అమెరికా చివరకు దక్షిణార్థగోళ దేశాల మాట ఆలకించేందుకు భారత్‌తో నడిచింది. నిజానికి, వరుస ప్రకారమైతే జీ20 సదస్సు మన దేశంలో 2022లో, ఇండొనేషియాలో 2023లో జరగాలి. కానీ, ఇండొనేషియాను మన పాలకులు మెత్తగా ఒప్పించి, ఢిల్లీ స్థానంలో ముందుగా బాలీలో సదస్సు జరిపించారు. సార్వత్రిక ఎన్నికలకు వీలైనంత దగ్గరగా, ఈ ఏడాది మన వద్ద ఈ అంతర్జాతీయ సంబరం జరిగేలా చూడగలిగారు. అదెలా ఉన్నా ఈ సదస్సును దేశానికి గర్వకారణంగా చూపి, సానుకూల ఫలితాల దిశగా మలుచుకోవడంలో మనవాళ్ళు సఫల మయ్యారు. ఏడాది కాలంలో కేంద్ర పాలకులు దేశవ్యాప్తంగా 60కి పైగా పట్నాల్లో, 200కు పైగా సమావేశాలు జరిపారు. సాధారణంగా సామాన్యులకు సంబంధం లేని వ్యవహారంగా అనిపించే సదస్సును సైతం తెలివిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఈ సదస్సు విజయాన్ని వచ్చే ఎన్నికల్లో సహజంగానే మరింత వాడుకుంటారు. అయితే, సహకార సమాఖ్య విధానాన్నీ, ప్రత్యర్థి పక్షాల మధ్య ద్వైపాక్షికతనూ నమ్మడం వల్లే ఈ సదస్సు ఘనత సాధ్యమైందని సర్కారు వారి మాట. దేశంలోని ప్రతిపక్షాలను కలుపుకొనిపోని వారి నోట ఈ మాట రావడం విడ్డూరమే. సహకార సమాఖ్య లాంటివి పెద్దలు నిజంగా నమ్ముతున్నదీ లేనిదీ నవంబర్ చివర 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ నియామకం, సంఘం నియమావళి ఖరారు వేళ తెలుస్తుంది. ఏమైనా, ఐరాస సర్వప్రతినిధి సభ దాదాపు అచేతనంగా మారిన పరిస్థితుల్లో జీ20 మరింత చొరవ తీసుకోవాలని పరిశీలకుల భావన. అందుకే, ఉక్రెయిన్ యుద్ధ సమస్యలు, పర్యావరణ సంక్షోభానికి కారణమైన శిలాజ ఇంధనాలపై చర్యలు చర్చించకుండానే సదస్సు ముగిసిపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. కానీ, సభ్యదేశాల మధ్య సంక్లిష్టతలతో ఆ ఘనత ఒక్క భారత్ చేతు ల్లోనూ లేదని గ్రహించాలి. మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్‌తో కూడిన జీ20 తాజా ఆఫ్రికన్ యూనియన్ చేరికతో వచ్చే 2024లో బ్రెజిల్ సదస్సు నాటికి జీ21గా పలకరించనుంది. ఆ పై ఏడాది దక్షిణాఫ్రికాలో సమావేశం కానుంది. భారత్ అధ్యక్షతన సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్ళడానికే కాదు, అంతర్జాతీయంగా జీ20 ప్రాసంగికతను నిలపడానికీ ఆ రెండు సదస్సులూ కీలకం. ఇప్పటికైతే, ఇండొనేసియా, జర్మనీల కన్నా అనేక రెట్ల ఖర్చుతో ఢిల్లీ సదస్సు జరిగిందని ఆరోపణలు వస్తున్నప్పటికీ, ‘విశ్వగురువు’ ప్రచారం మరింత ఊపందుకున్నందుకు సంబరపడాలి. -
బ్రిక్స్ మీటింగ్‌లో జిన్‌పింగ్‌కు అనుకోని ఘటన..
జోహెన్నస్‌బర్గ్: జోహెన్నస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అయోమయ ఘటన ఎదురైంది. సమావేశానికి హాజరయ్యే క్రమంలో జిన్‌పింగ్ సెక్యూరిటీని అడ్డుకున్నారు అక్కడి భద్రతా సిబ్బంది. తన వెనక ఏం జరిగిందో తెలియని జిన్‌పింగ్ సందేహాంగా వెనక్కి ముందుకు చూస్తూ వెళ్లారు. బ్రిక్స్ మీటింగ్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన భేటీ జరిగే సెంట్రల్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన వెనకే కొద్ది దూరంలో వస్తున్న వ్యక్తిగత సిబ్బంది వస్తున్నారు. జిన్‌పింగ్ హాల్లోకి అడుగుపెట్టగానే ఆయన్ని వెనకే వెళ్లాలనుకున్న పర్సనల్ సెక్యూరిటీ వేగంగా వచ్చారు. జిన్‌పింగ్ వ్యక్తిగత సిబ్బంది నడక కాస్త అనుమానంగా ఉండే సరికి.. అక్కడి సెక్యూరిటీ వారిని అడ్డగించారు. వెంటన్ డోర్లు మూసుకుపోయాయి. వెనక ఏం జరిగిందో తెలియని జిన్‌పింగ్.. వెనకకు ముందుకు చూస్తూ వెళ్లారు. South African Security Officers physically stop Chinese Officials from entering BRICS main venue behind Xi Jinping. Forcibly shut the door.🤣🤣🤣#Prigojine #Prigozhin #republicanDebate #Wagner #BRICSSummit2023 #XiJinping #BRICS #BRICSSummit2023 #BRICSSummit #ChinaNews #China pic.twitter.com/dY4CgLZadq — Mr. R V (@Havoc3010) August 24, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జిన్‌పింగ్‌కు అయోమయ పరిస్థితి ఎదురైందని నెటిజన్లు కామెంట్ పెట్టారు. అయితే.. దక్షిణాఫ్రికా జోహెన్నస్‌బర్గ్ వేదికగా 15వ బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ, జిన్‌పింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇదీ చదవండి: వీడియో: బ్రిక్స్‌లో జిన్‌పింగ్, మోదీ ముచ్చట్లు.. కరచలనం -
డ్రాగన్ వంచనపై భారత్‌లో ‘నిప్పు’లు!
-
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటన ఖరరు
-
ఆయనతో తప్ప చాలామందితో మాట్లాడాను: ట్రంప్
వాషింగ్టన్: చైనా పట్ల వ్యతిరేకతను ఏమాత్రం దాచుకోని అమెరికా కాబోయే అధ్యక్షుడు (ఎన్నికైన) డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తాను చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో మాట్లాడలేదని ట్రంప్ చెప్పారు. జిన్ పింగ్‌తో మాట్లాడినట్టు మీడియాలో వచ్చిన కథనాలను తోసిపుచ్చారు. చైనా అధ్యక్షుడితో తప్ప చాలా మంది ప్రపంచ నేతలతో మాట్లాడానని, అభినందనలు అందుకున్నానని చెప్పారు. ట్రంప్ విజయం సాధించాక చైనా అధ్యక్షుడు ఫోన్ చేసి ఆయన్ను అభినందించినట్టు చైనా సెంట్రల్ టీవీ వెల్లడించింది. ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందించానని, ఇరు దేశాలు కలసి పనిచేయాల్సిన అవసరముందని చెప్పానని జిన్ పింగ్ తెలిపారంటూ ఆ టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. చైనా-అమెరికా సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అభివృద్ధి దిశగా దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని ట్రంప్‌తో జిన్ పింగ్ చెప్పినట్టు వెల్లడించింది. అలాగే ఇరు దేశాల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారని చైనా సెంట్రల్ టీవీ పేర్కొంది. కాగా వాల్ స్ట్రీట్ జర్నల్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. చైనా అధ్యక్షుడితో తప్ప చాలా మంది ప్రపంచ నేతల నుంచి అభినందనలు అందుకున్నానని చెప్పారు. ట్రంప్ ప్రతినిధి హోప్ హిక్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎన్నికలకు ముందు ఓ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. చైనా అమెరికా ఉద్యోగాలను దోచుకుంటోందని, తమ దేశాన్ని అత్యాచారం చేస్తోందని, ఇకమీదట సాగబోదని తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా సంబంధాలు ఎలా ఉండబోతాయన్నది ఇతర దేశాలు గమినిస్తున్నాయి. -
యాంకర్ ఉద్యోగం ఊడబీకిన చైనా అధ్యక్షుడు
చైనా అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించడం ఏమో గానీ.. దూరదర్శన్ ఛానల్లో పనిచేసే ఓ న్యూస్ రీడర్ ఉద్యోగం పోయింది. విదేశీ నాయకులు వచ్చినప్పుడు వాళ్ల పేర్లను తెలుసుకోవడం సాధారణంగానే కాస్త కష్టం అవుతుంది. దేన్ని ఎలా పలకాలో తెలియకపోతే ఇబ్బందులు తప్పవు. దూరదర్శన్‌లో పనిచేస్తున్న ఓ న్యూస్‌రీడర్ చైనా అధ్యక్షుడు జి జింగ్పింగ్ అనే పేరులో మొదట ఉన్న 'ఎక్స్ఐ' అనే అక్షరాలను రోమన్ సంఖ్య 11గా పొరబడ్డాడు. దాంతో 11వ జింగ్ పింగ్ అని చదివేశాడు. కానీ, వాస్తవానికి ఆయన పేరు జి జింగ్ పింగ్. రాత్రి దాటిన తర్వాత వచ్చే న్యూస్ బులెటిన్‌లో ఇలా 11వ జింగ్ పింగ్ అని రాసేయడం వల్ల అతడి ఉద్యోగం కాస్తా ఊడిపోయింది. అతడు కాజువల్ ఉద్యోగి అని తెలియవచ్చింది. -
పౌర అణుఒప్పందంపైన చర్చలు జరిపాం: మోడి
-
జీ జిన్‌పింగ్ తో సుష్మా స్వరాజ్ సమావేశం
న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని తాజ్‌ప్యాలెస్‌లో వీరి ఇరువురి మధ్య భేటీ జరిగింది. జీ జిన్‌పింగ్ భారత్ పర్యటనను స్వాగతిస్తున్నట్లు సుష్మ స్వరాజ్ పేర్కొన్నారు. వీరిరువురు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతంపై ఈ భేటీలో చర్చ జరిపినట్లు సమాచారం. సుష్మాతో భేటీకి ముందు జీ జిన్‌పింగ్‌కు ...రాష్ట్రపతి భవన్ ఘనంగా స్వాగతం పలికింది. అనంతరం ఆయన రాజ్‌ఘాట్ సందర్శించి మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. మరోవైపు ప్రధాని, జీ జిన్‌పింగ్‌లు హైదరాబాద్ హౌజ్‌లో భేటీ కానున్నారు. -
రాష్ట్రపతి భవన్లో జీ జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం
-
రాష్ట్రపతి భవన్లో జీ జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం
న్యూఢిల్లీ : మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గురువారం రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రెండోరోజు పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్ సందర్శించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ....చైనా అధ్యక్షుడిని సాదరంగా ఆహ్వానించి కరచాలనం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీ జిన్‌పింగ్ రాష్ట్రపతిభవన్‌లో మీడియా ద్వారా మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ప్రస్తుతం జరిగే చర్చలతో స్నేహబంధం మరింత బలపడుతుందన్నారు. అందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. చైనా-భారత్ దేశాల సాంస్కృతిక బంధానికి వేల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. కాగా భారత్ భూభాగంలో చైనా చొరబాట్లుపై ప్రధాని మోడీ గతరాత్రి జిన్‌పింగ్‌తో చర్చించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు హజ్ హౌస్‌లో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ భేటీ కానున్నారు. సమావేశంలో అనేక అంశాలపై భారత్ - చైనా దౌత్య బృందాలు కీలక చర్చలు జరపనున్నాయి. ఆర్థిక, వాణిజ్య బంధాల బలోపేతంగా చర్చలు జరగనున్నాయి. సరిహద్దు వివాదము చర్చకు వచ్చే అవకాశం ఉంది. జిన్‌పింగ్... విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మరోసారి చైనా చొరబాట్లపై చర్చించే అవకాశం ఉంది. -
భారత్‌లో నేటి నుండి జిన్‌పింగ్ పర్యటన