కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని తాజ్‌ప్యాలెస్‌లో వీరి ఇరువురి మధ్య భేటీ జరిగింది.
న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని తాజ్‌ప్యాలెస్‌లో వీరి ఇరువురి మధ్య భేటీ జరిగింది. జీ జిన్‌పింగ్ భారత్ పర్యటనను స్వాగతిస్తున్నట్లు సుష్మ స్వరాజ్ పేర్కొన్నారు. వీరిరువురు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతంపై ఈ భేటీలో చర్చ జరిపినట్లు సమాచారం. సుష్మాతో భేటీకి ముందు జీ జిన్పింగ్కు ...రాష్ట్రపతి భవన్ ఘనంగా స్వాగతం పలికింది. అనంతరం ఆయన రాజ్ఘాట్ సందర్శించి మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. మరోవైపు ప్రధాని, జీ జిన్పింగ్లు హైదరాబాద్ హౌజ్లో భేటీ కానున్నారు.