జోహెన్నస్‌బర్గ్: జోహెన్నస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అయోమయ ఘటన ఎదురైంది. సమావేశానికి హాజరయ్యే క్రమంలో జిన్‌పింగ్ సెక్యూరిటీని అడ్డుకున్నారు అక్కడి భద్రతా సిబ్బంది. తన వెనక ఏం జరిగిందో తెలియని జిన్‍పింగ్ సందేహాంగా వెనక్కి ముందుకు చూస్తూ వెళ్లారు.
బ్రిక్స్ మీటింగ్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన భేటీ జరిగే సెంట్రల్ హాల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన వెనకే కొద్ది దూరంలో వస్తున్న వ్యక్తిగత సిబ్బంది వస్తున్నారు. జిన్‌పింగ్ హాల్‌లోకి అడుగుపెట్టగానే ఆయన్ని వెనకే వెళ్లాలనుకున్న పర్సనల్ సెక్యూరిటీ వేగంగా వచ్చారు. జిన్‌పింగ్ వ్యక్తిగత సిబ్బంది నడక కాస్త అనుమానంగా ఉండే సరికి.. అక్కడి సెక్యూరిటీ వారిని అడ్డగించారు. వెంటన్ డోర్లు మూసుకుపోయాయి. వెనక ఏం జరిగిందో తెలియని జిన్‌పింగ్.. వెనకకు ముందుకు చూస్తూ వెళ్లారు.
South African Security Officers physically stop Chinese Officials from entering BRICS main venue behind Xi Jinping. Forcibly shut the door.🤣🤣🤣#Prigojine #Prigozhin #republicanDebate #Wagner #BRICSSummit2023 #XiJinping #BRICS #BRICSSummit2023 #BRICSSummit #ChinaNews #China pic.twitter.com/dY4CgLZadq
— Mr. R V (@Havoc3010) August 24, 2023
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జిన్‌పింగ్‌కు అయోమయ పరిస్థితి ఎదురైందని నెటిజన్లు కామెంట్ పెట్టారు. అయితే.. దక్షిణాఫ్రికా జోహెన్నస్‌బర్గ్ వేదికగా 15వ బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ, జిన్‌పింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఇదీ చదవండి: వీడియో: బ్రిక్స్‌లో జిన్‌పింగ్, మోదీ ముచ్చట్లు.. కరచలనం
Comments
Please login to add a commentAdd a comment