బీజింగ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపటి నుంచి(మే 16) నుంచి రెండు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్.. చైనా పర్యటనపై ఆసక్తి నెలకొంది. పుతిన్, జిన్‌పింగ్ మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందోనన్న చర్చ నడుస్తోంది.
కాగా, పుతిన్ ఇటీవలే రష్యాకు ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా, తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా పుతిన్.. చైనాకు వెళ్లనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పుతిన్ తమ దేశంలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే, రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్‌పింగ్ ఆహ్వానంపైనే పుతిన్ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.
ఇక, ఈ పర్యటనలో భాగంగా పుతిన్.. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీరి భేటీలో ఉక్రెయిన్-రష్యా దాడుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధం పరిణామాలు, సంక్షోభం గురించి మాట్లాడనున్నట్టు చైనా మీడియా పేర్కొంది. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో శాంతి కోసం చైనా ప్రతిపాదనలకు తాము సానుకూలంగా ఉండాలనుకున్నట్టు రష్యా తెలిపింది.
President Putin gave an interview to Xinhua News Agency right before his China visit
The President noted that Russia positively assesses China’s approaches to resolving the Ukrainian crisis, and Beijing understands its “root causes”.
President Putin responded to China's… pic.twitter.com/k2yaxzjQ3U— jamiemcintyre (@jamiemcintyre21) May 15, 2024
మరోవైపు.. గడిచిన ఎనిమిది నెలల్లో పుతిన్ చైనాను సందర్శించడం ఇది రెండోసారి. ఇదిలా ఉండగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతవారమే యూరప్‌లో ఐదు రోజుల పర్యటన ముగించుకొని చైనాకు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment