MAA Elections 2021: Actor Brahmaji Satirical Post On MAA Elections - Sakshi
Sakshi News home page

MAA Elections 2021: సీనియర్‌ నటుడి సెటైర్‌ పోస్ట్‌

Published Mon, Jun 28 2021 8:24 AM | Last Updated on Mon, Jun 28 2021 9:14 AM

In Satire Post Actor Brahmaji Meet China President About MAA Elections - Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. ఈ తరుణంలో చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ మా ఎన్నికల కోసం రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? ఎవరికీ అందని ఈ ఊహను తన కామెడీ టైమింగ్‌తో తెర మీదకు తెచ్చాడు సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ. 

చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌ నటుడు బ్రహ్మాజీకి ఏకంగా షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, కరోనా జాగ్రత్తతో మన నటుడు మర్యాదపూర్వకంగా ఆ షేక్‌హ్యాండ్‌ను తిరస్కరించి.. నమస్తే పెట్టాడు. పైగా ఆ ఫొటోలో జింగ్ పిన్‌ కనీసం మాస్క్‌ లేకుండా ఉన్నాడు. అఫ్‌కోర్స్‌.. అది జింగ్‌ పిన్‌ పాత ఫొటోనే అయినా ఎడిటింగ్‌ గమ్మత్తుతో భలేగా దానిని ప్రజెంట్‌ చేశాడు బ్రహ్మాజీ. 

‘‘క్యాజువల్‌ మీట్‌.. ఎలాంటి రాజకీయాలు లేవు. కాకపోతే మా ఎన్నికల గురించి చర్చించాం. జింగ్‌ పిన్‌ కొన్ని సలహాలు ఇచ్చాడు. అలాగే..’’ అంటూ ఫన్నీ ఎమోజీతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు బ్రహ్మాజీ. ఇక తన తోటి నటులతో పాటు సమకాలీన విషయాలపై సెటైర్లు వేసే బ్రహ్మాజీ.. ఈమధ్యే తనకు భారీగా బంఫర్‌లాటరీ తగిలిందంటూ ‘ఫేక్‌ స్కాంకు సంబంధించిన ఒక అలర్ట్‌ మెసేజ్‌ను నెటిజన్స్‌ దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

చదవండి: మా ఎన్నికల్లో మరో ట్విస్ట్‌.. బరిలో ఆయన!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement