బీజింగ్: చైనాలో సైనిక కుట్ర జరిగిందనీ, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను నిర్బంధించారని వచ్చిన వార్తల్లో నిజానిజాలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ వదంతులే కావచ్చని పరిశీలకులు అంటున్నారు. ఎస్‌సీవో శిఖరాగ్రం కోసం రెండేళ్ల తర్వాత దేశం దాటిన నేపథ్యంలో జిన్‌పింగ్ తిరిగి రాగానే క్వారంటైన్‌లో ఉండి ఉంటారని అంటున్నారు.
2021లోనూ జిన్‌పింగ్ కొన్ని రోజులు కనిపించకపోయేసరికి ఇలాగే పుకార్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. కాకపోతే శనివారమంతా ఇంటర్నెట్ ‘కుట్ర’ వార్తలతో హోరెత్తినా ఇలాంటి వాటిపై చురుగ్గా ఉండే చైనా సోషల్ మీడియా ఇప్పటిదాకా స్పందించకపోవడం ఆశ్చర్యమేనంటున్నారు. బహుశా అక్టోబర్ 16వ తేదీన అధ్యక్ష ఎన్నిక నాటికే దీనిపై స్పష్టత వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment