Tariff Order
-
ట్రంప్ సంచలన నిర్ణయాలు.. అమెరికన్లకు కొత్త టెన్షన్!
వాషింగ్టన్: అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు అమెరికా ప్రజలకు శాపంగా మారే అవకాశం ఉంది. కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతులపై సుంకాలు విధించిన నేపథ్యంలో అమెరికాలో కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికన్లను ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ట్రంప్.. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాల పెంపుదలతో అమెరికన్లు ఆర్థిక భారం మోయాల్సి రావచ్చని అన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో తప్పక ప్రతిఫలం లభిస్తుందని చెప్పుకొచ్చారు.కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతులపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు ప్రతీకార చర్యలకు నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో అమెరికాలో ధరలు కూడా పెరిగే ప్రమాదముందనే హెచ్చరికల నేపథ్యంలో అధ్యక్షుడు స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం నాపై ఉంది. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా నా బాధ్యత. చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు తమ సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాను. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సుంకాల పెంపుదలతో అమెరికన్లు ఆర్థిక భారం మోయాల్సి రావచ్చు. అయినప్పటికీ విషయంలో తప్పక ప్రతిఫలం లభిస్తుంది. అమెరికాను మళ్లీ గొప్పగా మారుస్తాను అంటూ కామెంట్స్ చేశారు.Donald Trump campaigned on lowering the price of goods.He's now saying we will feel "pain" and understand it.His policies are disastrous.pic.twitter.com/Qyt77io44l— Art Candee 🍿🥤 (@ArtCandee) February 3, 2025ఇదిలా ఉండగా.. మూడు దేశాలపై ట్రంప్ సుంకాలు విధించడంతో ఆయా దేశాలు అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాయి. అందులో భాగంగా 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తునట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. మెక్సికో సైతం ఇలాంటి చర్యలకు సిద్ధమైంది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్‌లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ పేర్కొన్నారు. చైనాకు కూడా స్పందిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థలో ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని అమెరికాను కోరుతున్నాం అంటూ హితవు పలికింది. -
ట్రంప్ సంచలన నిర్ణయం.. మూడు దేశాలకు షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాలపై సుంకాలు విధించి అందరికీ ఝలక్ ఇచ్చారు. మెక్సికో, కెనడా, చైనా దేశాలపై టారిఫ్‌లు విధించారు. ఈ క్రమంలో దేశీయ తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆ సుంకాలను ఉపయోగిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో, ఆయన నిర్ణయంపై చర్చ నడుస్తోంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అధికారం చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఒకేసారి మూడు దేశాలపై సుంకాలను విధించారు. కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధించినట్లు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సుంకాలను విధించే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు.ఈ సందర్భంగా ట్రంప్.. ‘మెక్సికో, కెనడా దిగుమతులపై 25% సుంకం (కెనడియన్ ఎనర్జీపై 10%), చైనాపై 10% అదనపు సుంకాన్ని అమలు చేశాను. ఫెంటానిల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) ద్వారా ఈ సుంకాలు విధించాను. మనం అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరి భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా నా కర్తవ్యం. అక్రమ విదేశీయులు, మాదకద్రవ్యాల వరద మన సరిహద్దుల గుండా ప్రవహించకుండా నిరోధించడానికి నేను నా ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాను. అమెరికన్లు దీనికి అనుకూలంగా ఓటు వేశారు’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. టారిఫ్‌ల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా వృద్ధి తగ్గడమే కాదు.. కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాంద్యం సంభవించే ప్రమాదం ఏర్పడింది. అలాగే, ఈ ఏడాది అమెరికా ఆర్థిక వృద్ధి 1.5% తగ్గుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇక, ట్రంప్ ఆదేశాల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం 05:01 గంటలకు) సుంకాలు అమల్లోకి వస్తాయి. రవాణాలో ఉన్న వస్తువులు, కటాఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దులోకి ప్రవేశించే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉండనుంది. సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని ట్రంప్ తెలిపారు. -
వొడాఫోన్ ఐడియా నష్టం 4,882 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ టెలికం మార్కెట్లో టారిఫ్‌ల పరంగా తీవ్రమైన పోటీ నేపథ్యంలో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.4,882 కోట్ల నష్టం ప్రకటించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే మూడో క్వార్టర్లో నమోదైన రూ.5,005 కోట్లతో పోలిస్తే మాత్రం కొంత తగ్గింది. వొడాఫోన్, ఐడియా సంస్థలు గతేడాది ఆగస్టులో విలీనం కావడంతో అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో ఫలితాలను పోల్చి చూడటానికి లేదు. 2018–19 మూడో త్రైమాసికంలో ఆదాయం రూ. 11,765 కోట్లు కాగా, నాలుగో త్రైమాసికంలో దాదాపు అదే స్థాయిలో రూ.11,775 కోట్లుగా నమోదైంది. విలీనానంతరం అమలు చేస్తున్న నిర్ణయాలు క్రమంగా సానుకూల ఫలితాలిస్తున్నాయని, రెండేళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వొడాఫోన్ ఐడియా సీఈవో బాలేష్ శర్మ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 37,092 కోట్లు కాగా, నష్టం రూ. 14,604 కోట్లు. ఒక్కో యూజరుపై సగటు ఆదాయం సీక్వెన్షియల్‌గా చూస్తే 16.3 శాతం పెరిగి రూ.104కి చేరింది. క్యూ3లో ఇది రూ.89గా ఉంది. సంస్థ ఆర్థిక ఫలితాలు మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడయ్యాయి. సోమవారం బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు 3% పెరిగి రూ.14.45 వద్ద క్లోజయ్యింది. -
‘ఛత్తీస్’ విద్యుత్ డౌటే!
* తక్కువకే కరెంట్ ఇస్తామంటూ ధర పెంచేసిన ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ * రూ.2.71 నుంచి రూ.3.14కు, తాజాగా రూ.3.90కు పెంపు * సుంకాలు, ఇతర భారాలు కలిపితే యూనిట్ ధర రూ. 5పైనే * రూ. 3.50-రూ. 4కే మార్కెట్లో లభిస్తున్న విద్యుత్ * ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో ఏటా రూ.750 కోట్ల నుంచి 1,000 కోట్ల భారం! * ధర తగ్గించాల్సిందేనని తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం మీమాంసలో పడింది. తక్కువ ధరకే విద్యుత్ విక్రయిస్తామని తొలుత పేర్కొన్న ఛత్తీస్‌గఢ్ తాజాగా అమాంతంగా ధరను పెంచేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరడం తెలిసిందే. యూని ట్‌కు రూ.2.71 చొప్పున ఈ విద్యుత్‌ను విక్రయిస్తామని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ డిస్కం 2015-16లో ఆ రాష్ట్ర ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లోనూ ఇదే ధరను ప్రతిపాదించింది. అయితే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ నియంత్రణ మండలి అప్పట్లో ధరను రూ.3.14కు పెంచి టారీఫ్ ఆర్డర్‌ను జారీ చేసింది. తాజాగా 2016-17కు సంబంధించి జారీ చేసిన టారీఫ్ ఆర్డర్లో ఈఆర్సీ మరోసారి ‘మార్వా’ విద్యుత్ ధరను పెంచేసి రూ.3.90గా ఖరారు చేసింది. మరోవైపు మార్వా విద్యుత్ కేంద్రానికి కేటాయించిన బొగ్గు గని ఉత్పత్తికి సిద్ధం కాకపోవడంతో కేంద్రం మూడేళ్ల కోసం తాత్కాలిక బొగ్గు కేటాయింపులు చేసిన విషయం కొత్తగా వెలుగులోకి వచ్చింది. స్థిరవ్యయం రూ.2.70, చర వ్యయం రూ.1.20 కలిపి ‘మార్వా’ విద్యుత్ ధర రూ.3.90 ఉంటుం దని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ లెక్కగట్టింది. ఇంధన సర్దుబాటు చార్జీ అదనమని స్పష్టం చేసింది. తాత్కాలిక బొగ్గు విని యోగంతో చర వ్యయం రూ.1.20 నుంచి రూ.1.50కు పెరగనుంది. దీంతో యూనిట్ ధర రూ. 3.90 నుంచి 4.20కు పెరగనుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ తరలించేందుకు యూనిట్‌పై చెల్లించాల్సిన 70 పైసల ట్రాన్స్మిషన్ చార్జీలు కలిపితే ఈ ధర రూ.4.90కు చేరనుంది. అదనంగా నీటి చార్జీలు, పెన్షన్లు, గ్రాట్యుటీ, స్టార్టప్ చార్జీలు, విద్యుత్ సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ పేర్కొనడంతో రాష్ట్రానికి విద్యుత్ వచ్చేసరికి ధర రూ.5 నుంచి రూ. 5.50 మధ్య ఉండనుంది. పునరాలోచన లేదు ఇరు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఒప్పందం జరిగింది కాబట్టి పునరాలోచన చేయలేం. పన్నులు, సుంకాలతోపాటు కొన్నింటిని ఛత్తీస్గడ్ రాష్ట్రమే భరించాలని చెప్పాం. రాష్ట్రానికి విద్యుత్ కారిడార్ అవసరం కావడంతోనే ఈ ఒప్పందం చేసుకున్నాం. - డి.ప్రభాకర్‌రావు, టీ ట్రాన్స్‌కో సీఎండీ మార్కెట్లో ఇంకా తక్కువకే... ప్రస్తుతం మార్కెట్లో రూ.3.50 నుంచి రూ.4 కే విద్యుత్ లభిస్తుండగా ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌కు ప్రతి యూనిట్‌పై రూ.1 నుంచి రూ. 1.50 వరకు అధికంగా చెల్లించాల్సి రానుంది. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఏటా కనీసం 750 కోట్ల యూనిట్లను కొనుగోలు చేయాల్సిందే. ఈ లెక్కన ప్రతి యూనిట్‌పై రూపాయి చొప్పున 750 కోట్ల యూనిట్లపై ఏటా రూ.750 కోట్ల నుంచి రూ.1000 అదనపు వ్యయం కానుంది. 12 ఏళ్ల ఒప్పంద కాలంలో కనీసం రూ. 10 వేల కోట్ల భారం పడనుందని అంచనా. ఒక్కసారిగా ధరను ఛత్తీస్‌గఢ్ పెంచేయడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అధికారులతో సమావేశమైన రాష్ట్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ధరపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ సుంకం, ఇతరత్రా పన్నులు, వ్యయభారాలను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రమే భరించాలని తేల్చి చెప్పారు. దీనిపై వెంటనే నిర్ణయాన్ని తెలపని ఛత్తీస్‌గఢ్ అధికారులు... మళ్లీ సమావేశానికి వస్తామని చెప్పి వెనుతిరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని వదులుకుంటేనే రాష్ట్రానికి మేలని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. వార్దా-మహేశ్వరం మధ్య నిర్మిస్తున్న విద్యుత్ లైన్ల నిర్మాణం పూర్తైనే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి రానుంది.