హిందీ, కన్నడ భాషలతో పాటు తెలుగులో కూడా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన 'కృతి ఖర్బందా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2009లో బోణి చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈమె పవన్ కళ్యాణ్ సరసన తీన్‌మార్ సినిమాలో కూడా కనిపించింది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఖరీదైన ఒక రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేసింది.
నివేదికల ప్రకారం, కృతి ఖర్బందా కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ వెలార్ ధర సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు వైట్ కలర్‌లో చూడచక్కగా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రేంజ్ రోవర్ వెలార్ ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఒకటి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. అయితే కృతి డీజిల్ కారుని కొన్నట్లు సమాచారం. ఈ ఇంజిన్ 204 పీఎస్ పవర్ 430 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ డెలివరీ చేస్తుంది.
(ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!)
అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ వంటి వాటితో పాటు.. 3D 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, PM2.5 ఎయిర్ ఫిల్టర్, 12 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 14 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు కలిగి వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.
రేంజ్ రోవర్ వెలార్ ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 89.41 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే ఈ కారు గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఇది భారతీయ విఫణిలో కూడా త్వరలో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ కారు మార్కెట్లో మెర్సిడెస్ GLE, ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ ఎక్స్5, పోర్స్చే మకాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment