Kriti Karbandha
-
కర్వా చౌత్ సెలబ్రేషన్స్ : ఈ సందడి అస్సలు మిస్ కావద్దు!
-
టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. అతడికి మాత్రం రెండోది!
హీరోయిన్ కృతి కర్బందా జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రియుడు, హీరో పులకిత్ సామ్రాట్‌తో ఏడడుగులు వేసింది. శుక్రవారం (మార్చి 15న) నాడు హర్యానాలోని గురుగ్రామ్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వధూవరులిద్దరూ ఒకరోజు ఆలస్యంగా తమ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా గుండె కొట్టుకునేది నీ కోసమే.. ఇప్పటికీ, ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండాలంటూ హీరోయిన్ క్యాప్షన్ రాసుకొచ్చింది. పెళ్లిలో కృతి.. పింక్ లెహంగాలో మెరిసిపోయింది. పులకిత్.. లేత ఆకుపచ్చ రంగు షేర్వాణీలో రాకుమారుడిగా ముస్తాబయ్యాడు. ఆ సినిమా షూటింగ్‌లోనే లవ్ ఈ ఫోటోల్లో వీరిద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడిచి వస్తుంటే చుట్టూ ఉన్నవారు పూల వర్షం కురిపించారు. మరో ఫోటోలో హీరోయిన్ తన భర్తకు నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టింది. తాళి కట్టిన క్షణాలను సైతం ఫోటోల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కృతి, పులకిత్ జంటగా 'వీరే కి వెడ్డింగ్', 'తైష్', 'పాగల్పంటి' చిత్రాలలో కనిపించారు. పాగల్పంటి (2019) షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ సినిమాలతో ఫేమస్ గతంలో పులకిత్.. శ్వేతా రోహిరా అనే నటిని 2014లో పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన 11 నెలలకే వీరు విడిపోయారు. కాగా కృతి కర్బందా.. బోణి, తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం, బ్రూస్లీ: ద ఫైటర్ వంటి సినిమాలతో తెలుగువారికి దగ్గరైంది. తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసినా బాలీవుడ్లోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) చదవండి: నాన్న చావబాదేవాడు.. తను ఊపిరి వదిలేముందు..: రేసుగుర్రం విలన్ -
అనసూయ మరింత అందంగా.. హెబ్బా మాత్రం చీరలో వేరేలా!
బీచ్ ఒడ్డున హీరోయిన్ కేతిక అందాల జాతర వైట్ షర్టుతో మడోన్నా సెబాస్టియన్ కిరాక్ పోజులు చూపులతో చంపేస్తున్న యాంకర్ అనసూయ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో కేక పుట్టిస్తున్న సిమ్రన్ చీరకట్టులో మరింత అందంగా హీరోయిన్ హెబ్బా పటేల్ చీరలో నడుముం అందాలు చూపిస్తున్న తాప్సీ పన్ను అందాలన్నీ చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఐశ్వర్య మేనన్ ఫొటో బ్లర్ ఉంది కానీ కృతి కర్బంగా అందం మాత్రం అబ్బో! View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
'బంగార్రాజు' హీరోయిన్ క్రేజీ పోజు.. పెళ్లికి ముందు కృతి చిల్ మోడ్!
చీరలో మరింత క్యూట్‌గా సురేఖావాణి కూతురు సుప్రీత షార్ట్ డ్రస్‌లో అందాలు ఒలకబోస్తున్న యాంకర్ దీపిక పిల్లి కశ్మీర్లో చిల్ అవుతున్న హీరోయిన్ ఆకాంక్ష సింగ్ బీచ్ ఒడ్డున బికినీలో కేక పుట్టిస్తున్న కృతి కర్బందా మత్తెక్కించేలా ఒయ్యరంగా కూర్చుని పోజిచ్చిన మడోన్నా బ్యాక్ పోజులతో మెంటలెక్కిస్తున్న హీరోయిన్ దక్షా నగర్కర్ విచిత్రమైన ఔట్ఫిట్తో కనిపించిన సోనాల్ చౌహాన్ ఉల్లిపొర లాంటి చీరలో నాభి అందాలతో మాళవిక మోహన్ View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Wedding Vows Magazine (@weddingvows.in) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Soundarya Sharma (@iamsoundaryasharma) -
నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం?
ఈ బ్యూటీ తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మెగా హీరోలతో కలిసి మూవీస్ చేసింది. మంచి పేరు సంపాదించింది. ఇకపోతే గత నాలుగేళ్లుగా ఓ నటుడితో డేటింగ్ చేస్తోంది. వీళ్ల పెళ్లి గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు వాటిని నిజం చేశారు. కాకపోతే చాలా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఈమెకు పెళ్లెప్పుడు? దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా.. 'బోణీ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్లోనే తీన్మార్, అలా మొదలైంది. మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర చిత్రాలు చేసింది. చివరగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' మూవీలో రామ్ చరణ్‌కి అక్కగా నటించింది. గ్లామర్ పరంగా సూపర్ ఉన్నప్పటికీ ఈమెకు తెలుగులో ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీపై పూర్తి ఫోకస్ చేసింది. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీలోనే సినిమాలు చేస్తూ కాస్తంత బిజీగా ఉంది. ఇదే టైంలో బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్‌తో రిలేషన్లో ఉన్నట్లు నాలుగేళ్ల క్రితమే రూమర్స్ వచ్చాయి. అయితే డేటింగ్ నిజమే అని క్లారిటీ ఇచ్చేలా కలిసి చాలా చోట్ల కృతి-పులకిత్ జంటగా కనిపించారు. మరి వీళ్ల పెళ్లెప్పుడా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఆ పుకార్లకు ఎండ్ కార్డ్ వేస్తూ నిశ్చితార్థం చేసేసుకున్నారు. అయితే కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే కృతి కర్బందా-పులకిత్ సామ్రాట్ ఎంగేజ్మెంట్ జరిగింది. కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిశ్చితార్థం జరిగిన విషయం బయటపడింది. అలానే వీళ్ల పెళ్లి వచ్చే నెలలో ఉండొచ్చని అంటున్నారు. పెళ్లిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) -
నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్
సినిమా హీరోహీరోయిన్లు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అభిమానులం అని చెప్పి కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. దాదాపు ప్రతి హీరోహీరోయిన్ ఏదో ఓ సందర్భంలో ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతూనే ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ తనకు ఓ సినిమా షూటింగ్ టైంలో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి బయటపెట్టింది. (ఇదీ చదవండి: చిరంజీవి బర్త్‌డే.. కూతురు ఫొటో పోస్ట్ చేసిన చరణ్) ఎవరీ బ్యూటీ? దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా.. 'బోణీ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. దీంతో పాటు అలా మొదలైంది, తీన్ మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, బ్రూస్ లీ తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఈమె అందంగా ఉన్నప్పటికీ సరైన హిట్స్ పడకపోవడం వల్ల ఇక్కడ ఛాన్సులు రాలేదు. దీంతో కన్నడ, హిందీలో బిజీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా గతంలో తనకెదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. సీక్రెట్ కెమెరా 'గతంలో ఓ కన్నడ సినిమా షూటింగ్ టైంలో జరిగిన సంఘటనని నేను అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే హోటల్ లో పనిచేసే ఓ వ్యక్తి నా గదిలో సీక్రెట్ కెమెరా పెట్టాడు. అయితే హోటల్ రూంలో బస చేసేటప్పుడు చెక్ చేసుకోవడం నాకు, నా టీమ్‌కి అలవాటు. అలా పరిశీలిస్తుండగా కెమెరా బయటపడింది. సెట్-ఆఫ్ బాక్స్ వెనక అతడు ఉంచిన కెమెరా చూసి చాలా భయపడ్డాను. అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉంటున్నాను' అని కృతి కర్బందా చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?) -
కొత్త కారు కొన్న తీన్మార్ బ్యూటీ.. ధర ఎంతో తెలుసా?
హిందీ, కన్నడ భాషలతో పాటు తెలుగులో కూడా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన 'కృతి ఖర్బందా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2009లో బోణి చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈమె పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ సినిమాలో కూడా కనిపించింది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఖరీదైన ఒక రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం, కృతి ఖర్బందా కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ వెలార్ ధర సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు వైట్ కలర్లో చూడచక్కగా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేంజ్ రోవర్ వెలార్ ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఒకటి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. అయితే కృతి డీజిల్ కారుని కొన్నట్లు సమాచారం. ఈ ఇంజిన్ 204 పీఎస్ పవర్ 430 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా పవర్ డెలివరీ చేస్తుంది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ వంటి వాటితో పాటు.. 3D 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, PM2.5 ఎయిర్ ఫిల్టర్, 12 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 14 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు కలిగి వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. రేంజ్ రోవర్ వెలార్ ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 89.41 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే ఈ కారు గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఇది భారతీయ విఫణిలో కూడా త్వరలో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ కారు మార్కెట్లో మెర్సిడెస్ GLE, ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ ఎక్స్5, పోర్స్చే మకాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
హీరోయిన్ కృతి కర్భందా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బోణి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయైన కృతి తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త వంటి సినిమాలతో ఆకట్టుకుంది. అయితే హీరోయిన్‌కు ఆమెకు అనుకున్నంత క్రేజ్ దక్కలేదు. దీంతో టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చి బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ అక్కడ హౌస్ ఫుల్ 4, పాగల్ పంటి, 14 ఫెహరే వంటి సినిమాలతో ఆకట్టుకుంది. సినిమాల విషయం పక్కన పెడితే కృతి కర్భందాకు సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా వలైంటైన్స్ డే సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు పులికిత్ సామ్రాట్‌తో ప్రేమలో ఉన్న కృతి తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్రియుడితో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే పులికిత్ విషయానికి వస్తే.. పలు సినిమాలు, సీరియల్స్‌తో ఆకట్టుకున్న ఆయన గతంలో శ్వేతా రోహిరా అనే హీరోయిన్ను పెళ్లాడాడు. అయితే వివాహం జరిగిన ఏడాదికే మనస్పర్థల కారణంగా వీరు విడిపోయారు. ఇప్పుడు ఆయన కృతితో ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది. -
ఫ్యాన్స్‌కు ఓపెన్ ఆఫర్..హీరోయిన్‌తో డైరెక్ట్‌గా జూమ్ కాల్లో..
సినిమాలు ప్రమోట్ చేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌ను అనుసరిస్తారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాకే జై కొడుతున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం సోషల్ మీడియాను తెగ వాడుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బందా సైతం చేరింది. ప్రస్తుతం ఆమె ‘14 ఫేరే’ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలె విడుదలై సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దేవాన్షుసింగ్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే, కృతి కర్బందా హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా తన మూవీని ప్రమోషన్లో భాగంగా ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది కృతి. ఈ మూవీ ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నానని, అయితే ట్రైలర్లో తమకు నచ్చిన విషయాలేంటో చెప్పాలని ఫ్యాన్స్‌ను కోరింది. ఎవరైతే తనకు నచ్చిన అంశాల్ని ప్రస్తావిస్తారో వారితో జూమ్ కాల్లో మాట్లాడతానని అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఇక కృతి తెలుగులో తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ చిత్రాల్లో తళుక్కున మెరిసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత హిందీలో కాలు మోపిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైంది. ఇటీవలే హిందీలో ‘పాగల్ పంతి’ ‘హౌస్ ఫుల్-4’ సినిమాలతో హిట్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. -
సినిమానే సిరీస్‌గా.!
హిందీ సినిమా ‘తైష్’ త్వరలో ఓటీటీలో విడుదల అవుతున్నట్టు ప్రకటించారు. అయితే ప్రయోగాత్మకంగా... ఈ సినిమా ఒకే రోజు సినిమాగా, సిరీస్‌గా విడుదలవుతుందట. పులకిత్ సామ్రాట్, జిమ్ షరాబ్, క్రితీ కర్భంధా ముఖ్య పాత్రల్లో దర్శకుడు బీజోయ్ నంబియార్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘తైష్’. అక్టోబర్ 29న జీ5లో ఈ సినిమా విడుదల కానుంది. ‘తైష్’ రెండున్నర గంటల సినిమాలా, 6 ఎపిసోడ్ల మినీ సిరీస్‌లో అందుబాటులో ఉంటుందట. ఈ నిర్ణయం గురించి చిత్రబృందం మాట్లాడుతూ –‘‘గతంలో సినిమాగా రూపొందించిన సిరీస్‌గా ఎడిట్ అయిన సినిమాలు ఉన్నాయి. మా చిత్రాన్ని థియేటర్ కోసం తెరకెక్కించాం. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఓటీటీలో విడుదల చేస్తున్నాం. సినిమా పూర్తయ్యాక టెస్ట్ స్క్రీనింగ్ (అతికొద్ది మందికి సినిమా ప్రదర్శించి ఫలితాన్ని సమీక్షించుకోవడం) నిర్వహించాం. సినిమా బావుంది. ఇందులో పాత్రల గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపించింది అని కొందరు అనడంతో సిరీస్ ఆలోచన వచ్చింది. ఈ సినిమాను అలానే ఉంచి, సిరీస్‌గా ఎలా మలచగలం అని ఆలోచించి దానికి అనుగుణంగా ఎడిటింగ్ చేశాం. ఏది కావాలనుకున్నవాళ్లు అది ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. -
నో బ్రేక్.. సింగిల్ టేక్
‘సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇక్కడ’ అనే డైలాగులు సినిమాల్లో సరదా సందర్భాల్లో చాలానే వింటుంటాం. కానీ మన ఇండియన్ ఇండస్ట్రీల్లో అలాంటి యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. అందులో అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అమితాబ్ తాజాగా తన నటనతో ‘చెహర్’ చిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురి చేశారట. ఇమ్రాన్ హష్మీ, అమితాబ్ బచ్చన్, కృతీ కర్బందా, రియా చక్రవర్తి ముఖ్య పాత్రల్లో రుమీ జాఫ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చె హర్’. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఈ సినిమాలో 14 నిమిషాల సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో చేశారట అమితాబ్. అంత లెంగ్తీ సీన్‌ని ఒకే ఒక్క టేక్‌లో చేయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే టీమ్ అంతా నిలబడి అమితాబ్‌కు చప్పట్లు కొట్టారట. ఈ విషయాన్ని ఆ చిత్ర సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి తెలిపారు. ‘‘అమితాబ్‌గారు ఇవాళ ఇండియన్ సినిమా చరిత్రలో మరో అద్భుతం సృష్టించారు. 14 నిమిషాలు ఏకధాటిగా నటించి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సార్, ఏమాత్రం డౌన్ లేదు. ప్రపంచంలో మీరు నిజంగా బెస్ట్’’ అని ట్వీట్ చేశారు రసూల్. -
మిస్టరీ స్టార్ట్!
ముంబైలో జరుగుతున్న ఓ మిస్టరీలో భాగస్వాములయ్యారు అమితాబ్ బచ్చన్. మరి... ఈ మిస్టరీ తాలూకు డీటైల్స్ తెలిసేది మాత్రం వెండితెరపైనే. అమితాబ్‌బచ్చన్, ఇమ్రాన్ హష్మి, కృతీకర్బందా ముఖ్య తారలుగా తెరకెక్కనున్న సినిమాకు ‘చెహ్రీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. రుమి జఫ్రే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లింగ్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో మొదలైంది. రేఖ చక్రవర్తి, సిద్ధాంత్ కపూర్, థ్రిత్మన్ చక్రవర్తి, రఘుబీర్ యాదవ్, అనుకపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదల చేయాలనుకుంటున్నారు. -
స్క్రీన్ టెస్ట్
1932లో తెలుగు సినిమా ప్రస్థానం ‘భక్తప్రహ్లాద’తో మొదలైంది. ఆ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి. అదే టైటిల్‌తో 1967లో మరోసారి చిత్రపు నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కింది. రెండు చిత్రాలు పేరు తెచ్చుకున్నాయి. ఇలా హిట్ టైటిల్ రిపీట్ అయితే అదో అదనపు పబ్లిసిటీ అవుతుంది. అలా ఒకే పేరుతో విడుదలైన పలు సినిమాల గురించి ఈ వారం క్విజ్... 1. 1957లో రిలీజైన ‘మాయాబజార్’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. అదే టైటిల్‌తో 2006లో మరో సినిమా విడుదలైంది. మొదటి ‘మాయాబజార్’ దర్శకుడు కె.వి.రెడ్డి. 2006లో వచ్చిన సినిమా దర్శకుడు ఎవరు? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) నీలకంఠ సి) రవిబాబు డి) చంద్రసిద్ధార్థ్ 2.1989లో మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్‌హిట్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’. అదే పేరుతో 2014లో విడుదలైన హారర్ చిత్రం ‘గీతాంజలి’కి దర్శకుడు రాజకిరణ్. కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ ప్రాత పోషించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) ‘కలర్స్’ స్వాతి బి) నందితారాజ్ సి) అంజలి డి) తేజస్వి మడివాడ 3. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన ‘దేవదాసు’ సినిమా గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 1953లో ఆ సినిమా విడుదలైంది. 1974లో హీరో కృష్ణ, 2006లో హీరో రామ్, 2018లో నాగార్జున ఈ పేరుతో మళ్లీ సినిమాలు చేశారు. రామ్ ‘దేవదాస్’ ద్వారా హీరోయిన్గా పరిచయమైన కథానాయిక ఎవరో కనుక్కోండి? ఎ) షీలా బి) హన్సిక సి) జెనీలియా డి) ఇలియానా 4. యన్టీఆర్, కృష్ణ హీరోలుగా 1973లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం చేశారు. తర్వాత 2012లో దర్శకుడు పూరి జగన్నాథ్ అదే పేరుతో ఓ సినిమా తీశారు. ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) రానా బి) రవితేజ సి) రామ్ డి) కల్యాణ్ రామ్ 5. 1987లో చిరంజీవి, సుహాసిని జంటగా తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరాధన’. అదే పేరుతో 1962లోనే యన్టీఆర్ ‘ఆరాధన’ చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిందెవరో తెలుసా? ఎ) వాణిశ్రీ బి) సావిత్రి సి) జమున డి) కృష్ణకుమారి 6. కృష్ణ నటించిన 200వ చిత్రం ‘ఈనాడు’. ఆ సినిమా సూపర్‌హిట్. అదే పేరుతో 2009లో కమల్ హాసన్ హీరోగా నటించారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో మరో తెలుగు హీరో పోలీసాఫీసర్‌గా నటించారు. ఎవరా హీరో? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) రాజశేఖర్ డి) చిరంజీవి 7. 1979లో వచ్చిన యన్టీఆర్ ‘వేటగాడు’ సూపర్ హిట్. అదే టైటిల్‌తో 1995లో రాజశేఖర్ హీరోగా సినిమా చేశారు. 1979లో విడుదలైన ‘వేటగాడు’ చిత్రంలో ‘పుట్టింటోళ్లు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు...’ అనే సూపర్‌హిట్ క్లబ్ సాంగ్‌లో యన్టీఆర్‌తో కాలు కదిపిన ప్రముఖ డాన్సర్ పేరేంటి? ఎ) అనురాధ బి) జ్యోతిలక్ష్మీ సి) జయమాలిని డి) హలం 8. కె.విశ్వనాథ్ కెరీర్‌లోని అద్భుతమైన చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. ఆ సినిమా 1980లో విడుదలైంది. 2015లో విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రంలో కథానాయకుడు ఎవరు? ఎ) నితిన్ బి) నవదీప్ సి) సిద్ధార్థ్ డి) నిఖిల్ 9. 1988 ‘ఘర్షణ’, 2004 ‘ఘర్షణ’ మంచి విజయం సాధించాయి. రెండు చిత్రాల్లోని పాటలు సూపర్‌హిట్. పాత ‘ఘర్షణ లోని ‘ఒక బృందావనం సోయగం...’ పాటను చిత్ర పాడారు. తర్వాతి ‘ఘర్షణ’లో ‘చెలియ చెలియ చెలియ చెలియా, అలల ఒడిలో ఎదురు చూస్తున్నా...’ పాట పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) కౌసల్య బి) శ్రేయా గోషల్ సి) మల్గాడి శుభ డి) ఎస్పీ శైలజ 10. ‘పెళ్లి పుస్తకం’ అనగానే బాపు–రమణలు గుర్తుకు వస్తారు. అదే పేరుతో మరోసారి ఓ సినిమా విడుదలైంది. మొదటిసారి విడుదలైన ‘పెళ్లి పుస్తకం’ చిత్రంలో హీరో రాజేంద్రప్రసాద్, రెండో సారి విడుదలైన చిత్రంలో హీరో ఎవరు? ఎ) రాహుల్ రవీంద్రన్ బి) నవీన్ చంద్ర సి) సుశాంత్ డి) సుమంత్ 11. 1989లో విడుదలైన జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. అదే పేరుతో కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా మరో సినిమా తెరకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) ఈషా రెబ్బా బి) కృతీ కర్భందా సి) తాప్సీ డి) పూర్ణ 12. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘పవిత్రబంధం’. అదే పేరుతో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా లె రకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించిందెవరో గుర్తుందా? ఎ) ఆమని బి) మీనా సి) సౌందర్య డి) రోజా 13. 1968లో విడుదలైన చిత్రం ‘రాము’. యన్టీఆర్ సరసన జమున కథానాయికగా నటించారు. 1987లో బాలకృష్ణ ‘రాము’ పేరుతో సినిమా చేశారు. ఆయన సరసన నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) సుహాసిని బి) రజని సి) రాధ డి) భానుప్రియ 14. కమల్‌హాసన్ ‘సత్య’ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ సినిమా 1988లో విడుదలైంది. పదేళ్ల తర్వాత అదే పేరుతో ఓ సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. రామ్‌గోపాల్‌వర్మ నిర్మించి, దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో హీరో జె.డి చక్రవర్తి సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) ఊర్మిళ మటోండ్కర్ బి) ఆంత్రమాలి సి) నిషాకొఠారి డి) మధుషాలిని 15. 1955లో విడుదలైన ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన క్లాసికల్ మూవీ ‘మిస్సమ్మ’. ఆ చిత్రంలో ‘మిస్సమ్మ’ గా సావిత్రి నటిస్తే 2003లో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మిస్సమ్మ’ వచ్చింది. 2003 ‘మిస్సమ్మ’ ఎవరో తెలుసా? ఎ) సిమ్రాన్ బి) భూమికా చావ్లా సి) త్రిష డి) రమ్యకృష్ణ 16. 1948లో ఓసారి, 1970 మరోసారి, 1995లో ఇంకోసారి ఇలా అనేక సార్లు ‘ద్రోహి’ టైటిల్‌తో సినిమాలు విడుదలయ్యాయి. 1948 సినిమాకు ఎల్వీ. ప్రసాద్, 1970 సినిమాకు కె.బాపయ్య దర్శకులు. 1995లో విడుదలైన సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) కమల్ హాసన్ బి) సురేశ్ కృష్ణ సి) పి.సి. శ్రీరామ్ డి) అర్జున్ 17. 1951 నాటి ‘మల్లీశ్వరి’ చిత్రంలో టైటిల్ రోల్‌ను భానుమతి పోషించారు. 2004 ‘మల్లీశ్వరి’లో టైటిల్ రోల్ చేసిన నటి ఎవరు? ఎ) కత్రినాకైఫ్ బి) టబు సి) అంజలా జవేరి డి) ప్రీతి జింతా 18. చిత్తూరు నాగయ్య హీరోగా కాంచనమాల హీరోయిన్గా బి.ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన 1939 నాటి చిత్రం ‘వందేమాతరం’. రాజశేఖర్ హీరోగా నటించగా టి.కృష్ణ 1985లో ‘వందేమాతరం’ టైటిల్‌తో సినిమా తీశారు. ఆ చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) విజయశాంతి బి) సుహాసిని సి) సుమలత డి) రాధిక 19. 1978లో విడుదలైన ప్రేమకావ్యం ‘మరోచరిత్ర’. బాలచందర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో కమల్‌హాసన్, సరిత జంటగా నటించారు. 2010లో ‘దిల్’ రాజు అదే టైటిల్‌తో ఓ సినిమా నిర్మించారు. ఆ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎ) ఆర్య బి) భరత్ సి) ప్రిన్స్ డి) వరుణ్ సందేశ్ 20. 1963లో ఓసారి, 2018లో ఓసారి ‘నర్తనశాల’ సినిమా విడుదలైంది. 1963లో విడుదలైన ‘నర్తనశాల’ లో అభిమన్యుడు పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) యన్టీఆర్ బి) శోభన్‌బాబు సి) అక్కినేని నాగేశ్వరరావు డి) కాంతారావు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) సి 3) డి 4) బి 5) ఎ 6) బి 7) సి 8) డి 9) బి 10) ఎ 11) డి 12) సి 13) బి 14) ఎ 15) బి 16) సి 17) ఎ 18) ఎ 19) డి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
లండన్ కాలింగ్
ఈ నెల చివర్లో కొత్త సినిమా కోసం లండన్ వెళ్లడానికి జాన్ అబ్రహాం ప్లాన్ చేశారు. ఇందుకోసం ఇలియానా కూడా సై అన్నారు. కానీ వీరి లండన్ ట్రిప్ నెక్ట్స్ మంత్కి వాయిదా పడింది. ఈ లోపు ఈ టీమ్‌తో కలిశారు కృతీ కర్భందా. ‘నో ఎంట్రీ, వెల్కమ్’ చిత్రాల ఫేమ్ అనీస్ బాజ్మీ దర్శకత్వంలో జాన్ అబ్రహాం హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘పాగల్ పంతి’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో ఒక కథానాయికగా ఆల్రెడీ ఇలియానాను తీసుకున్నారు. ఇప్పుడు రెండో హీరోయిన్గా కృతీ కర్భందాను టీమ్ సెలక్ట్ చేశారు. ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా ప్యాచ్ వర్క్‌తో బిజీగా ఉన్నారు కన్నడ భామ కృతీ కర్భంద. ఇది కంప్లీట్ కాగానే కొత్త సినిమా కోసం జాన్, ఇలియానాతో కలిసి కృతీ లండన్‌కి వెళతారు. తెలుగులో తీన్మార్, ఒంగోలు గిత్త చిత్రాల్లో హీరోయిన్గా నటించిన కృతి ‘బ్రూస్లీ’లో రామ్‌చరణ్‌కు అక్కగా నటించారు. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో సౌత్‌కే పరిమితమైన కృతి ఇప్పుడు నార్త్పై కూడా దృష్టి పెట్టారు. -
ఫుల్ జోష్!
తెలుగు, తమిళం, మలయాళం.. ఇలా భాషతో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే కొత్త సినిమాకు పచ్చజెండా ఊపేస్తున్నారు కథానాయిక కల్యాణి ప్రియదర్శన్. ‘హలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ శర్వానంద్‌తో ఓ సినిమా చేశారు. ఇది రిలీజ్‌కి రెడీ అవుతోంది. అలాగే మాలీవుడ్‌లో ‘మరార్కర్: అరబికడలింటే సింగమ్’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్న తమిళ సినిమా ‘వాన్’లో నటించడానికి ఊ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారీ భామ. ఈ సినిమాతో రా కార్తీక్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. అలాగే ఈ సినిమాలో కృతి కర్భందా మరో కథానాయికగా నటిస్తారు. ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. ‘‘ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్. కథ పరంగా కథానాయికల పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంది. ఫ్రెష్ ఫేస్ కోసం కల్యాణిని తీసుకున్నాం. తమిళనాడుతో పాటు ఉత్తర భారతదేశంలో చిత్రీకరణ జరపాలనుకుంటున్నాం. ప్రచారంలో ఉన్నట్లు ఇది బైలింగ్వల్ సినిమా కాదు. కేవలం తమిళంలోనే తెరకెక్కిస్తాం’’ అని దర్శకుడు కార్తీక్ పేర్కొన్నారు. ఈ సినిమాలో మరో కథానాయిక పాత్ర కూడా ఉందని, ఆ పాత్రకు నివేథా పేతురాజ్‌ని ఎంపిక చేయాలని టీమ్ ఆలోచిస్తోందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. -
బాలీవుడ్లో రామ్ చరణ్ సిస్టర్
తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో 20కి పైగా సినిమాల్లో నటించినా స్టార్ ఇమేజ్ సాధించలేకపోయిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. హీరోయిన్ వేశాలు పక్కన పెట్టి బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్‌కు అక్కగా నటించినా.. అది కూడా వర్క్ అవుట్ కాలేదు. దీంతో సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ బ్యూటి ప్రస్తుతం బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ హీరోగా తెరకెక్కుతున్న రాజ్ రీబూట్‌లో హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటి.., ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటుంది. తొలిసారిగా తన సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న కృతి.. నటించటం కన్నా డబ్బింగ్ చెప్పటమే కష్టమంటోంది. 'షూటింగ్ సమయంలో ఫ్లోలో యాక్ట్ చేసేస్తాం.. కానీ డబ్బింగ్ చెప్పాలంటే మళ్లీ మనం అదే మూడ్‌ను రీ క్రియేట్ చేసుకోవాలి.. అది చాలా కష్టం' అని తెలిపింది.