
హీరోయిన్ కృతి కర్భందా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బోణి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయైన కృతి తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త వంటి సినిమాలతో ఆకట్టుకుంది. అయితే హీరోయిన్‌కు ఆమెకు అనుకున్నంత క్రేజ్ దక్కలేదు. దీంతో టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ అక్కడ హౌస్ ఫుల్ 4, పాగల్ పంటి, 14 ఫెహరే వంటి సినిమాలతో ఆకట్టుకుంది.
సినిమాల విషయం పక్కన పెడితే కృతి కర్భందాకు సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా వలైంటైన్స్ డే సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు పులికిత్ సామ్రాట్‌తో ప్రేమలో ఉన్న కృతి తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది.
ప్రియుడితో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే పులికిత్ విషయానికి వస్తే.. పలు సినిమాలు, సీరియల్స్‌తో ఆకట్టుకున్న ఆయన గతంలో శ్వేతా రోహిరా అనే హీరోయిన్‌ను పెళ్లాడాడు. అయితే వివాహం జరిగిన ఏడాదికే మనస్పర్థల కారణంగా వీరు విడిపోయారు. ఇప్పుడు ఆయన కృతితో ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment