టాలీవుడ్‌ హీరోయిన్‌ పెళ్లి.. అతడికి మాత్రం రెండోది! | Kriti Kharbanda Married to Pulkit Samrat, See Pics | Sakshi
Sakshi News home page

Kriti Kharbanda: ఏడాదికే భార్యకు విడాకులు.. హీరోయిన్‌తో నటుడి రెండో పెళ్లి

Published Sat, Mar 16 2024 1:37 PM | Last Updated on Sat, Mar 16 2024 3:12 PM

Kriti Kharbanda Married to Pulkit Samrat, See Pics - Sakshi

మరో ఫోటోలో హీరోయిన్‌ తన భర్తకు నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టింది. తాళి కట్టిన క్షణాలను సైతం ఫోటోల ద్వారా అభిమానులతో పంచుకుంది. కృతి, పులకిత్ జంటగా 'వీరే కి వెడ్డింగ్', 'తైష్', 'పాగల్పంటి' చిత్రాలలో కనిపించారు. పాగల్పంటి (2019) షూటింగ్‌ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

హీరోయిన్‌ కృతి కర్బందా జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది.‍ ప్రియుడు, హీరో పులకిత్‌ సామ్రాట్‌తో ఏడడుగులు వేసింది. శుక్రవారం (మార్చి​ 15న) నాడు హర్యానాలోని గురుగ్రామ్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వధూవరులిద్దరూ ఒకరోజు ఆలస్యంగా తమ పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. నా గుండె కొట్టుకునేది నీ కోసమే.. ఇప్పటికీ, ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండాలంటూ హీరోయిన్‌ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. పెళ్లిలో కృతి.. పింక్‌ లెహంగాలో మెరిసిపోయింది. పులకిత్‌.. లేత ఆకుపచ్చ రంగు షేర్వాణీలో రాకుమారుడిగా ముస్తాబయ్యాడు.

ఆ సినిమా షూటింగ్‌లోనే లవ్‌
ఈ ఫోటోల్లో వీరిద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడిచి వస్తుంటే చుట్టూ ఉన్నవారు పూల వర్షం కురిపించారు. మరో ఫోటోలో హీరోయిన్‌ తన భర్తకు నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టింది. తాళి కట్టిన క్షణాలను సైతం ఫోటోల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కృతి, పులకిత్ జంటగా 'వీరే కి వెడ్డింగ్', 'తైష్', 'పాగల్పంటి' చిత్రాలలో కనిపించారు. పాగల్పంటి (2019) షూటింగ్‌ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

ఆ సినిమాలతో ఫేమస్‌
గతంలో పులకిత్‌.. శ్వేతా రోహిరా అనే ‍నటిని 2014లో పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన 11 నెలలకే వీరు విడిపోయారు. కాగా కృతి కర్బందా.. బోణి, తీన్‌మార్‌, మిస్టర్‌ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం, బ్రూస్‌లీ: ద ఫైటర్‌ వంటి సినిమాలతో తెలుగువారికి దగ్గరైంది. తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసినా బాలీవుడ్‌లోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది.

చదవండి: నాన్న చావబాదేవాడు.. తను ఊపిరి వదిలేముందు..: రేసుగుర్రం విలన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement