హిందీ సినిమా ‘తైష్’ త్వరలో ఓటీటీలో విడుదల అవుతున్నట్టు ప్రకటించారు. అయితే ప్రయోగాత్మకంగా... ఈ సినిమా ఒకే రోజు సినిమాగా, సిరీస్‌గా విడుదలవుతుందట. పులకిత్ సామ్రాట్, జిమ్ షరాబ్, క్రితీ కర్భంధా ముఖ్య పాత్రల్లో దర్శకుడు బీజోయ్ నంబియార్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘తైష్’. అక్టోబర్ 29న జీ5లో ఈ సినిమా విడుదల కానుంది. ‘తైష్’ రెండున్నర గంటల సినిమాలా, 6 ఎపిసోడ్ల మినీ సిరీస్‌లో అందుబాటులో ఉంటుందట. ఈ నిర్ణయం గురించి చిత్రబృందం మాట్లాడుతూ –‘‘గతంలో సినిమాగా రూపొందించిన సిరీస్‌గా ఎడిట్ అయిన సినిమాలు ఉన్నాయి. మా చిత్రాన్ని థియేటర్ కోసం తెరకెక్కించాం. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఓటీటీలో విడుదల చేస్తున్నాం. సినిమా పూర్తయ్యాక టెస్ట్ స్క్రీనింగ్ (అతికొద్ది మందికి సినిమా ప్రదర్శించి ఫలితాన్ని సమీక్షించుకోవడం) నిర్వహించాం. సినిమా బావుంది. ఇందులో పాత్రల గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపించింది అని కొందరు అనడంతో సిరీస్ ఆలోచన వచ్చింది. ఈ సినిమాను అలానే ఉంచి, సిరీస్‌గా ఎలా మలచగలం అని ఆలోచించి దానికి అనుగుణంగా ఎడిటింగ్ చేశాం. ఏది కావాలనుకున్నవాళ్లు అది ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment