Thriller Movie
-
ఆ రోజు ఏం జరిగింది?
డిటెక్టివ్‌గా ఓ మర్డర్ కేసును పరిష్కరించే పనిలో పడ్డారు హీరోయిన్ కరీనా కపూర్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ది బకింగ్హమ్ మర్డర్స్’. హన్సల్ మెహతా దర్శకత్వం వహంచిన ఈ చిత్రం సెప్టెంబరు 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. విదేశాల్లో నివసిస్తున్న ఓ భారతీయుడి కుటుంబంలోని ఓ చిన్నారి హత్య నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో బ్రిటిష్– ఇండియన్ డిటెక్టివ్ జస్మిత్ భామ్రా పాత్రలో కరీనా నటిస్తున్నారని తెలుస్తోంది. ‘‘ఆ రోజు పార్కులో ఏం జరిగింది?, నువ్వు అతన్ని ఎలా చంపావ్?’...., ‘నువ్వు డిటెక్టివ్ కదా.. తెలుసుకో...!’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఏక్తా కపూర్, శోభా కపూర్లతో కలిసి ఈ సినిమాను కరీనా కపూర్ నిర్మించడం విశేషం. -
గతేడాది రిలీజైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. సైలెంట్‌గా ఓటీటీలోకి..
ఓటీటీలు వచ్చాక సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లో వచ్చే సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకుని కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎప్పటికప్పుడు థ్రిల్లర్ సినిమాలను అందుబాటులోకి తెస్తున్నాయి. అలాగే థియేటర్లలో విడుదలైన చిత్రాలను సైతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. అలా తాజాగా ఓ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే విధి. ఓటీటీలోకి వచ్చేసిన మూవీ రోహిత్ నందా, ఆనంది జంటగా నటించిన చిత్రం విధి. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచన, దర్శకత్వంలో ఎస్. రంజిత్ నిర్మించారు. ఈ మూవీని ఆడియో డిస్క్రిప్టివ్ టెక్నాలజీతో తెరకెక్కించారు. దీనివల్ల కంటి చూపు లేనివాళ్లు కూడా ఈ సినిమాను అనుభూతి చెందగలడం విశేషం. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమా గతేడాది నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న సైలెంట్‌గా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. కథేంటంటే.. సూర్య (రోహిత్ నందా) ఓ అమాయకపు కుర్రాడు. ఉద్యోగం కోసం ఊరి నుంచి పట్నం వస్తాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే క్రమంలో ఓ రోజు ఓ వ్యక్తి దగ్గరున్న కలం చూసి ముచ్చటపడతాడు. కానీ దాని ధర రూ.40 వేలు అని చెప్పడంతో షాకవుతాడు. తర్వాత అలాంటి పెన్ ఒకటి హీరోకు దొరుకుంది. ఆ పెన్‌తో ఎవరు రాస్తే వాళ్లు చనిపోతుంటారు. మరి ఈ కలం వల్ల సూర్య జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఆ పెన్ వెనక అసలు కథేంటి? అన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే! Wishing my brother #Rohit all the best for his 'VIDHI'! 🎬 Now streaming on Prime Video, this all-around entertainer is a must-see! 🍿 #VIDHI #PrimeVideo 👉https://t.co/Dwk2DzpEfB#RohitNanda @anandhiactress @srikanthcinema @NoIdeaEntmt — Vishnu Manchu (@iVishnuManchu) January 26, 2024 చదవండి: చిరంజీవికి అవార్డు.. మంచు మోహన్ బాబు ఏం అన్నారంటే వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుడతానన్న దర్శకుడు.. నటి ఎమోషనల్ -
నాకు కొత్తగా అనిపించింది
‘‘స్పార్క్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ మూవీలో నేను లేఖ పాత్రలో కనిపిస్తాను. ఎంతోప్రాధాన్యత ఉన్న రోల్ నాది. సినిమా నాతోనే ప్రారంభం అవుతుంది.. నాతోనే ముగుస్తుంది.. ఇలాంటి థ్రిల్లర్ మూవీలో నటించటం నాకు కూడా కొత్తగా అనిపించింది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరోయిన్ మెహరీన్ అన్నారు. విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రోడక్షన్సపై లీల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మెహరీన్ పంచుకున్న విశేషాల.. ► కొత్తవాళ్లు, అనుభవం ఉన్న నటీనటులతో పని చేసే క్రమంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. ‘స్పార్క్’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న విక్రాంత్ ఓ రోజు ఫోన్ చేసి, ‘మీతో కలిసి నటించాల నుంది’ అన్నారు. కథ నాకు నచ్చడంతో ఓకే చెప్పాను. విక్రాంత్‌గారు ఈ మూవీ కోసం చేసిన పరిశోధన నన్ను ఆకట్టుకుంది. నా పాత్ర, లుక్ కొత్తగా ఉంటుందని చెప్పారు.. నా లుక్, పాటలు తెరకెక్కించిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది. విక్రాంత్ చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని నాకు అర్థమైంది. లీల గారు ఎక్కడా రాజీపడకుండా ఈ మూవీ తీశారు. ► విక్రాంత్ అమెరికాలో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. అయితే సినిమా చేయాలనే కలని పూర్తి చేసుకోవటానికి ఇక్కడకు వచ్చారు. అమెరికాలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంలో ‘స్పార్క్’ కథను తయారు చేసుకున్నారు విక్రాంత్. ఈ కథకి కమర్షియల్ అంశాలు జోడించి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. తొలిసారి హీరోగా చేస్తూనే డైరెక్షన్ చేయటం ఎంతో కష్టం. కానీ, విక్రాంత్ ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాడు. తను ఓ డెబ్యూ హీరోగా, డెబ్యూ డైరెక్టర్‌గా మెప్పిస్తాడు. ►జీవితంలో ఉన్నతి స్థాయికి ఎదగాలని ప్రతి మనిషి కలలు కంటుంటారు.. నేను కూడా అంతే. నా కలలను నిజం చేసుకునే క్రమంలోనే ముందుకు వెళుతున్నాను. ఈ సినిమాలో నేను చేసిన లేఖ పాత్ర కూడా అలాగే ఉంటుంది.. అందుకే ఈ పాత్రకు నేను కనెక్ట్ అయ్యాను. నటిగా ప్రతి సినిమా నాకెంతో ప్రత్యేకమైనదే. కథ, నా పాత్ర నచ్చితేనే చేస్తాను.. లేకుంటే చేయను. అది నా కెరీర్‌కి ఎంతో సాయపడుతోంది. నన్ను ఇష్టపడేవారు, ప్రేక్షకులే నాలో స్ఫూర్తి నింపుతుంటారు. పాత్ర ఏదైనా నటిగా రెండు వందల శాతం న్యాయం చేయటానికి ప్రయత్నిస్తాను. ∙నేను ఏదైనా వేడుకలకి వెళ్లినప్పుడు, నా సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు ఎవరైనా నేను చేసిన పాత్ర పేరుతో పిలిస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. చాలా మంది ఇప్పటికీ నా తొలి చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లోని మహాలక్ష్మి పాత్ర పేరుతో పిలుస్తుండటం హ్యాపీ. -
మై నేమ్ ఈజ్ శృతి ఆలోచింపజేస్తుంది
‘‘ప్రేక్షకులు థ్రిల్లర్ చిత్రాలను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. స్కిన్ (చర్మం) మాఫియా ముప్పును చూపించే డార్క్ థ్రిల్లర్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ఈ నేపథ్యంలో ఓ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చడమే కాదు.. ఆలోచింపజేస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని హీరోయిన్ హన్సిక మోత్వాని అన్నారు. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో హన్సిక మోత్వాని లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బూరుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హన్సిక మోత్వాని మాట్లాడుతూ.... ► మా అమ్మ డెర్మటాలజిస్ట్(చర్మ వైద్య నిపుణురాలు). ‘మై నేమ్ ఈజ్ శృతి’ సమయంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మను అడిగాను. ‘ఇలాంటి ఘటన ఎక్కడో జరిగినట్లు చదివాను’ అని చెప్పింది అమ్మ. ఈ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది. ఈ సినిమా కోసం శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొన్నారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ.. సినిమా చేయడం సవాలుతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్‌లతో చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ మూవీ థ్రిల్ ఇస్తుంది. ఇలాంటి థ్రిల్లర్ స్పేస్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా అనిపించింది. ►ఈ సినిమాలో నా పాత్ర పేరు శృతి. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్న శృతి స్కిన్ మాఫియా ట్రాప్‌లో పడుతుంది. ఆ మాఫియా నుంచి తను ఎలా బయటపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రతి కుటుంబాన్ని ఈ చిత్ర కథ కదిలిస్తుంది. కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది. రమ్యగారు ఈ సినిమాని ఎంతో ఫ్యాషన్‌తో తీశారు. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. ►2019లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమా తర్వాత నేను నటించిన తెలుగు చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. దాదాపు నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. అయితే తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉండటం వల్లే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒక నటిగా సంతృప్తి చెందలేదు.. ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారితో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నాను. వారి సినిమాలిప్పుడు సరిహద్దులను చెరిపిస్తూ పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్నాయి. వారి కష్టానికి ఆ గుర్తింపు వచ్చిందని నేను భావిస్తాను. ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ ఎప్పటిలాగే వినయంగా ఉండటం వారి గొప్పతనానికి నిదర్శనం. అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు అభినందనలు తెలిపాను. -
వచ్చే ఏడాది భ్రమ యుగం
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన హారర్–థ్రిల్లర్ ఫిల్మ్ ‘భ్రమ యుగం’. రాహుల్ సదాశివన్ రచన–దర్శకత్వంలో చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ‘‘ఈ ఏడాది ఆగస్టులోప్రారంభమైన ఈ సినిమాను ఓట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి వంటి లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
కొత్త ప్రపంచంలోకి వెళ్తారు
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఈ సినిమా నేడు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో అశ్విన్‌బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. నెక్ట్స్ మెడికల్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా, ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయబోతున్నాను’’ అని అన్నారు. -
కపటనాటక సూత్రధారి పోస్టర్: కొత్తగా ఉంది కదూ!
భిన్నమైన కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'కపటనాటక సూత్రధారి'. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ప్రముఖ రచయిత కోన వెంకట్ రిలీజ్ చేశారు. అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ.. "ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో విభిన్నంగా ఉంది.. చూస్తుంటే ఎంతో డిఫరెంట్ సినిమా అని తెలుస్తుంది. పోస్టర్ చూస్తుంటేనే సినిమా చూడాలన్న ఆసక్తి పెరుగుతోంది.. సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అందరికి అల్ ది బెస్ట్" అన్నారు. ఈ సినిమాలో విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు క్రాంతి సైనా దర్శకత్వం వహించారు. ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్‌లు సహనిర్మాతలు వ్యవహరిస్తున్నారు. సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రామ్ తవ్వ సంగీతం సమకూరుస్తున్నారు. రామకృష్ణ మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: ఎన్టీఆర్ ఎఫెక్ట్.. బన్నీ సినిమా ఆగిపోయిందా? బాలీవుడ్ హాట్‌ఫేవరెట్ కియారా -
సినిమానే సిరీస్‌గా.!
హిందీ సినిమా ‘తైష్’ త్వరలో ఓటీటీలో విడుదల అవుతున్నట్టు ప్రకటించారు. అయితే ప్రయోగాత్మకంగా... ఈ సినిమా ఒకే రోజు సినిమాగా, సిరీస్‌గా విడుదలవుతుందట. పులకిత్ సామ్రాట్, జిమ్ షరాబ్, క్రితీ కర్భంధా ముఖ్య పాత్రల్లో దర్శకుడు బీజోయ్ నంబియార్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘తైష్’. అక్టోబర్ 29న జీ5లో ఈ సినిమా విడుదల కానుంది. ‘తైష్’ రెండున్నర గంటల సినిమాలా, 6 ఎపిసోడ్ల మినీ సిరీస్‌లో అందుబాటులో ఉంటుందట. ఈ నిర్ణయం గురించి చిత్రబృందం మాట్లాడుతూ –‘‘గతంలో సినిమాగా రూపొందించిన సిరీస్‌గా ఎడిట్ అయిన సినిమాలు ఉన్నాయి. మా చిత్రాన్ని థియేటర్ కోసం తెరకెక్కించాం. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఓటీటీలో విడుదల చేస్తున్నాం. సినిమా పూర్తయ్యాక టెస్ట్ స్క్రీనింగ్ (అతికొద్ది మందికి సినిమా ప్రదర్శించి ఫలితాన్ని సమీక్షించుకోవడం) నిర్వహించాం. సినిమా బావుంది. ఇందులో పాత్రల గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపించింది అని కొందరు అనడంతో సిరీస్ ఆలోచన వచ్చింది. ఈ సినిమాను అలానే ఉంచి, సిరీస్‌గా ఎలా మలచగలం అని ఆలోచించి దానికి అనుగుణంగా ఎడిటింగ్ చేశాం. ఏది కావాలనుకున్నవాళ్లు అది ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. -
ధమ్కీ ఇవ్వడం పూర్తయింది
రజిత్, త్రిషాలాషా జంటగా ఏనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమ్కీ’. సత్యనారాయణ సుంకర నిర్మాత. క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ – ‘‘ధమ్కీ’ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే చిత్రమిది. బిత్తిరి సత్తి కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అన్నారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. ఖర్చుకి వెనకాడకుండా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించాం. రామ్ లక్ష్మణ్ ఫైట్స్, శ్రీమణి సాహిత్యం, మా సినిమాకు ప్లస్ అవుతాయి అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు కెమెరా: దీపక్ భగవంత్, సంగీతం: ఎసి.బి ఆనంద్. -
టైటిల్ కమింగ్ సూన్
ఈ ఏడాది ఆల్రెడీ రెండుసార్లు థియేటర్స్‌లో కనిపించిన కల్యాణ్ రామ్ మరో సినిమాతో రెడీ అవుతున్నారు. కెమెరామేన్ కేవీ గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ థ్రిల్లర్ మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్స్‌గా యాక్ట్ చేస్తున్నారు. మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. కేవలం సాంగ్స్ షూటింగ్ వరకూ బ్యాలెన్స్ ఉందట. ఈ చిత్రం టైటిల్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో ప్రకటించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర. -
వీరనారిపై వార్ మూవీ
ఆమె ఇండియన్. ఆమె భర్త పాకిస్తానీ. అతడు ఇండియాను దెబ్బదీసే వ్యూహాల విభాగంలో పనిచేస్తుంటాడు. అది తెలిసే ఆమె అతడిని పెళ్లి చేసుకుని ఆ దేశం వెళుతుంది! మే 11న బాలీవుడ్ చిత్రం ‘రాజీ’ విడుదల అవుతోంది. మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేశారు. ఆలియాభట్ హీరోయిన్. 1971 ఇండో–పాక్ యుద్ధకాలం నాటి థ్రిల్లర్ ఇది. ఆ యుద్ధంలో సెహ్మత్ అనే భారతీయ యువతి.. పాకిస్తాన్ రహస్యాలను తెలుసుకోవడం కోసం ఆ దేశంలో గూఢచారిగా పని చేస్తుంది. ధైర్యసాహసాలతో కూడిన ఆ సెహ్మత్ రియల్ లైఫ్ స్టోరీనే ‘రాజీ’. సెహ్మత్గా ఆలియా, సెహ్మత్ భర్తగా విక్కీ కౌశల్ నటిస్తున్నారు. హరీందర్ సిఖా రాసిన ‘కాలింగ్ సెహ్మత్’ పుస్తకం ఈ సినిమాకు ఆధారం. ఒక మహిళా గూఢచారి ఏవిధంగా స్పయింగ్ చేసి, తన దేశాన్ని రక్షించిందో మనం ఈ సినిమాలో చూడొచ్చు. థియేటర్లో కూర్చొని చూడ్డానికి స్పయింగ్ (గూఢచర్యం) మూవీ భలే ఉత్తేజకరంగా ఉంటుంది. జేమ్స్‌బాండ్‌ని చూస్తున్నాం కదా! చలాకీగా, ఒడుపుగా శత్రుదేశం నుంచి ఇన్ఫర్మేషన్ని లాగేసి తెచ్చేస్తుంటాడు. రియల్ లైఫ్‌లో అలా ఉండదు. అడుగడుగునా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. ‘‘అయితే ఇదేమీ ఆలోచించలేదు సెహ్మత్’ అని సిఖా తన పుస్తకంలో రాశారు. సెహ్మత్కు అప్పుడు 20 ఏళ్లు. కశ్మీర్లో పేరున్న ఒక బిజినెస్‌మన్ కూతురు ఆ అమ్మాయి. 1971 ఇండో–పాక్ యుద్ధానికి కాస్త ముందు భారత ప్రభుత్వపు స్పైగా ఆమె రిక్రూట్ అవుతుంది. అనుమానం రాకుండా కూపీలు లాగడంలో, విలువైన సమాచారాన్ని సేకరించడంలో శిక్షణ పొందుతుంది. అంతేనా! ఒక పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని ఆ దేశం వెళుతుంది. ఆమె భర్త ఇండియాను దెబ్బదీసే వ్యూహాల విభాగంలో పనిచేస్తుంటాడు. అది తెలిసే ఆమె అతడిని పెళ్లి చేసుకుంటుంది. అలా గూఢచర్యం చేస్తుండగా, పాక్ మన యుద్ధ నౌక ఐ.ఎన్.ఎస్. విరాట్‌ను పేల్చేయాలని పథకం వేస్తున్న విషయం ఆమె పసిగడుతుంది. వెంటనే ఇండియాను అలర్ట్ చేస్తుంది. ఒక పెద్ద యుద్ధవిపత్తు నుంచి తన దేశాన్ని, ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది. ఇదంతా కూడా సిఖా.. సెహ్మత్ కుటుంబ సభ్యుల భద్రత కోసం ఒక కల్పిత గాథగా రాశారు. అలాగని అందులో కల్పితాలేమీ లేవు. సినిమా కూడా అదే లైన్లో సాగుతుంది. యుద్ధకాలంలో దేశానికి ఏదో ఒకరూపంలో సేవలు అందించి అజ్ఞాతంగా ఉండిపోయి ఎందరో మహిళల్లో సెహ్మత్ ఒకరు. స్పైగా స్ఫూర్తిని ఇచ్చే ఆమె శక్తియుక్తులను మనం ‘రాజీ’ చిత్రంలో చూడొచ్చు. -
ప్రయోగాత్మక చిత్రంలో నందమూరి హీరో
ప్రస్తుతం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఎమ్మెల్యే సినిమాతో పాటు రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న నా నువ్వే సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాలను సమ్మర్ సీజన్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత కళ్యాణ్ రామ్ ఓ ప్రయోగాత్మక చిత్రం చేయనున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్, రొమాంటిక్ స్టోరీలు మాత్రమే చేసిన కళ్యాణ్ రామ్ త్వరలో థ్రిల్లర్ సినిమా చేసేందుకు అంగీకరించాడు. విజయ్ మద్దలను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో సినిమా చేసేందుకు కళ్యాణ్ రామ్ అంగీకరించాడట. దర్శకుడు కథ చెప్పిన విదానంతో పాటు కథలోని మలుపుకు కూడా నచ్చటంతో వెంటనే ఈ నందమూరి హీరో ఒకే చెప్పాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే కొత్త సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు కళ్యాన్ రామ్. జై లవకుశ సినిమాతో నిర్మాతగా ఘనవిజయం సాధించిన ఈ నందమూరి హీరో కథ ఎంపికలో కొత్తదనం చూపిస్తున్నాడు. -
మళ్లీ విభిన్న కథాంశంతో సుమంత్
చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూసిన సుమంత్‌కు 'మళ్లీరావా' మంచి బూస్ట్‌నిచ్చింది. సత్యం, గోదావరి తరువాత మళ్లీ తన కెరీర్లో ఈ సినిమా ప్లస్ అయింది. అయితే మధ్యలో చాలా సినిమాలు చేసినా సమంత్‌కు విజయం దక్కలేదు. నరుడా డోనరుడా (హిందీ సినిమా ‘విక్కీ డోనర్’) తెలుగులో కొత్త కథే అయినా అది ప్రేక్షకులకు చేరుకోలేకపోయింది. చాలాకాలం తర్వాత మంచి కథాంశంతో, తనకు సరిపోయే ప్రేమకథా చిత్రంతోనే మళ్లీ సక్సెస్ అందుకున్నారు. ఈ ఉత్సాహంలో మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సుమంత్ నిద్ర సమస్యతో బాధపడే పత్రిక ఫోటోగ్రాఫర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. తనకు ఉన్న సమస్యతో ఎదురయ్యే సమస్యలేంటి? వాటిని ఎలా పరిష్కరించుకుంటాడనేదే సినిమా కథ అని సమాచారం. అనిల్‌కుమార్ ఈ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అనిల్ ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక మళ్లీరావా బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికీ ఏ-సెంటర్లలో ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. హిందీ టీవీ సీరియల్ నటి ఆకాంక్ష సింగ్ మళ్లీరావాతో హీరోయిన్గా పరిచయం అయింది. -
అరవిందస్వామి, తమన్నా జంటగా..
అరవిందస్వామి, తమన్నా జంటగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కనుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'శతురంగ వేట్టై' అనే థ్రిల్లర్ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటుపడి గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతూ జీవించే ఓ వ్యక్తి కథే 'శతురంగ వేట్టై'. త్రివిక్రమ్ 'అఆ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రమణ్యం ఆ సినిమాలో హీరోగా నటించారు. ఇప్పుడు అరవిందస్వామి, తమన్నాలు ప్రధాన పాత్రల్లో ఆ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారు. ఇటీవల వార్తల్లో నిలిచిన ఓ రియల్ ఇన్సిడెంట్ను తెరపై చూపించనున్నారట. 'తనీ ఒరువన్' హిట్ తర్వాత అరవింద్ స్వామి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అరవిందస్వామికి జోడీగా తమన్నా నటిస్తుందనే వార్త ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఈ సినిమా విషయమై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. -
దెయ్యం ప్రేమలో...!
ఆ యువకుడు మహా పిరికివాడు. తన నీడను చూసి తానే భయపడే రకం! మరి ఈ యువకుణ్ణి ఏకంగా ఓ దెయ్యం ప్రేమిస్తే! పెళ్లి చేసుకోమని వేధిస్తే.. ఎలా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహసం సేయరా డింభకా’. శ్రీ, హమీద, సమత ముఖ్యతారలుగా ఎంఎస్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరుమల శెట్టి కిరణ్ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఆవిష్కరించారు. ‘ముని’, ‘కాంచన’, ‘గంగ’, తరహాలో ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలి’’ అని ఆయన ఆకాంక్షించారు. ‘‘భయంలో నవ్వులు కలుపుతూ ఈ సినిమా తీశారని ట్రైలర్స్ చూస్తుంటే అర్థమవుతోంది’’ అని దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి అన్నారు. దర్శకుడు వి.సముద్ర, సంగీత దర్శకుడు శ్రీ వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ వెండితెర మీదకు జయప్రద
తెలుగు తెరను కొన్ని దశాబ్దాల పాటు ఏలి.. ఇక్కడి నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా రాజ్యమేలి.. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయప్రద.. మళ్లీ ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకుని వెండితెరమీద దర్శనం ఇవ్వబోతున్నారు. సంజయ్ శర్మ దర్శకత్వంలో రాబోతున్న థ్రిల్లర్ మూవీలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం 5 పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ తనలోని టాలెంట్ ఏమాత్రం తగ్గలేందంటున్న జయప్రద.. చిట్టచివరిసారిగా కంగనా రనౌత్‌తో కలిసి 2013లో రజ్జో అనే సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు కొత్త సినిమాలో చేయడానికి తాను చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జయప్రద అంటున్నారు. రాణీ సాహిబా అనే తన పాత్ర చాలా గ్లామరస్‌గా ఉంటూనే అందులో నెగెటివ్ షేడ్ కూడా ఉంటుందని ఆమె చెప్పారు. నేటి ప్రేక్షకులు భిన్నమైన కథలు కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటివరకు తాను ఇలాంటి పాత్ర ఏదీ చేయలేదని, అందుకే ఈ సినిమా చాలా ధైర్యంగా చేయాల్సి వస్తోందని జయ అన్నారు. ఈ సినిమా షూటింగ్ మలేసియా, శ్రీలంక, నేపాల్ దేశాల్లో సాగుతోంది. ఈ హిందీ సినిమాతో పాటు ఓ మళయాళం సినిమాలో కూడా జయప్రద చేస్తోంది. -
37 ఏళ్ల తర్వాత ఇండియాలో షూటింగ్
జగమెరిగిన దర్శకుడు... జగదేక దర్శకుడు... హాలీవుడ్ మాంత్రికుడు స్టీవెన్ స్పీల్బర్గ్. ప్రపంచమంతా ఆయనకు అభిమానులున్నారు. మరో మూడేళ్లు పూర్తయితే స్పీల్బర్గ్ ఏడు పదుల వయసులోకి ఎంటరవుతారు. అయినప్పటికీ ఇరవైఏళ్ల క్రితం ‘జురాసిక్ పార్క్’ తీసినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నారో, ఇప్పుడూ అంతే ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఓ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, క్యాచ్ మీ ఇఫ్ యు కెన్, ది టెర్మినల్.. ఇలా స్పీల్బర్గ్ రూపొందించిన పలు చిత్రాల్లో కథానాయకునిగా నటించిన టామ్ హాంక్స్ ఈ తాజా చిత్రంలోనూ నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను భారతదేశంలో చిత్రీకరించాలనుకుంటున్నారట స్పీల్బర్గ్. 1977లో ‘క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’ అనే చిత్రం కోసం భారతదేశంలో స్పీల్బర్గ్ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇక్కడ షూటింగ్ చేయాలనుకోవడం విశేషం. గత ఏడాది ముంబయ్ వచ్చినప్పుడు ‘మళ్లీ ఇండియాలో షూటింగ్ చేయాలనుకుంటున్నాను’ అని స్పీల్బర్గ్ పేర్కొన్నారు.