టైటిల్‌ కమింగ్‌ సూన్‌ | kalyan ram nivetha thomas shalini pandey new movie | Sakshi
Sakshi News home page

టైటిల్‌ కమింగ్‌ సూన్‌

Published Sun, Aug 19 2018 4:40 AM | Last Updated on Sun, Aug 19 2018 4:40 AM

kalyan ram nivetha thomas shalini pandey new movie - Sakshi

ఈ ఏడాది ఆల్రెడీ రెండుసార్లు థియేటర్స్‌లో కనిపించిన కల్యాణ్‌ రామ్‌ మరో సినిమాతో రెడీ అవుతున్నారు. కెమెరామేన్‌ కేవీ గుహన్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ ఓ థ్రిల్లర్‌ మూవీలో హీరోగా యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్స్‌గా యాక్ట్‌ చేస్తున్నారు. మహేశ్‌ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్ట్‌ కంప్లీట్‌ అయిందని సమాచారం. కేవలం సాంగ్స్‌ షూటింగ్‌ వరకూ బ్యాలెన్స్‌ ఉందట. ఈ  చిత్రం టైటిల్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో ప్రకటించాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు సంగీతం: శేఖర్‌ చంద్ర.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement