సొంత సినిమా సక్సెస్‌ అయినట్టుగా అనిపిస్తోంది | Dil Raju 118 Movie Latest Press Meet | Sakshi
Sakshi News home page

సొంత సినిమా సక్సెస్‌ అయినట్టుగా అనిపిస్తోంది

Mar 4 2019 3:39 AM | Updated on Mar 4 2019 4:34 AM

Dil Raju 118 Movie Latest Press Meet - Sakshi

మహేశ్‌ కోనేరు, ‘దిల్‌’ రాజు, కల్యాణ్‌ రామ్, కేవీ గుహన్‌

‘‘పటాస్‌’ తర్వాత కల్యాణ్‌రామ్, మా కాంబినేషన్‌లో హిట్‌ కొట్టాం. ‘118’ రెగ్యులర్‌ మూవీ కాదు. కొత్త ప్రయత్నం. రివ్యూస్, ఆడియన్స్‌ రెస్పాన్స్‌ రెండూ పాజిటివ్‌గానే ఉన్నాయి’’ అని ‘దిల్‌’ రాజు అన్నారు. కల్యాణ్‌ రామ్‌ హీరోగా కేవీ గుహన్‌ దర్శకత్వంలో తెరకె క్కిన చిత్రం ‘118’. నివేదా «థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్‌ కోనేరు నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోందని ప్రముఖ నిర్మాత, ఈ చిత్ర పంపిణీదారులు ‘దిల్‌’ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘118’ సినిమాను ఏపీ, తెలంగాణలలో రిలీజ్‌ చేశాం.

రెండు రోజులకు మూడు కోట్ల షేర్‌ వచ్చింది. గుహన్‌గారితో 20 ఏళ్ల అనుబంధం ఉంది. మా సొంత సినిమా సక్సెస్‌ అయినట్టుగా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘కొత్త సినిమాలు తీయడానికి ప్రేక్షకుల స్పందన ప్రేరణ ఇస్తుంది. నాకు ‘దిల్‌’రాజుగారు గాడ్‌ బ్రదర్‌లాగా. ఆయన చేతి నుంచి సినిమా రిలీజ్‌ అవ్వడం సంతోషం’’ అన్నారు గుహన్‌. ‘‘‘పటాస్‌’ రిలీజ్‌ అయి నాలుగేళ్లయింది. అప్పుడూ ‘దిల్‌’ రాజుగారే సినిమాను పంపిణీ చేశారు. ఆ రోజు మమ్మల్ని నమ్మారు. మళ్లీ ఇప్పుడు. నా ప్రతి సినిమాను రాజుగారికి చూపిస్తా (నవ్వుతూ)’’ అన్నారు కల్యాణ్‌ రామ్‌. ‘‘ఫీడ్‌బ్యాక్‌ వింటుంటే చాలా çహ్యాపీగా ఉంది. ఫస్ట్‌ మాకు ధైర్యాన్ని ఇచ్చింది తారక్‌గారు. ఆ తర్వాత రాజుగారు’’ అన్నారు మహేశ్‌ కోనేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement