118 Movie
-
‘తుగ్లక్’గా నందమూరి హీరో
ఇటీవల 118 సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు మల్లిడి వేణు డైరెక్షన్లో సోషియే ఫాంటసీ సినిమాలో నటించేందుకు కల్యాణ్ రామ్ ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఫాంటసీ సినిమా కావటంతో బడ్జెట్ కూడా కాస్త ఎక్కువే అవుతుందని తెలుస్తోంది. అందుకే రిస్క్ లేకుండా ఈ సినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట కల్యాణ్ రామ్. మల్లిడి వేణు సినిమాను ముందుగా అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడట. కానీ ఫైనల్ కల్యాణ్ రామ్ ఓకె చెప్పటంతో ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
118 మూవీ సక్సెస్ మీట్
-
ఈ సక్సెస్ మా నాన్నగారికి అంకితం
‘‘షూటింగ్‌కు అందరికంటే ముందు వచ్చే ప్రొడక్షన్ యూనిట్, ఆలస్యంగా వెళ్లే లైట్మేన్లు, మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లే డ్రైవర్స్. ఇలా చాలా డిపార్ట్మెంట్స్ కష్టం ఈ సినిమాలో ఉంది. సినిమా బావుంటుందని అందరం నమ్మి పని చేశాం’’ అని కల్యాణ్‌రామ్ అన్నారు. కెమెరామేన్ కేవీ గుహన్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘118’. కల్యాణ్‌రామ్ హీరోయిన్గా, షాలినీ పాండే, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. మహేశ్ యస్ కోనేరు నిర్మాత. మార్చి 1న రిలీజ్ అయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసి, సినిమాలో పని చేసిన అందరికీ షీల్డ్‌లను బహూకరించారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ – ‘‘సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసి నన్ను రుణపడిపోయేలా చేశారు. నివేదా ఈ సినిమాకు సెకండ్ హీరో. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. గుహన్‌గారి నెక్ట్స్ సినిమా కూడా నాతోనే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ కాంప్లిమెంట్ తారక్ ఇచ్చాడు. తనకు థ్యాంక్స్. జయాపజయాలు పెక్కన పెట్టి ప్రతి సినిమాకు ‘ఆల్ ది బెస్ట్ నాన్న’ అని నాన్నగారు (హరికృష్ణ) చెబుతుండేవారు. ఈ విజయాన్ని ఆయనకు అంకితమిస్తున్నాను’’ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా 23 ఏళ్లు పూర్తి చేశాను. అందులో కొన్ని బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయి. వాటిలో ఈ సినిమా కూడా ఉంటుంది. మంచి సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది’’ అన్నారు. ‘‘కల్యాణ్‌రామ్‌గారితో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్ కావాలనుకుంటున్న కలను ఆయన నిజం చేశారు. 118 నిర్మాత మహేశ్ బాగా ప్రమోట్ చేశారు. సక్సెస్‌తో పాటు గౌరవం కూడా తెచ్చిపెట్టింది’’ అన్నారు. ‘‘మంచి ప్రయత్నం అని అందరూ అభినందిస్తున్నారు. పని చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు షాలినీ పాండే. ‘‘కథ వినగానే సినిమాలో భాగం అవ్వాలనుకున్నాను. కాన్సెప్ట్ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు షాలినీ పాండే. -
రెండింతలు వచ్చింది
‘‘ఇండస్ట్రీలోకి పాత్రికేయుడిగా వచ్చాను. సినిమాలకు రివ్యూస్ రాశాను. రివ్యూవర్స్ అభిప్రాయాలను గౌరవిస్తాను. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఒక నిర్మాతగా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధగానే ఉంటుంది. ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు.. అనే సామెతలా... సినిమా చేసి చూడు అని అనుకోవచ్చు’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. కల్యాణ్‌రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘118’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని ఆనందం వ్యక్తం చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా మహేశ్ కోనేరు చెప్పిన విశేషాలు. ∙కల్యాణ్ రామ్‌గారి ‘నా నువ్వే’ సినిమా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యాను. కానీ పూర్తిస్థాయి సోలో నిర్మాతగా ‘118’ నాకు తొలి సినిమా. ‘నా నువ్వే’ చిత్రాన్ని నమ్మి బాగా చేశాం. ఆశించిన ఫలితం రాలేదు. సినిమా వైఫల్యం చెందినప్పుడు బాధ కలిగింది. ఆ బాధ నుంచి తేరుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. ∙‘నా నువ్వే’కు సరైన స్పందన రాకపోవడంతో ‘118’ చిత్రానికి కసిగా పని చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రిలీజ్ డే మార్నింగ్ కాస్త డివైడ్ టాక్ వినిపించినప్పటికీ మ్యాట్నీ నుంచి మంచి స్పందన వచ్చింది. మంచి బుకింగ్స్ లభించాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ స్క్రీన్‌లో బుకింగ్స్ బాగా జరిగాయి. ∙కథ విని ఈ సినిమాను ఎన్టీఆర్ఆర్ట్స్ బ్యానర్లో చేద్దామని కల్యాణ్‌రామ్‌గారు అనుకున్నారు. కథ నచ్చి నేను నిర్మించాను. యూనిక్ పాయింట్. ఈ సినిమాతో కల్యాణ్‌రామ్‌గారికి నటన పరంగా మంచి పేరు వచ్చింది. గుహన్‌గారు సినిమాను మంచి థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. కథ విన్నప్పుడే ఇందులోని ఆద్య పాత్రకు నివేథా ధామస్నే ఊహించుకున్నాం. స్క్రిప్ట్ విన్న తర్వాత ఆమె వెంటనే అంగీకరించారు. షాలినీ పాండే బాగా నటించారు. ఈ సినిమాకు ఒక రూపాయి ఖర్చు పెడితే రెండు రూపాయలు వచ్చాయి. ∙ఈ సినిమాను ఎడిటింగ్ రూమ్‌లో ఎన్టీఆర్‌గారు చూసి, బాగుందని మెచ్చుకున్నారు. మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ తర్వాత ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరిష్‌లు చూశారు. ‘దిల్’ రాజుగారికి నచ్చడంతో సినిమాపై మాకున్న నమ్మకం రెట్టింపు అయింది. ∙ప్రస్తుతం కీర్తీ సురేశ్ కథానాయికగా ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ నిర్మిస్తున్నాం. ఈ ఏడాది సెకండాఫ్‌లో రిలీజ్ ప్లాన్ చేశాం. దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి సినిమాలను నిర్మించే ఆలోచన ఉంది. కొత్తవారిని ప్రోత్సహించడమే మా ఉద్దేశం. హరీష్ శంకర్ దర్శకత్వంలో మా బ్యానర్లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ఈ ఏడాది చివర్లో ఓ పెద్దహీరోతో సినిమా చేయబోతున్నాం. ఎన్టీఆర్‌గారితో సినిమాలు చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తాను. -
‘118’పై మహేష్ ప్రశంసలు
పటాస్‌తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్.. అటుపై మళ్లీ సక్సెస్ లేక రేసులో వెనుకబడిపోయాడు. ఈ నందమూరి హీరో కొత్తగా ట్రై చేసి నా నువ్వేతో పలకరించినా.. ప్రేక్షకులు ఆదరించలేదు. అయినా సరే పట్టువదల కుండా మరో కొత్త జానర్‌ను టచ్‌చేస్తూ.. 118తో ఆడియన్స్‌ను పలకరించాడు. బరిలో మిగతా చిత్రాలేవీ లేకపోవడం.. గత ఫిబ్రవరిలో యాత్ర మినహా ఏ సినిమా కూడా నిలబడలేకపోవడం 118కు కలిసొచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఒక్కటే థియేటర్లలో ఉంది. ఇదే ఈ మూవీకి అదృష్టంగా మారింది. డీసెంట్ కలెక్షన్లతో ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడుతోంది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా.. మరే మూవీ లేకపోవడంతో ప్రేక్షకులు దీనికే ఓటేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మరిన్ని వసూళ్లు తెప్పించాలని చిత్రయూనిట్ కూడా భావిస్తోంది. ప్రమోషన్లతో ఈ మూవీ కలెక్షన్లు పెంచాలని చూస్తోందట. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఆసక్తికరమైన కథా కథనాలతో ఉన్న 118ను చూస్తూ ఎంజాయ్ చేశాను. సినిమాటోగ్రఫర్‌గా, దర్శకుడిగా గుహన్ పనితనం అధ్భుతం. చిత్రబృందానికి కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ 118
-
సొంత సినిమా సక్సెస్ అయినట్టుగా అనిపిస్తోంది
‘‘పటాస్’ తర్వాత కల్యాణ్‌రామ్, మా కాంబినేషన్లో హిట్ కొట్టాం. ‘118’ రెగ్యులర్ మూవీ కాదు. కొత్త ప్రయత్నం. రివ్యూస్, ఆడియన్స్ రెస్పాన్స్ రెండూ పాజిటివ్‌గానే ఉన్నాయి’’ అని ‘దిల్’ రాజు అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకె క్కిన చిత్రం ‘118’. నివేదా «థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోందని ప్రముఖ నిర్మాత, ఈ చిత్ర పంపిణీదారులు ‘దిల్’ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘118’ సినిమాను ఏపీ, తెలంగాణలలో రిలీజ్ చేశాం. రెండు రోజులకు మూడు కోట్ల షేర్ వచ్చింది. గుహన్‌గారితో 20 ఏళ్ల అనుబంధం ఉంది. మా సొంత సినిమా సక్సెస్ అయినట్టుగా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘కొత్త సినిమాలు తీయడానికి ప్రేక్షకుల స్పందన ప్రేరణ ఇస్తుంది. నాకు ‘దిల్’రాజుగారు గాడ్ బ్రదర్‌లాగా. ఆయన చేతి నుంచి సినిమా రిలీజ్ అవ్వడం సంతోషం’’ అన్నారు గుహన్. ‘‘‘పటాస్’ రిలీజ్ అయి నాలుగేళ్లయింది. అప్పుడూ ‘దిల్’ రాజుగారే సినిమాను పంపిణీ చేశారు. ఆ రోజు మమ్మల్ని నమ్మారు. మళ్లీ ఇప్పుడు. నా ప్రతి సినిమాను రాజుగారికి చూపిస్తా (నవ్వుతూ)’’ అన్నారు కల్యాణ్ రామ్. ‘‘ఫీడ్‌బ్యాక్ వింటుంటే చాలా çహ్యాపీగా ఉంది. ఫస్ట్ మాకు ధైర్యాన్ని ఇచ్చింది తారక్‌గారు. ఆ తర్వాత రాజుగారు’’ అన్నారు మహేశ్ కోనేరు. -
మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో కల్యాణ్ రామ్
హిట్టు, ఫ్లాపుల సంగతి పక్కన పెడితే కథ ఎంపికలో కల్యాణ్ రామ్ ఎప్పుడూ కొత్త దనం చూపిస్తూనే ఉన్నాడు. ఈ శుక్రవారం విడుదలైన 118 సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. తాజాగా కల్యాణ్ రామ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కల్యాణ్ రామ్ ఓకె చెప్పాడు. ఉయ్యాల జంపాల తరువాత మజ్నుతో మరో డీసెంట్ హిట్ అందుకున్న విరించి వర్మ.. కల్యాణ్ రామ్ కోసం పల్లెటూరి నేపథ్యంలో కథను రెడీ చేశాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మేలో సినిమా షూటింగ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. (చదవండి : ‘118’ మూవీ రివ్యూ) -
‘118’ మూవీ ప్రెస్‌మీట్
-
తారక్... నీ నమ్మకం నిజమైంది
కల్యాణ్‌రామ్, నివేథా థామస్, శాలిని పాండే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘118’. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించారు. ప్రముఖ కెమెరామెన్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. శుక్రవారం చిత్రం విడుదలైంది. ఫస్ట్ షోకే మంచి టాక్ తెచ్చుకుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులందరికి థ్యాంక్స్. గుహన్‌గారు నాలో ఏం చూశారో నాకు ఇప్పటికీ తెలియదు. ఈ రోజు మా నిర్మాత మహేశ్ నవ్వు చూస్తున్నాను. ‘నా నువ్వే’ సినిమా రిలీజైనప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో నాకింకా గుర్తే. అప్పుడు నేను ‘మనం కొత్తగా చేయాలని ట్రై చేస్తాం, కొన్ని వర్కవుట్ అవ్వవు. నో ప్రాబ్లమ్, మన ‘118’ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని తనతో చెప్పాను. అదే నిజం అయ్యింది. మన నిర్మాత నవ్వుతూ ఉండటం కంటే ఓ హీరోకి ఏం కావాలి. మా ఎడిటర్ తమ్మిరాజు ఈ సినిమాను న మ్మి మా కంటే ఎక్కువ వర్క్ చేసారు. శేఖర్ చంద్ర ఉన్నది ఒకటే పాట కదా అని అనుకోకుండా ఈ సినిమాకు అద్భుతమైన రీరికార్డింగ్‌ను అందించారు. యన్టీఆర్ని ఉద్దేశించి... నాన్నా.. తారక్ నీ నమ్మకం నిజమైంది. ఫస్ట్ నువ్వే ఈ సినిమాని చూశావు. ఖచ్చితంగా హిట్ అవుతుంది’ అని చెప్పావు. మా కథ మీద నమ్మకంతో సినిమా కొన్న ‘దిల్’ రాజు, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్’’ అన్నారు. మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘గుహన్‌గారు తాను నమ్మినది తీశారు. ఈ రోజు సినిమాకు ఇంత మంచి పేరు రావటానికి కారణం అదే. కలెక్షన్లు బావున్నాయి’’ అన్నారు. గుహన్ మాట్లాడుతూ– ‘‘నేను కెమెరా ముందుకు రావటానికి ఇష్టపడను. ఈరోజు గర్వంగా కెమెరా ముందు మాట్లాడుతున్నాను. నేను తమిళ్ అయినా తెలుగు పరిశ్రమ నన్ను కన్నబిడ్డలా ఆదరించింది. కల్యాణ్‌రామ్ ఈ కథ విని ఎలా ఓకే చేశారు? అని నాకు ఓ కాల్ వచ్చింది. దానికి ఓ కొత్త విషయం చెప్పటానికి చాలా టాలెంట్ కావాలి. అది కల్యాణ్ గారిలో ఉంది అన్నాను’’ అని చెప్పారు. ‘‘క్రిటిక్స్ చాలామంది రాశారు ఇలాంటి స్క్రిప్ట్‌తో సినిమా తీయాలంటే చాలా గట్స్ కావాలని’’ అన్నారు నివేదా. సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర, మాటల రచయిత ‘మిర్చి’ కిరణ్, ఎడిటర్ తమ్మిరాజు, విలన్ పాత్రధారి హబీబ్ తదితరులు పాల్గొన్నారు. -
‘118’ మూవీ రివ్యూ
టైటిల్ : 118 జానర్ : థ్రిల్లర్ తారాగణం : కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలినీ పాండే, ప్రభాస్ శ్రీను సంగీతం : శేఖర్ చంద్ర దర్శకత్వం : కేవీ గుహన్ నిర్మాత : మహేష్ ఎస్ కోనేరు కెరీర్‌ను మలుపు తిప్పే బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్, హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 118. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా కూడా మెప్పింస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఆ అంచనాలను 118 అందుకుందా.? ఈ సినిమాతో కల్యాణ్ రామ్ మరో సక్సెస్ సాధించాడా? కథ : గౌతమ్ (కల్యాణ్ రామ్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఏ విషయాన్ని అయినా మొదలుపెడితే మధ్యలో వదిలేసే అలవాటులేని గౌతమ్‌ను ఓ కల బాగా డిస్ట్రబ్ చేస్తుంది. కలలో ఓ అమ్మాయిని ఎవరో తీవ్రంగా కొట్టడం, ఓ కారును పెద్ద కొండ మీదనుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించటంతో గౌతమ్ ఆ కల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. తనకు కలలో కనిపించిన అమ్మాయి నిజంగా ఉందా? అని వెతికే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో గౌతమ్‌కు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు గౌతమ్ కలలో వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు కొట్టారు? ఈ మిస్టరీని గౌతమ్ ఎలా సాల్వ్ చేశాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : జర్నలిస్ట్ పాత్రలో కల్యాణ్ రామ్ మరోసారి ఆకట్టుకున్నాడు. గతంలో ఇజం సినిమాలో రిపోర్టర్ గా కనిపించిన కల్యాణ్ రామ్ ఈ సారి స్టైలిష్ పాత్రలో మరింతగా మెప్పించాడు. పర్ఫామెన్స్, యాక్షన్ సీన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. థ్రిల్లర్ సినిమా కావటంతో రొమాన్స్, డ్యాన్స్‌లకు పెద్దగా స్కోప్ లేదు. నివేదా థామస్ నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా తన మార్క్ చూపించింది. హీరోయిన్ షాలిని పాండే పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో మంచి నటనతో మెప్పించింది. ఇతర పాత్రల్లో హరితేజ, ప్రభాస్ శ్రీను, నాజర్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సినిమాటోగ్రాఫర్‌గా టాలీవుడ్‌కు సుపరిచితుడైన కేవీ గుహన్, 118 సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 ఓ తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన గుహన్ లాంగ్ గ్యాప్ తరువాత తెలుగు సినిమాతో మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. రొటీన్ ఫార్ములా సినిమాకు భిన్నంగా ఓ సైన్స్‌ఫిక్షన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంట్రస్టింగ్ పాయింట్ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. అనవసరమైన సన్నివేశాలను ఇరికించకుండా సినిమా అంతా ఓకె మూడ్‌లో సాగటం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ రేసీ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్ సీన్స్‌తో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ప్రీ క్లైమాక్స్‌కు వచ్చే సరికి పూర్తిగా లాజిక్‌ను పక్కన పెట్టి తెరకెక్కించిన సన్నివేశాలు అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. సినిమాటోగ్రఫి పరంగా మాత్రం గుహన్ ఫుల్ మార్క్స్ సాధించాడు. స్టైలిష్ టేకింగ్‌తో మెప్పించాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. ప్రతీ సీన్‌ను తన మ్యూజిక్‌తో మరింత ఎలివేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కల్యాణ్ రామ్, నివేదా థామస్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : లాజిక్ లేని సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్.