‘118’పై మహేష్‌ ప్రశంసలు | Mahesh Babu praised 118 Movie | Sakshi
Sakshi News home page

‘118’పై మహేష్‌ ప్రశంసలు

Published Thu, Mar 7 2019 6:50 PM | Last Updated on Thu, Mar 7 2019 6:50 PM

Mahesh Babu praised 118 Movie - Sakshi

పటాస్‌తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన నందమూరి కళ్యాణ్‌ రామ్‌.. అటుపై మళ్లీ సక్సెస్‌ లేక రేసులో వెనుకబడిపోయాడు. ఈ నందమూరి హీరో కొత్తగా ట్రై చేసి నా నువ్వేతో పలకరించినా.. ప్రేక్షకులు ఆదరించలేదు. అయినా సరే పట్టువదల కుండా మరో కొత్త జానర్‌ను టచ్‌చేస్తూ.. 118తో ఆడియన్స్‌ను పలకరించాడు.

బరిలో మిగతా చిత్రాలేవీ లేకపోవడం.. గత ఫిబ్రవరిలో యాత్ర మినహా ఏ సినిమా కూడా నిలబడలేకపోవడం 118కు కలిసొచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఒక్కటే థియేటర్లలో ఉంది. ఇదే ఈ మూవీకి అదృష్టంగా మారింది. డీసెంట్‌ కలెక్షన్లతో ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడుతోంది. ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. మరే మూవీ లేకపోవడంతో ప్రేక్షకులు దీనికే ఓటేస్తున్నారు. 

ఇక ఈ చిత్రానికి మరిన్ని వసూళ్లు తెప్పించాలని చిత్రయూనిట్‌ కూడా భావిస్తోంది. ప్రమోషన్లతో ఈ మూవీ కలెక్షన్లు పెంచాలని చూస్తోందట. తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఆసక్తికరమైన కథా కథనాలతో ఉన్న 118ను చూస్తూ ఎంజాయ్‌ చేశాను. సినిమాటోగ్రఫర్‌గా, దర్శకుడిగా గుహన్‌ పనితనం అధ్భుతం. చిత్రబృందానికి కంగ్రాట్స్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement