మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో కల్యాణ్ రామ్‌ | Kalyan Ram Team Up with Virinchi Varma | Sakshi
Sakshi News home page

మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో కల్యాణ్ రామ్‌

Mar 2 2019 12:26 PM | Updated on Mar 2 2019 12:39 PM

Kalyan Ram Team Up with Virinchi Varma - Sakshi

హిట్టు, ఫ్లాపుల సంగతి పక్కన పెడితే కథ ఎంపికలో కల్యాణ్ రామ్‌ ఎప్పుడూ కొత్త దనం చూపిస్తూనే ఉన్నాడు. ఈ శుక్రవారం విడుదలైన 118 సినిమాతో అది మరోసారి ప్రూవ్‌ అయ్యింది. తాజాగా కల్యాణ్ రామ్‌ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కల్యాణ్ రామ్‌ ఓకె చెప్పాడు.

ఉయ్యాల జంపాల తరువాత మజ్నుతో మరో డీసెంట్‌ హిట్ అందుకున్న విరించి వర్మ.. కల్యాణ్‌ రామ్‌ కోసం పల్లెటూరి నేపథ్యంలో కథను రెడీ చేశాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మేలో సినిమా షూటింగ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌.
(చదవండి : ‘118’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement