Virinchi Varma
-
‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్: జితేందర్ రెడ్డినటీనటులు:రాకేశ్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలునిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డిదర్శకుడు: విరించి వర్మసంగీతం: గోపి సుందర్ఎడిటర్: రామకృష్ణ అర్రంవిడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే.. తెలంగాణలోని జగిత్యాలకు చెందిన దివంగత ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్ ఇది. 1980లో జగిత్యాల పట్టణంలో నక్సలైట్లకు, ఆరెస్సెస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో జితేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్న సమయంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అయితే జితెందర్(రాకేశ్ వర్రె) బాల్యం ఎలా గడిచింది? నక్సల్స్‌ని ఎందుకు ఎదురించాడు? కాలేజీ రోజుల్లో ఏబీవీపీ నాయకుడిగా రాకేశ్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? ఆయనపై ఆరెస్సెస్ నేత గోపన్న(సుబ్బరాజు) ప్రభావం ఎంతవరకు ఉంది? అతన్ని చంపడానికి నక్సల్స్ వేసిన ప్లాన్ ఏంటి? జితేందర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగిత్యాలలో ఎలాంటి మార్పులు జరిగాయి? కాలేజీ స్నేహితురాలు, లాయర్ శారద(రియా సుమన్) అతనికి ఎలా తోడుగా నిలిచింది? చివరకు నక్సల్స్ చేతుల్లో ఎలా మరణించాడు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే.. జితేందర్ రెడ్డి గురించి జగిత్యాలతో పాటు కరీంనగర్ చుట్టుపక్క ప్రాంతాల వారికి బాగా తెలుసు. నక్సల్‌పై ఆయన చేసిన పోరాటం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే కరీంనగర్ జిల్లా మినహా ఆయన గురించి, ఆయన కుటుంబ నేపథ్యం గురించి పూర్తిగా తెలిసినవారు అంతగా లేరు. జితేందర్ రెడ్డి ఏబీవీపీ నాయకుడని, నక్సల్స్‌కు వ్యతిరేకంగా పోరాడి వారి చేతుల్లోనే మరణించారనే విషయం మాత్రమే తెలుసు. ఈ చిత్రంలో జితేందర్ రెడ్డి గురించి బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు చెప్పారు. అయితే వీటిల్లో నిజం ఎంత అనేది పక్కకు పెడితే..సినిమా పరంగా చూస్తే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ని తెరపై చక్కగా, అందరికి అర్థమయ్యేలా చూపించాడు. జితేందర్ రెడ్డి బాల్యం మొదలు కొని చనిపోయే వరకు ఆయన జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘటలన్నింటిని రెండున్నర గంటల సినిమాలో చూపించేశాడు. జితేందర్‌కి చిన్నప్పటి నుంచే దేశ భక్తి ఎక్కువని రిజిస్టర్ చేయడానికి ప్రారంభంలోనే పలు సీన్లను యాడ్ చేశాడు. సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగానే వాడుకున్నాడు. యువకుడి ఎన్కౌంటర్ సీన్ తర్వాత కథపై ఆసక్తి పెంచుతుంది.ఫస్టాఫ్‌లో జితేందర్ రెడ్డి బాల్యంతో పాటు ఆయన స్టూడెంట్ లీడర్‌గా ఎదిగిన తీరును చూపిస్తూనే నక్సల్స్‌కి ఎలా టార్గెట్ అయ్యారనేది చూపించారు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్లలో నాటకీయత ఎక్కువైనట్లు కనిపిస్తుంది. కొన్ని చోట్ల సాగదీతగానూ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. చాలా చోట్ల గూస్బంప్స్ సీన్లు ఉంటాయి. అప్పటి ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి నక్సల్స్‌పై చేసే ఫిర్యాదు సీన్, ఎన్నికల ప్రచారం, క్లైమాక్స్ సన్నీవేశాలు అదిరిపోతాయి. అయితే ఈ కథ మాత్రం ఓ వర్గం వారికి ఎంత బాగా నచ్చుతుందో అంతే స్థాయిలో మరో వర్గం నుంచి వ్యతిరేకత రావొచ్చేమో. సినిమాలో కీలకమైన పాత్రల్లో కూడా అంతగా గుర్తింపులేని నటీనటులను పెట్టుకోవడం కూడా కొంతవరకు మైనస్ అయిందనే చెప్పాలి.ఎవరెలా చేశారంటే..జితేందర్ రెడ్డి పాత్రకు రాకేశ్ వర్రే న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. తెరపై నిజంగానే జితెందర్ రెడ్డిని చూసినట్లుగా అనిపిస్తుంది. ఆర్సెసెస్ నాయకుడు గోపన్నగా సుబ్బరాజు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నక్సలైట్‌గా ఛత్రపతి శేఖర్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. లాయర్‌గా రియా సుమన్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జితేందర్ రెడ్డి పర్సనల్ పీఏ పాత్రలో రవిప్రకాశ్ బాగా మెప్పించాడు. రవి ప్రకాశ్ తండ్రి పాత్రను పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. క్లైమాక్స్ సాంగ్స్ హృదయాలను హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కొన్ని విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - Rating: 2.75/5 -
Jithender Reddy Trailer: జగిత్యాల టైగర్ అంటారు.. పేరు జితేందర్ రెడ్డి!
‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్ను’ చిత్రాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. అంతే కాకుండా, ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడటం ట్రైలర్ లో చూపించారు. వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
‘జితేందర్ రెడ్డి’ సినిమా నుంచి 'అ ఆ ఇ ఈ ఉ ఊ' సాంగ్ విడుదల
‘బాహుబలి’ ఫేమ్ రాకేష్ వర్రే టైటిల్ రోల్లో రూపొందిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. హిస్టరీ నీడ్స్ టు బీ టోల్డ్ అనేది ఉపశీర్షిక (చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది), ‘ఉయ్యాలా జంపాలా, మజ్ను’ వంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఇప్పుడు ఈ సినిమాలో 'అ ఆ ఇ ఈ ఉ ఊ' అంటూ సాగే యూత్ ఫుల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ఆర్ట్స్, సైన్స్, ఇంగ్లీష్ కంటే ముందు ఎన్నో విషయాలు జరిగాయి అవి తెలుసుకోవాలి. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, న్యూటన్ ఏ కాదు మనదేశంలో కూడా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటూ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో యూత్ ఫుల్‌గా ఈ సాంగ్‌ని తెరకెక్కించారు. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు మరియు రాహుల్ సిప్లిగంజ్ పాటని చాలా బాగా పాడారు. కాలేజీలో జరిగే ఎలక్షన్స్ గ్యాంగ్స్ మధ్య ఉండే రైవలరీస్ ఈ లిరికల్ సాంగ్ లో చూపించారు. 1980' లో జితేందర్ రెడ్డి అనే వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవాలి అని ఈ సినిమాని తెరకెక్కించారు. కాలేజ్ స్టూడెంట్ లీడర్‌గా అదేవిధంగా ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే నాయకుడిగా జితేందర్ రెడ్డి చేసిన సేవలను ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ముదిగంటి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే సినిమా పైన అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటా ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ ద్వారా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు. ఈ చిత్రం మే 3న రిలీజ్ కానుంది. -
Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ వచ్చేస్తున్నాడు
‘బాహుబలి’ ఫేమ్ రాకేష్ వర్రే టైటిల్ రోల్లో రూపొందిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. హిస్టరీ నీడ్స్ టు బీ టోల్డ్ అనేది ఉపశీర్షిక (చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది), ‘ఉయ్యాలా జంపాలా, మజ్ను’ వంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మే 3న రిలీజ్ కానుంది. ‘‘జగిత్యాలలో 1980లలో జరిగిన కథే ఈ సినిమా. ఆ రోజుల్లో విలువలతో కూడిన పాత్ర, దాని చుట్టూ తిరిగే కథని ఈ తరం ప్రేక్షకులకు అందించాలని చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు విరించి వర్మ. ‘‘జరిగిన కథను చూపించాం తప్ప ఎవర్నీ కించపరిచే విధంగా తీయలేదు’’ అన్నారు రవీందర్ రెడ్డి. -
ఇంట్రస్టింగ్‌గా జితేందర్ రెడ్డి వీడియో.. ఆయనెవరో తెలిసేది ఆరోజే!
'ధీరుడు ఒకసారే మరణిస్తాడు.. కానీ, పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు' అన్న డైలాగుతో రిలీజైన 'జితేందర్ రెడ్డి' షార్ట్ వీడియో ఆసక్తిని పెంచుతోంది. అసలు ఎవరు ఈ 'జితేందర్ రెడ్డి'? ఆయన గురించి తెలుసుకోవడానికి ఏముంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి ప్రేమ కథలను దర్శకత్వం వహించిన విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'జితేందర్ రెడ్డి'. ఇటీవలే రిలీజైన పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచగా సెప్టెంబర్ 18న విడుదలైన 'జితేందర్ రెడ్డి' వీడియో సినిమాపై అంచనాలను పెంచేసేంది. 'జితేందర్ రెడ్డి' అనే నేను అంటూ ఆయన చేసిన హామీ, అలాగే ఆ వీడియోలో చూపించిన 'ధీరుడు ఒకసారే మరణిస్తాడు కాని పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు' అన్న మాట ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. కాగా ఈ సినిమాలో 'జితేందర్ రెడ్డి'గా చేసింది ఎవరు? అని తెలుసుకోవాలంటే ఈ నెల 21 వరకు ఆగాల్సిందే! ఎందుకంటే ఆరోజే చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేయనుంది. ఈ చిత్రానికి వి.ఎస్ జ్ఞాన శేఖర్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. నాగేంద్రకుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చదవండి: గాఢంగా ప్రేమించిన ప్రియుడు మరో అమ్మాయితో.. బ్రేకప్‌పై స్పందించిన నటుడి భార్య -
'ఉయ్యాలా జంపాలా' దర్శకుడి యాక్షన్ మూవీ
'ఉయ్యాల జంపాల', 'మజ్ను' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ.. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత కొత్త మూవీ ప్రకటించాడు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న 'జితేందర్ రెడ్డి' సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ని ప్రముఖ డైరెక్టర్ దేవకట్టా.. శనివారం విడుదల చేశారు. (ఇదీ చదవండి: ఆగిపోయిన తెలుగు 'బిగ్‌బాస్ 7'.. కారణం అదే?) 1980లో జరిగే ఓ పీరియడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా నడిచే యాక్షన్ డ్రామా. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ విరించి వర్మ.. తీసిన రెండు సినిమాలు లవ్ స్టోరీస్. ఈసారి మాత్రం పవర్ఫుల్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నారు. హీరోతోపాటు ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తారు. (ఇదీ చదవండి: శోభా కన్నీళ్లు.. టాప్-5లో ఉండవని నాగ్ కౌంటర్!) -
తెలంగాణ నేపథ్యంలో సినిమా తీస్తున్న మజ్ను డైరెక్టర్
‘ఉయ్యాల జంపాల, మజ్ను’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విరించి వర్మ. తన మూడో చిత్రాన్ని నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్నారాయన. ముదుగంటి క్రియేషన్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సందర్భంగా విరించి వర్మ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా నడిచే పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ఇది. 1980లో జరిగే ఒక పీరియాడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. నటీనటుల వివరాలు, టైటిల్‌ని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వీఎస్ జ్ఞానశేఖర్, సంగీతం: గోపీసుందర్. -
మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో కల్యాణ్ రామ్
హిట్టు, ఫ్లాపుల సంగతి పక్కన పెడితే కథ ఎంపికలో కల్యాణ్ రామ్ ఎప్పుడూ కొత్త దనం చూపిస్తూనే ఉన్నాడు. ఈ శుక్రవారం విడుదలైన 118 సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. తాజాగా కల్యాణ్ రామ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కల్యాణ్ రామ్ ఓకె చెప్పాడు. ఉయ్యాల జంపాల తరువాత మజ్నుతో మరో డీసెంట్ హిట్ అందుకున్న విరించి వర్మ.. కల్యాణ్ రామ్ కోసం పల్లెటూరి నేపథ్యంలో కథను రెడీ చేశాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మేలో సినిమా షూటింగ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. (చదవండి : ‘118’ మూవీ రివ్యూ) -
నాలుగు సినిమాలతో నందమూరి హీరో.!
నందమూరి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న యంగ్ హీరో కల్యాణ్ రామ్. కెరీర్లో అతనొక్కడే, పటాస్ లాంటి హిట్స్ ఉన్నా కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా మాత్రం ఇంతవరకు పడలేదు. అయితే సక్సెస్ విషయం పక్కన పెడితే ఈ యంగ్ హీరో ఈ ఏడాది ఓ ఇంట్రస్టింగ్ ఫీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ జనరేషన్ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికి కష్టపడుతుంటే కల్యాన్ రామ్ ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో అలరిస్తున్నాడు. కల్యాణ్ రామ్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన యన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సీక్వల్గా రూపొందుతున్న యన్.టి.ఆర్ మహానాయకుడులో కల్యాణ్ రామ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఇక కేవీ గుహన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న 118 కూడా మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇటీవల ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు నందమూరి హీరో. -
‘మజ్ను’ దర్శకుడితో కల్యాణ్ రామ్..!
ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీ పరిచయం అయిన యువ దర్శకుడు విరించి వర్మ. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ, తరువాత మంచి ఫాంలో ఉన్న నాని హీరో మజ్ను సినిమాను తెరకెక్కించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే మజ్ను విడుదలై చాలా కాలం అవుతున్నా ఈ యువ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. తాజా సమచారం ప్రకారం విరించి వర్మ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మార్చిలో ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ హీరోగా నటించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగతుందట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రటకన వెలువడనుంది. -
హ్యాట్రిక్‌కి వర్మ రెడీ!
దర్శకుడిగా విరించి వర్మ వయసు నాలుగేళ్లే. తీసింది రెండు సినిమాలే. అయితేనేం... రెండూ హిట్సే. అతను తీసిన తొలి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’ హీరోగా రాజ్ తరుణ్‌కి మంచి పునాది వేయడంతో పాటు లో బడ్జెట్లో మంచి సినిమాలు తీయాలనుకునే నిర్మాతలకు ధైర్యాన్ని ఇచ్చింది! నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వం వహించిన రెండో సినిమా ‘మజ్ను’ మంచి హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ దర్శకుడు ముచ్చటగా మూడో సినిమా తీయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎం.ఎల్. కుమార్‌చౌదరి సమర్పణలో కీర్తీ కంబైన్స్, పద్మజా పిక్చర్స్ సంస్థలు నిర్మించనున్నాయి. ‘‘యూత్‌ఫుల్, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథను విరించి వర్మ రెడీ చేశారు. తెలుగులోని ప్రముఖ యువహీరో ఈ సినిమాలో నటిస్తారు. ఆయనెవరు? ఇందులోని మిగతా నటీనటులు ఎవరు? సాంకేతిక నిపుణులు ఎవరు? అనే వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని కుమార్‌చౌదరి తెలిపారు. -
ఇష్టమా? ప్రేమా?
‘‘మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఇష్టమా? ప్రేమా? అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్కు మా చిత్రం చూస్తే క్లారిటీ వస్తుంది. యువతకు నచ్చే రొమాంటిక్ ఫీల్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎంటర్టైన్మెంట్ ‘మజ్ను’లో ఉంటుంది’’ అంటున్నారు దర్శకుడు విరించి వర్మ. నాని, అనూ ఇమ్మాన్యుయెల్, ప్రియాశ్రీ ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో పి.కిరణ్, గోళ్ల గీత నిర్మించిన ‘మజ్ను’ ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మా చిత్రం ట్రైలర్‌కు, గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. నాని నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ మూవీ తన కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, పోసాని, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. -
అష్టా చమ్మా రోజులు గుర్తొచ్చాయి : హీరో నాని
‘‘విరించి వర్మ ‘ఉయ్యాలా జంపాలా’ కథను ఫస్ట్ నాకే చెప్పాడు. అప్పట్నుంచి మా స్నేహం కొనసాగుతోంది. ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో, ‘మజ్ను’ అంతకన్నా హిట్ అవుతుంది’’ అని హీరో నాని పేర్కొన్నారు. నాని, అనూ ఇమ్మాన్యుయెల్, ప్రియాశ్రీ ముఖ్య తారలుగా విరించి వర్మ దర్శకత్వంలో పి.కిరణ్, గోళ్ల గీత నిర్మించిన చిత్రం ‘మజ్ను’. గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నాని విడుదల చేసి హీరో రాజ్ తరుణ్‌కు ఇచ్చారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘దిల్’ రాజు, అనీల్ సుంకర ట్రైలర్ విడుదల చేశారు. నాని మాట్లాడుతూ-‘‘మజ్ను’ అంటే బాధలో ఉండే కథ కాదు. సమస్యల్లో ఉండే ప్రేమికులను మజ్ను అంటుంటాం. ఈ చిత్ర కథాంశం అలాంటిదే. నాకు మళ్లీ ‘అష్టా చమ్మా’ రోజులు గుర్తుకు తెచ్చిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మనం ప్రేమలో ఉన్నప్పుడు అది ఎన్ని రోజులు నిలిచి ఉంటుంది అనే కన్ఫ్యూజన్. మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఇష్టమా ప్రేమా... అనే కన్ఫ్యూజన్ కూడా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది’’ అని విరించి వర్మ చెప్పారు. ‘‘నా కెరీర్లో బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారని నాని చెప్పడం నాకు నిజంగా హ్యాపీ’’ అని గోపీ సుందర్ తెలిపారు. ఈ వేడుకలో పి.కిరణ్, గోళ్ల గీత, దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, మారుతి, హను రాఘవపూడి, కల్యాణ్ కృష్ణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరికీ ప్రేమలేఖ?
‘‘నీ కోసం ఎంత దూరమైనా నడుస్తా.. ఎన్ని సముద్రాలైనా ఈదుతా.. ఎన్ని ఆకాశాలైనా దాటుతా.. ఎందుకంటే, నిన్ను చూసిన రోజే నేను మళ్లీ పుట్టాను. ఆ రోజు నుంచి నాకు నేను కొత్తగా ఉన్నాను. నీ చిరునవ్వే నాకు ఆహారం.. నీ మాటే నాకు సంగీతం..’’ ప్రేమలేఖ రాసుకుంటూ వెళ్తున్నాడో యువకుడు. మరి, ప్రేయసి స్పందన ఏంటో? తెలుసుకోవాలంటే ‘మజ్ను’ సినిమా చూడాలి. నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో పి.కిరణ్, గీత నిర్మించిన సినిమా ‘మజ్ను’. అనూ ఇమ్మాన్యుయేల్, ప్రియాశ్రీ హీరోయిన్లు. ఈ సెప్టెంబర్ 4న ఆడియో, 16న సినిమా విడుదల చేయనున్నారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. హీరోయిన్లు ఇద్దరిలో హీరో ప్రేమలేఖ ఎవరికి రాశాడనేది ఆసక్తికరం. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపిస్తారు. అది ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు నిర్మాతలు. ‘వెన్నెల’ కిశోర్, సత్యకృష్ణ, పోసాని, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు: ప్రవీణ్ పూడి, కెమేరా: జ్ఞానశేఖర్, సంగీతం: గోపీసుందర్. -
మజ్ను ఆడియో రిలీజ్ వాయిదా
నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ మజ్ను. వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న నాని, ఈ సినిమా సక్సెస్ మీద కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆడియో టీజర్లా విడుదల చేసిన కళ్ళు మూసి అనే పాట అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ రోజు రిలీజ్ అవ్వాల్సిన మజ్ను ఆడియో రిలీజ్ వాయిదా పడింది. కారణాలను వెల్లడించకపోయినా.. ఆడియో వేడుక వాయిదా పడినట్టుగా ప్రకటించాడు హీరో నాని. అభిమానులు నిరాశపడకుండా మరో ఆడియో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టుగా తెలిపాడు. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జెమినీ కిరణ్ నిర్మిస్తున్నాడు. నాని సరసన అను ఇమ్మాన్యుల్ హీరోయిన్గా నటిస్తున్న మజ్ను సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. #Majnu audio Launch pushed by a couple of days .. A little more wait :) — Nani (@NameisNani) 25 August 2016 -
ఆగస్టు 26న మజ్ను ఆడియో
వరుస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యువ నటుడు నాని, హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మజ్ను. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేశాడు హీరో నాని. మంగళవారం ఉదయం సినిమాలోని కళ్లు మూసి తెరిచే లోపే పాటను రిలీజ్ చేసిన నాని, ఆగస్టు 26న ఆడియో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
మజ్నుగా నాని
వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. వరుసగా రొమాంటిక్ ఎంటర్టైనర్లతో అలరిస్తున్న ఈ యంగ్ హీరో మరోసారి అదే జానర్లో తెరకెక్కిన సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో మజ్ను సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నాని. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు నాని. చాలా కాలం తరువాత ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాని సరసన అను ఎమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న మజ్నుకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. -
నాగ్ టైటిల్‌తో నాని
యంగ్ హీరో నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరస హిట్స్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల విడుదలైన జెంటిల్మన్ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావటంతో నెక్ట్స్ సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా కోసం ఓ ఇంట్రిస్టింగ్ టైటిల్‌ను ఫైనల్ చేశాడు. 80స్లో నాగార్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా మజ్ను. ఇప్పుడు ఇదే టైటిల్‌ను తన సినిమాకు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు నాని. అసలు మజ్ను టైటిల్‌తో చైతూ సినిమా చేయాల్సి ఉంది. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న మళయాల సూపర్ హిట్ ప్రేమమ్ రీమేక్‌కు ముందుగా మజ్ను అనే టైటిల్‌నే అనుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చైతూ కాదన్న టైటిల్ నానికి ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి. -
అంధుడిగా యంగ్ హీరో
నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్, ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. ప్రస్తుతం ఉయ్యాల జంపాల ఫేం విరింఛి వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్, తరువాతి సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. నేను శైలజ తరువాత కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేసిన రామ్, వరుసగా రెండు సినిమాలకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు తన తర్వాతి సినిమాలో ఓ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న రామ్, మాస్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకుంటున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను అంగీకరించాడు. కామెడీ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమాలు తెరకెక్కించే అనిల్, రామ్ కోసం ఎనర్జిటిక్ స్టోరీని రెడీ చేశాడట. అయితే ఈ సినిమాలో రామ్ అంధుడి పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా ప్రకటించాడు. అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన సుప్రీమ్ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తన తదుపరి సినిమాను ప్రకటించాడు. రామ్ హీరోగా తన సినిమా ఉంటుదన్న అనిల్, ఆ సినిమాలో హీరో పాత్ర ‘అంధుడు’ అంటూ షాక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు ప్రయోగాలకు పెద్దగా ఇష్టపడని రామ్ తొలిసారిగా చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
ఈ సారి పవన్ అభిమానిగా..!
వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఈ శుక్రవారం జెంటిల్‌మేన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపించాడు. చేతి మీద జై బాలయ్య టాటూతో కనిపించిన నాని, ఎంతోమంది నందమూరి అభిమానులు ఆ టాటూ వేయించుకోవడానికి కారణమయ్యాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య పేరు వాడుకోవటం నానికి కూడా బాగానే కలిసొచ్చింది. నందమూరి అభిమానుల సాఫ్ట్ కార్నర్‌తో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో తన నెక్ట్స్ సినిమాకు మరో స్టార్ హీరో పేరును వాడుకోవడానికి రెడీ అవుతున్నాడు నాని. ఇప్పటికే యంగ్ హీరో నితిన్ తన ప్రతీ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు జపిస్తూ పవర్ స్టార్ అభిమానులను బుట్టలో వేసుకుంటున్నాడు. ఇప్పుడు అదే పేరును వాడుకోవడానికి రెడీ అవుతున్నాడు నాని. గతంలో బాలయ్య అభిమానిగా నటించిన నాని, ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా జెంటిల్‌మేన్ రిలీజ్ తరువాత సెట్ మీదకు వెళుతోంది. -
ఉయ్యాల జంపాల డైరెక్టర్‌తో నాని
ఉయ్యాల జంపాల సినిమాతో మంచి విజయం సాధించిన యువ దర్శకుడు విరించి వర్మ. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించినా.. తరువాత అవకాశాలు పొందటంలో మాత్రం ఈ యువ దర్శకుడు వెనకపడ్డాడు. తొలి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వర్మ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నయంగ్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలతో సూపర్ ఫాంలో ఉన్న నాని, ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత విరించి వర్మతో కలిసి పనిచేయడానికి అంగీకరించాడు నాని. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్న వర్మ, నటీనటులు ఎంపిక కూడా మొదలు పెట్టాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ఉయ్యాల...జంపాల
అక్కినేని నాగార్జున, డి.సురేశ్‌బాబు, ‘అష్టా చమ్మా’ ఫేమ్ పి.రామ్మోహన్... ఈ ముగ్గురూ కలిసి సినిమా చేయడమే ఒక ఆసక్తికర అంశమైతే, అంతా కొత్త టీమ్‌తో ఈ సినిమా నిర్మించడం ఇంకా ఆసక్తి కలిగించే విషయం! ఇన్ని ఆసక్తులకు నెలవుగా నిలిచిన సినిమా ‘ఉయ్యాల జంపాల’. విరించి వర్మ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో ప్రాచుర్యం పొందిన ఆనంది, రాజ్‌తరుణ్ ఇందులో నాయికా నాయకులు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. నిర్మాతల్లో ఒకరైన రామ్మోహన్.పి మాట్లాడుతూ -‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఈ నెలలో పాటలను త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వ డి.బి., సంగీతం: సన్నీ ఎం.ఆర్, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాతలు: నాగార్జున, రామ్మోహన్ పి.