ఇంట్రస్టింగ్‌గా జితేందర్‌ రెడ్డి వీడియో.. ఆయనెవరో తెలిసేది ఆరోజే! | Oath of Jithender Reddy Video Out Now | Sakshi
Sakshi News home page

Jithender Reddy: 'ధీరుడు ఒకసారే మరణిస్తాడు.. కానీ పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు..' ఎవరీ జితేందర్‌ రెడ్డి?

Published Mon, Sep 18 2023 3:51 PM | Last Updated on Mon, Sep 18 2023 4:33 PM

Oath of Jithender Reddy Video Out Now - Sakshi

'ధీరుడు ఒకసారే మరణిస్తాడు.. కానీ, పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు' అన్న డైలాగుతో రిలీజైన 'జితేందర్‌ రెడ్డి' షార్ట్ వీడియో ఆసక్తిని పెంచుతోంది. అసలు ఎవరు ఈ 'జితేందర్‌ రెడ్డి'? ఆయన గురించి తెలుసుకోవడానికి ఏముంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి ప్రేమ కథలను దర్శకత్వం వహించిన విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'జితేందర్‌ రెడ్డి'.

ఇటీవలే రిలీజైన పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచగా సెప్టెంబర్‌ 18న విడుదలైన 'జితేందర్‌ రెడ్డి' వీడియో సినిమాపై అంచనాలను పెంచేసేంది. 'జితేందర్‌ రెడ్డి' అనే నేను అంటూ ఆయన చేసిన హామీ, అలాగే ఆ వీడియోలో చూపించిన 'ధీరుడు ఒకసారే మరణిస్తాడు కాని పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు' అన్న మాట ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి.

కాగా ఈ సినిమాలో 'జితేందర్‌ రెడ్డి'గా చేసింది ఎవరు? అని తెలుసుకోవాలంటే ఈ నెల 21 వరకు ఆగాల్సిందే! ఎందుకంటే ఆరోజే చిత్రయూనిట్‌ ఫస్ట్ లుక్ విడుదల చేయనుంది. ఈ చిత్రానికి వి.ఎస్‌ జ్ఞాన శేఖర్‌ కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. నాగేంద్రకుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చదవండి: గాఢంగా ప్రేమించిన ప్రియుడు మరో అమ్మాయితో.. బ్రేకప్‌పై స్పందించిన నటుడి భార్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement