‘జితేందర్‌ రెడ్డి’ సినిమా నుంచి 'అ ఆ ఇ ఈ ఉ ఊ' సాంగ్ విడుదల | Jithender Reddy Movie Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

‘జితేందర్‌ రెడ్డి’ సినిమా నుంచి 'అ ఆ ఇ ఈ ఉ ఊ' సాంగ్ విడుదల

Published Sat, Apr 13 2024 9:59 PM | Last Updated on Sun, Apr 14 2024 7:23 AM

Jithender Reddy Movie Song Out Now - Sakshi

‘బాహుబలి’ ఫేమ్‌ రాకేష్‌ వర్రే టైటిల్‌ రోల్‌లో రూపొందిన చిత్రం  ‘జితేందర్‌ రెడ్డి’. హిస్టరీ నీడ్స్‌ టు బీ టోల్డ్‌ అనేది ఉపశీర్షిక (చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది), ‘ఉయ్యాలా జంపాలా, మజ్ను’ వంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఇప్పుడు ఈ సినిమాలో 'అ ఆ ఇ ఈ ఉ ఊ' అంటూ సాగే యూత్ ఫుల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు.

ఆర్ట్స్, సైన్స్, ఇంగ్లీష్ కంటే ముందు ఎన్నో విషయాలు జరిగాయి అవి తెలుసుకోవాలి. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, న్యూటన్ ఏ కాదు మనదేశంలో కూడా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటూ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో యూత్ ఫుల్‌గా ఈ సాంగ్‌ని తెరకెక్కించారు. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు మరియు రాహుల్ సిప్లిగంజ్ పాటని చాలా బాగా పాడారు. కాలేజీలో జరిగే ఎలక్షన్స్ గ్యాంగ్స్ మధ్య ఉండే రైవలరీస్ ఈ లిరికల్ సాంగ్ లో చూపించారు. 1980' లో జితేందర్ రెడ్డి అనే వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవాలి అని ఈ సినిమాని తెరకెక్కించారు. కాలేజ్ స్టూడెంట్ లీడర్‌గా అదేవిధంగా ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే నాయకుడిగా జితేందర్ రెడ్డి చేసిన సేవలను ఈ సినిమాలో చూపిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ముదిగంటి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే సినిమా పైన అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటా ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ ద్వారా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు. ఈ చిత్రం మే 3న రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement