జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల | Jithender Reddy Trailer Out Now | Sakshi
Sakshi News home page

జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల

Published Fri, May 3 2024 6:19 PM | Last Updated on Fri, May 3 2024 6:22 PM

Jithender Reddy Trailer Out Now

ముదుగంటి క్రియేషన్స్‌పై తెరకెక్కిన జితేందర్‌ రెడ్డి సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ చిత్రాన్ని ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  రాకేష్ వర్రె లీడ్ రోల్‌లో నటించిన జితేందర్ రెడ్డి విడుదలకు సిద్ధంగా ఉంది. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 

చిన్నప్పటినుండే సమాజం పట్ల అంకితభావం ఉన్న జితేందర్ రెడ్డి, సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి అనే భావంతో పెరుగుతాడు. ఆ లక్షణాలు జితేందర్ రెడ్డితో పాటు పెరిగి, కాలేజీ ఎలక్షన్స్ లో లీడర్ గా ఎదిగి, ఆ తరవాత పోలీసు వ్యవస్థకే దీటుగా, సమాజంలో నక్సలైట్లు చేసే దోర్జన్యాలకు ఎదురు వెళ్తాడు, ట్రైలర్ మద్యలో హిందుత్వం వంటి డైలాగ్ లు మరింత ఆశక్తి పెంచేలా ఉన్నాయి. 1980’s ఒక వ్యక్తి జీవితంలో జరిగే కాలేజీ పాలిటిక్స్, ఆ తరవాత నిజమైన రాజకీయాలు నేపధ్యంలో ఈ కథ సాగుతున్నట్టు ఉంది. మొత్తానికి ప్రేక్షకులను మెప్పించేలా కథ ఉంది. మే 10న ‘జితేందర్ రెడ్డి విడుదల కాబోతుంది అని చిత్ర యూనిట్ ట్రైలర్ ద్వారా తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement