ఉయ్యాలా జంపాల, ‘మజ్ను’ చిత్రాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే హీరోగా నటించారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హీరో రాకేశ్ వర్రే ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందని మాట్లాడారు. ఆ వివరాలేంటో చూసేద్దాం.
రాకేశ్ వర్రే మాట్లాడుతూ.. 'నేను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చాను. ఇండస్ట్రీలో సెట్ అవ్వడానికి చాలా రోజులు టైమ్ పట్టింది. కానీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేద్దామని పేకమేడలు ప్రాజెక్ట్ చేశా. ఆ తర్వాత నాకు అర్థమైంది. ఆ ప్రాజెక్ట్ చేయకుండా ఉండాల్సిందని. అదే నేను వేసిన రాంగ్ స్టెప్. నాకు ఒక సక్సెస్ వస్తే చాలనుకున్నా. కానీ ఇక్కడ మార్కెట్ అనేది ముఖ్యం. పేకమేడలు మాకు మూడేళ్లు పట్టింది. చేస్తూనే ఉన్నాం. ఎవరైనా మాకు బ్రాండ్ ఉండి ఉంటే ఏడాదిన్నరలోనే పూర్తి చేసేవాళ్లం. ఇక్కడ మనకు బ్రాండ్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. రాకేశ్ వర్రే ఒక బ్రాండ్ అయ్యాకే కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తా. తప్పకుండా చేస్తా. ఇది నేను నేర్చుకున్న గుణపాఠం. పేకమేడలు సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నా' అని అన్నారు. కాగా.. పేకమేడలు చిత్రానికి రాకేశ్ వర్రే నిర్మాతగా వ్యవహరించారు.
కాగా.. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం ధర్మం కోసం నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. అంతే కాకుండా ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడటం ట్రైలర్‌లోనూ చూపించారు. కాగా.. ఈ చిత్రంలో వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment