ఇష్టమా? ప్రేమా? | Nani in Virinchi Varma's direction | Sakshi
Sakshi News home page

ఇష్టమా? ప్రేమా?

Sep 9 2016 11:15 PM | Updated on Sep 4 2017 12:49 PM

ఇష్టమా? ప్రేమా?

ఇష్టమా? ప్రేమా?

మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఇష్టమా? ప్రేమా? అనే కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్‌ఫ్యూజన్‌కు మా చిత్రం చూస్తే క్లారిటీ వస్తుంది.

 ‘‘మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఇష్టమా? ప్రేమా? అనే కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్‌ఫ్యూజన్‌కు మా చిత్రం చూస్తే క్లారిటీ వస్తుంది. యువతకు నచ్చే రొమాంటిక్ ఫీల్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ ‘మజ్ను’లో ఉంటుంది’’ అంటున్నారు దర్శకుడు విరించి వర్మ. నాని, అనూ ఇమ్మాన్యుయెల్, ప్రియాశ్రీ ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో పి.కిరణ్, గోళ్ల గీత నిర్మించిన ‘మజ్ను’ ఈ నెల 23న విడుదల కానుంది.
 
 ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మా చిత్రం ట్రైలర్‌కు, గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. నాని నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ మూవీ తన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, పోసాని, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement