Majnu
-
బురుజు కట్టే వారెవరు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టును కట్టేశాం.. సంప్రదాయ–ఆధునిక నమూనాల మేళవింపుతో కొత్త సచివాలయ నిర్మాణం సాగుతోంది.. భాగ్యనగరంలో ఎన్నో ఆకాశహర్మ్యాలూ సిద్ధమవుతున్నాయి.. ఇలాంటి భారీ కట్టడాలకు నిర్మాణ కంపెనీలు పోటీపడుతున్నాయి.. కానీ, ఓ కట్టడానికి మాత్రం ఇంజనీర్లు దొరకడం లేదు. అదే మజ్నూ బురుజు. గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న నయాఖిల్లాలో ఈ బురుజు ప్రస్తుతం శిథిలగుట్టగా ఉంది. దీన్ని పునర్నిర్మించేందుకు గతేడాది నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణకు బురుజులు కొత్త కాదు. చాలా ఊళ్లలో అవి దర్శనమిస్తాయి. అప్పట్లో ఊరూవాడా వాటిని సులభంగా నిర్మించేశారు. ఇప్పుడు వాటిని కట్టేవా రి కోసం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) భూతద్దం పెట్టి గాలిస్తున్నా దొరకడం లేదు. ఇదీ సంగతి.. నయాఖిల్లాలో 500 ఏళ్ల క్రితం లైలా–మజ్నూల పేరుతో రెండు బురుజులు నిర్మించారు. ఇందులో మజ్నూ బురుజు కాస్త పెద్దది. గత అక్టోబర్‌లో కురిసిన అతి భారీ వర్షాలకు కుప్పకూలింది. అంతకు కొన్ని నెలల ముందే దానికి భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. గోల్ఫ్ కోర్టు అభివృద్ధి చేసే క్రమంలో దాని దిగువన జరిగిన మట్టిపనులతో సమతౌల్యం దెబ్బతిని పగుళ్లు ఏర్పడటానికి కారణమైందని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఆ పగుళ్లకు ఏఎస్ఐ సకాలంలో స్పందించలేదు. ఆలస్యంగా పనులు ప్రారంభించినా, శాస్త్రీయత లేకుండా లోపభూయిష్టంగా చేపట్టడంతో వాననీళ్లు సులభంగా లోనికి చొరబడి మట్టి జారి కట్టడం కూలిపోయింది. ఇది పూర్తిగా మట్టి కట్టడం. చుట్టూ భారీ బండరాళ్లను పద్ధతి ప్రకారం పేర్చి బురుజు రూపమిచ్చారు. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. మట్టి కట్టడం ఐదు శతాబ్దాల పాటు నిలబడి, మానవ తప్పిదంతో చివరకు కూలిపోయింది. చరిత్రలో ఆ కట్టడానికి స్థానం ఉండటం, చారిత్రక గోల్కొండ కోట అంతర్భాగం కావటంతో దాన్ని తిరిగి నిర్మించాలని ఏఎస్ఐ నిర్ణయించి గతేడాది చివరి నుంచి ప్రయత్నిస్తోంది. జాతీయ స్థాయిలో రెండు దఫాలు టెండరు నోటిఫికేషన్ ఇచ్చినా దాన్ని నిర్మించగలిగే సంస్థలు రాలేదు. నైపుణ్యం ఉన్న వారు కరువు... మట్టితో నిర్మించి, బాహ్య భాగాన్ని డంగు సున్నం పూతతో పెద్ద రాళ్లతో నిర్మించాలని ఈసారి నిర్ణయించారు. ఈ తరహా కట్టడాలను నిర్మించిన అనుభవం ఉన్న వారిని ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. బురుజుల పునర్నిర్మాణం, లేదా ఆ తరహా భారీ గోడలను నిర్మించిన వారు, ఆ పనుల్లో కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్నవారు కావాలని పేర్కొన్నారు. ఇలాంటి నైపుణ్యం ఉన్నవారికి కరవు వచ్చి పడింది. కొందరు వచ్చినా అనుభవం లేకపోవటంతో రద్దు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ పనితీరు అనుభవం ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. కేవలం రూ.కోటి విలువైన ఈ పని పూర్తి చేయటం ఇప్పుడు ఏఎస్ఐకి కత్తిమీద సాములా మారింది. అది కూలిన సమయంలో పై భాగంలో గాలిలో వేళ్లాడుతూ ఉండిపోయిన 18 అడుగుల పొడవైన 150 టన్నుల బరువున్న భారీ తోపును కిందకు దింపేందుకు రెండు రోజులు పట్టింది. అందుకే ఇప్పుడు ఆ పనులు సవాల్ విసురుతున్నాయి. -
మాకు బాగా కలిసొచ్చింది
విశాఖపట్నం :‘మజ్ను పేరు మా కుటుంబానికి బాగా కలిసివచ్చింది. ఆ పేరుతో వచ్చిన నాన్న సినిమా హిట్టయింది . ఇప్పుడు నా సినిమా మిస్టర్ మజ్ను ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది ’ అన్నారు సినీ హీరో అఖిల్. మిస్టర్ మజ్ను విజయోత్సవంలో భాగంగా శుక్రవారం నగరానికి వచ్చిన చిత్రయూనిట్ ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించింది. హీరో అఖిల్ మాట్లాడుతూ వైజాగ్‌లో బీచ్ ఉండటం విశాఖ ప్రజల అదృష్టమన్నారు. హైదరాబాద్‌లో బీచ్ లేకపోవటంతో తనకు కాస్త చాలా జెలసీగా కూడా ఉందన్నారు. వైజాగ్ ప్రజలు, బీచ్, వాతావరణం చాలా బాగుంటాయని, అందుకే తనకు విశాఖ అంటే చాలా ఇష్టమని అన్నారు. తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్ నిధి, దర్శకుడు వెంకీ తదితరులు పాల్గొన్నారు. -
అక్కినేని ఫ్యామిలీకి ‘మజ్ను’ కలిసొచ్చింది
మజ్ను చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్నుని ప్రేక్షకులు ఆదరించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ చేస్తోంది. బుధవారం గాంధీనగర్‌లోని శైలజ థియేటర్లో హీరో అఖిల్, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకుడు అట్లూరి వెంకట్ ప్రేక్షకులను కలుసుకొని సంతోషం పంచుకున్నారు. లబ్బీపేట (విజయవాడతూర్పు): మజ్ను టైటిల్ మా అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిందనీ మిస్టర్ మజ్ను కథానాయకుడు, అక్కినేని అఖిల్ అన్నారు. మిష్టర్ మజ్ను చిత్ర యూనిట్ బుధవారం నగరంలో సందడి చేసింది. శ్రీ వేంకటేశ్వర సినీచిత్ర బ్యానర్‌పై అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్నుని ప్రేక్షకులు ఆదరించిన సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ టూర్ చేస్తోంది. అందులో భాగంగా హీరో అఖిల్, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకుడు అట్లూరి వెంకట్, కమెడియన్ ఆదిలు నగరానికి విచ్చేసి గాంధీనగర్‌లోని శైలజ థియేటర్లో ప్రేక్షకులను కలుసుకున్నారు. అనంతరం మహాత్మాగాంధీరోడ్డులోని ఫార్చ్యూన్ మురళీపార్క్‌లో నిర్వహించి విలేకరుల సమావేశంలో అఖిల్ మాట్లాడుతూ తన తండ్రి నాగార్జున నటించిన మజ్ను టైటిల్‌తో నటించడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు. డైరెక్టర్ అట్లూరి వెంకట్ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నట్లు తెలిపారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ మా బ్యానర్ నుంచి వచ్చిన మంచి రొమాంటిక్ హిట్ మూవీ మిస్టర్ మజ్నుగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో కామాక్షి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, నాగార్జున ష్యాన్స్ అసోసియేషన్ నాయకులు సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో అఖిల్‌కు అభిమానులు సన్మానం చేశారు. దుర్గమ్మ సేవలో ... ఇంద్రకీలాద్రి : మిస్టర్ మజ్నూ చిత్ర బృందం బుధవారం దుర్గమ్మను దర్శించుకుంది. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన బృందానికిఆలయ అధికా రులు సాదరస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. హీరో, హీరోయిన్లకు ఆలయ పాలక మండలి చైర్మన్ గౌరంగబాబు అమ్మవారి ప్రసాదాలను అందచేశారు. -
‘మజ్ను’ దర్శకుడితో కల్యాణ్ రామ్..!
ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీ పరిచయం అయిన యువ దర్శకుడు విరించి వర్మ. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ, తరువాత మంచి ఫాంలో ఉన్న నాని హీరో మజ్ను సినిమాను తెరకెక్కించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే మజ్ను విడుదలై చాలా కాలం అవుతున్నా ఈ యువ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. తాజా సమచారం ప్రకారం విరించి వర్మ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మార్చిలో ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ హీరోగా నటించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగతుందట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రటకన వెలువడనుంది. -
మూడు పాటలు.. రెండు ఫైట్లు
ప్రేమ కబుర్లకి ఫుల్స్టాప్ పెట్టి ఫైట్స్ చేయడానికి, పాటలు పాడటానికి రెడీ అవుతున్నారు అఖిల్. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘మిస్టర్ మజ్ను’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్, నిధిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా టాకీ పార్ట్ బుధవారంతో పూర్తవుతుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో ఆరు పాటలు ఉండగా మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. మరో మూడు పాటలు, రెండు ఫైట్లు మినహా సినిమా మొత్తం పూర్తయింది. -
బాలనటి నుంచి శైలజారెడ్డి కూతురి వరకు
బాలనటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన అను ఇమ్మాన్యుయేల్ మలయాళ చిత్రం ‘యాక్షన్ హీరో బిజూ’తో హీరోయిన్ అయింది. మజ్ను, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, శైలాజారెడ్డి అల్లుడు... చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అను అంతరంగ తరంగాలు... ►మనం ఎప్పుడూ ఒకేలా ఉండమనే విషయాన్ని బలంగా నమ్ముతాను. రకరకాల అనుభవాలు మనల్ని ఆకర్షణీయంగా తీర్చుదిద్దుతాయి. రెండు సంవత్సరాల క్రితం వరకు తెలుగులో నా డైలాగులను నేను చెప్పుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు అలాంటి కష్టం లేదు. త్వరలో తెలుగును ధారాళంగా మాట్లాడగలననే నమ్మకం ఉంది. ►నటన నా జీవితాన్నే మార్చేసింది. ఒకప్పుడు ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడేదాన్ని. ఇప్పుడు నా పనులు నేనే సొంతంగా చేసుకోగలుగుతున్నాను. ‘శైలజారెడ్డి అల్లుడు’లో పొగరున్న యువతిగా నటించాను. నిజజీవితంలో కూడా నాకు పొగరు ఉంది. అయితే దాన్ని నేను ‘హెల్తీ ఇగో’ అంటాను. నాకే కాదు ప్రతి ఒక్కరికీ ఇది ఉండాలి. ►వేరే కథానాయికతో కలిసి పనిచేయడం వల్ల నేనేమీ ‘అభద్రత’కు గురికాను. మన గురించి మనకు స్పష్టత లేనప్పుడే అభద్రతాభావన ముందుకొస్తుంది. నేను నటించే సినిమా ఏమిటో దానిలో నా పాత్ర ఏమిటో నాకు స్పష్టంగా తెలుసుకాబట్టి అభద్రత అనే సమస్యే ఎదురుకాదు. ►పాత్రలో ఎంత దమ్ము ఉంది, ఎంత గొప్పగా ఉంది అనేది విషయం కాదు. సినిమా ఆడకపోతే మన కష్టం, ప్రతిభ కనిపించకపోవచ్చు. అంతమాత్రాన యాంత్రికంగా నటించలేము కదా! ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నలోపం ఉండకూడదని నమ్ముతాను. నా పాత్ర అద్భుతంగా ఉండటం వల్ల సినిమా ఆడదు... సినిమా అనేది రకరకాల పాత్రల ప్యాకేజీ. ►నటి అన్నాక కమర్షియల్ సినిమాలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న నాన్ కమర్షియల్ సినిమాలు కూడా చేయాలి. అయితే కెరీర్ నిర్మాణదశలో ప్రయోగాత్మక చిత్రాలు, పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. కొన్ని అవకాశాలు అనుకోకుండా తలుపుతట్టి ఎక్కడికో తీసుకువెళతాయి. ‘మహానటి’లాంటి సినిమా చేయాలని ఉంది. ►జయాపజయాలు మన అధీనంలో ఉండవు. కాబట్టి ఫెయిల్యూర్స్ గురించి అతిగా ఆలోచించను. కెరీర్ ప్రారంభంలో సహజంగానే కొన్ని తప్పులు చేస్తాం. నేను అలాగే చేశాను. అంతమాత్రాన ‘ఇక అంతా అయిపోయింది’ అని డీలాపడే మనిషిని కాదు. ఇండస్ట్రీలో పోటీ గురించి చెప్పాలంటే, మెడికల్ ఎంట్రన్స్లాంటి పోటీ కాకపోయినా పోటీ అనేది ఉండాలి. అలా ఉంటే మరింత మెరుగవుతాం. -
మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాని
మన హీరోలు తమ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేస్తుండగా.. కొంత మంది హీరోలు మరో అడుగు ముందుకేసి బహుభాషా చిత్రాలు చేస్తున్నారు. అదే బాటలో నాచురల్ స్టార్ నాని కూడా మాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఈ శుక్రవారం నేను లోకల్ అంటూ టాలీవుడ్లో సత్తా చాటిన యంగ్ హీరో నాన్ లోకల్ ఏరియాలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాను మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాలీవుడ్ నిర్మాత జీపీ సుధాకర్ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే నాని కెరీర్లో ఇంతకన్నా పెద్ద హిట్స్ ఉన్నా ఈ సినిమానే రీమేక్ చేయడానికి ప్రత్యేక కారణాలున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అను ఇమ్మాన్యూల్ మలయాళంలో స్టార్ హీరోయిన్, ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసిన గోపిసుందర్ది కూడా మలయాళ ఇండస్ట్రీనే. అందుకే మాలీవుడ్‌కు ప్రేక్షకులకు ఈజీగా దగ్గరవుతుందన్న ఉద్దేశంతో మజ్ను సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మరి నేను లోకల్ అంటూ సక్సెస్ కొట్టిన లోకల్ బాయ్, నాన్‌లోకల్‌గా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
పవన్‌కు జోడిగా మజ్ను హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పుల్ ఫాంలో ఉన్నాడు. 2019 ఎన్నికల్లో పోటి చేసే ఆలోచనలో ఉన్న పవన్, ఈ లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవన్, తరువాత చేయబోయే రెండు సినిమాలను ప్రకటించాడు. ఏఎం రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు నేసన్ తెరకెక్కించబోయే సినిమాతో పాటు, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలను ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించాడు. ముందుగా సెట్స్ మీదకు వెళ్లనున్న త్రివిక్రమ్ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న.., ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక హీరోయిన్గా నటిస్తుండగా.. తాజాగా మరో హీరోయిన్ పాత్రకు మజ్ను ఫేం అను ఇమ్మన్యూల్ను ఎంపిక చేశారు. నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అను, వెంటనే పవన్ లాంటి టాప్ స్టార్ సరసన నటించే అవకాశం దక్కటంతో తెగ సంబర పడిపోతోంది. -
లైలా ఖాతాలో మరో రెండు సినిమాలు
నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటి, అను ఇమ్మన్యూల్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటి మరో రెండు సినిమాలతో ఆడియన్స్ ముందకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటి సినిమాల ఎంపిక విషయంలో సెలెక్టివ్‌గా ఉంటోంది. మజ్ను సినిమాతో పాటు గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ఆక్సిజన్ సినిమాను పూర్తి చేసిన అను.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా వంశీ కృష్ణ దర్శకత్వంలో ఏకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తోంది.., అను ఇమ్మన్యూల్. వీటితో మరిన్ని సినిమాలు డిస్కషన్స్ దశలో ఉండటంతో త్వరలోనే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉంది ఈ లైలా. -
మేకింగ్ ఆఫ్ మూవీ - మజ్ను
-
ఆ భయం లేదు!
‘‘ ‘మజ్ను’ అనగానే విషాద ప్రేమకథా చిత్రం అనుకుంటారందరూ. కానీ, మా ‘మజ్ను’ మాత్రం సిన్సియర్ ప్రేమకథా చిత్రం. ప్రేమ విఫలమైందని మందు తాగితే జీవితం కూడా నాశనం అవుతుంది. ఫెయిలైన ప్రేమను మళ్లీ ఎలా సక్సెస్ చేసుకోవాలన్నది ఆసక్తికరంగా, వినోదాత్మకంగా చూపించాం’’ అని దర్శకుడు విరించి వర్మ అన్నారు. నాని, అనూ ఇమ్మాన్యుయెల్, ప్రియాశ్రీ ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో పి.కిరణ్, గోళ్ల గీత నిర్మించిన ‘మజ్ను’ నేడు విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘దర్శకుడు మదన్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశా. కె.విశ్వనాథ్, బాలచందర్, బాపు, వంశీ, భారతీరాజాగార్ల ఇన్స్పిరేషన్తో దర్శకుడినయ్యా. ఈ తరం దర్శకుల్లో రాజమౌళి, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ సినిమాలంటే ఇష్టం. లవ్ ఫెయిల్యూర్స్ చాలామందికి ఉంటాయి. కానీ, సిన్సియర్ ప్రేమ ఫెయిల్యూర్ అయినా మళ్లీ సక్సెస్ చేసుకోవచ్చు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా, ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కాదు. నా తొలి చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’ హిట్ అయింది. అందరూ ద్వితీయ విఘ్నం అంటారు. కానీ, కథపై నాకు చాలా నమ్మకం. అందుకే ఆ భయం లేదు. ఈ చిత్రంలో రాజమౌళిగారు, హీరో రాజ్‌తరుణ్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం మరో కథ సిద్ధం చేస్తున్నాను. ఆ కథలో రాజ్‌తరుణ్, నాని కాకుండా వేరే హీరో నటిస్తారు’’ అన్నారు. -
బిజీ బిజీగా నాని
సెప్టెంబరు 23వ తేదీన 'మజ్ను'గా థియేటర్లకు రాబోతున్న నాని.. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఏడాదిన్నరగా వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న నాని.. తాజా చిత్రం 'మజ్ను' కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 'ఉయ్యాల జంపాల' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫీల్ గుడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా అలరించనుంది. నాని మార్క్ సెన్సిబుల్ కామెడీ హైలైట్ కానుంది. మరోపక్క నాని తదుపరి చిత్రం 'నేను లోకల్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబరులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
నాది ఈ-మెయిల్స్ ప్రేమకథ
‘‘ఈ సినిమా పేరు మాత్రమే ‘మజ్ను’. రియల్ లైఫ్‌లో నేను ‘మజ్ను’ అయ్యే చాన్సే లేదు. ‘అష్టాచమ్మా’ కంటే ముందు సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. ‘ఈగ’ విడుదల తర్వాత ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను’’ అన్నారు నాని. ఆయన హీరోగా విరించివర్మ దర్శకత్వంలో పి.కిరణ్, గోళ్ల గీత నిర్మించిన సినిమా ‘మజ్ను’. అనూ ఇమ్మాన్యుయేల్, ప్రియాశ్రీ హీరోయిన్లు. ఈ నెల 23న విడుదలవుతోన్న ఈ సినిమా గురించి నాని చెప్పిన సంగతులు.. ♦ చాలామంది కథలు చెప్తుంటారు, నేను వింటుంటాను. ఒక్కోరోజు మూడ్‌ని బట్టి వినబోయే కథ కచ్చితంగా ఓకే అవుతుందనిపిస్తుంది. నా సెన్స్ నిజమైంది. అనుకున్నట్టు విరించివర్మ మంచి కథ చెప్పాడు. రాజమౌళి, కృష్ణవంశీ, ఇంద్రగంటి మోహనకృష్ణ.. నాకంటే వయసులో పెద్దవారైన దర్శకులతో ఎక్కువ పనిచేశాను. నా దర్శకులందరిలో విరించివర్మ చిన్నోడు. మా ఇద్దరికీ వేవ్‌లెంగ్త్ బాగా కుదిరింది. అనుకున్నట్టుగా సినిమా తీశాడు. ♦ ఈరోజుల్లో ప్రేమలేఖలు ఎక్కడా కనిపించడం లేదు. నా రియల్ లైఫ్ ప్రేమకథలోనూ ఈ-మెయిల్సే ఉన్నాయి. ఈ సినిమా భీమవరం నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ప్రేమలేఖలు ఉపయోగించాం. జెన్యూన్ లవ్‌స్టోరీ ఇది. ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికుల్ని ‘మజ్ను’ అంటుంటారు. నా లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్ లేదు. ఈ సినిమా ఎందుకు చేశానంటే.. ప్రేక్షకులెవరూ ‘మజ్ను’లా మారి, చెడిపోకూడదు. ఈ సినిమాతో ‘మజ్ను’ అర్థం మార్చాలనేది మా ప్రయత్నం. ఈ సినిమాలో ‘బాహుబలి’ సహాయ దర్శకుడు ఆదిత్యగా నటించా. వృత్తి పరమైన సన్నివేశాలు ఎక్కడా ఉండవు. ఓ రెండు సీన్స్ కథతో సంబంధం లేకుండా ఎంటర్టైన్ చేస్తాయి. ♦ నిర్మాత పి.కిరణ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఎప్పట్నుంచో పరిచయం. గీతగారు ప్రొడక్షన్ చూసుకున్నారు. మా టీమ్ మీదున్న నమ్మకంతో సెట్స్‌కి కూడా రాలేదు. మొన్ననే సినిమా చూశారు. ఆయన హ్యాపీ. ♦ విడుదలకు ముందే సినిమాలో పాటలన్నీ హిట్టయ్యాయి. రేడియో స్టేషన్ వాళ్లు ఫోన్ చేసి.. ప్రతి పాట బాగుందంటే హ్యాపీగా ఉంది. మామూలు సినిమాను కూడా తన మ్యూజిక్‌తో ఓ రేంజ్‌కి తీసుకువెళ్లే గోపీసుందర్ మంచి పాటలు ఇచ్చారు. ‘నేను లోకల్’తో పాటు ఆ తర్వాత నేను చేయబోయే సినిమాకీ ఆయనే సంగీత దర్శకుడు. సినిమాల కంటే మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ♦ త్రినాథరావు దర్శకత్వంలో చేస్తున్న ‘నేను లోకల్’ క్రిస్మస్కి విడుదలవుతోంది. ఆ తర్వాత డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా చేస్తా. -
‘మజ్ను’ మూవీ స్టిల్స్
-
సెన్సార్ పూర్తి చేసుకున్న 'మజ్ను'
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'మజ్ను' సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం. యూత్‌ఫుల్ ఎంటర్టెయినర్గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన అను ఇమ్మానుయేల్, ప్రియాశ్రీలు కథానాయికలుగా నటించారు. సెప్టెంబరు 23 వ తేదీన మజ్ను ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహించగా గోపీసుందర్ సంగీతం అందించారు. వెన్నెల కిషోర్, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య తదితరులు ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. -
ఇష్టమా? ప్రేమా?
‘‘మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఇష్టమా? ప్రేమా? అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్కు మా చిత్రం చూస్తే క్లారిటీ వస్తుంది. యువతకు నచ్చే రొమాంటిక్ ఫీల్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎంటర్టైన్మెంట్ ‘మజ్ను’లో ఉంటుంది’’ అంటున్నారు దర్శకుడు విరించి వర్మ. నాని, అనూ ఇమ్మాన్యుయెల్, ప్రియాశ్రీ ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో పి.కిరణ్, గోళ్ల గీత నిర్మించిన ‘మజ్ను’ ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మా చిత్రం ట్రైలర్‌కు, గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. నాని నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ మూవీ తన కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, పోసాని, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. -
బాహుబలికి సహాయ దర్శకుడిగా నాని
వరుస సక్సెస్‌లతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని చేస్తున్న లేటెస్ట్ మూవీ మజ్ను. ఉయ్యాలా జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 17న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమాపై వినిపిస్తున్న ఓ వార్త అంచనాలను పెంచేస్తోంది. నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దర్శకధీరుడు రాజమౌళి అతిథి పాత్రలో నటించాడట. మజ్ను సినిమాలో నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నాని పనిచేసేది రాజమౌళి దగ్గరేనట. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో నాని బాహుబలి సినిమాలోని భల్లాలదేవుడి రథాన్ని తోలుతున్న స్టిల్స్ కూడా ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. మజ్ను సినిమాలో నాని రాజమౌళి దగ్గర బాహుబలి సినిమాకు సహాయ దర్శకుడిగా నటిస్తున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. -
అష్టా చమ్మా రోజులు గుర్తొచ్చాయి : హీరో నాని
‘‘విరించి వర్మ ‘ఉయ్యాలా జంపాలా’ కథను ఫస్ట్ నాకే చెప్పాడు. అప్పట్నుంచి మా స్నేహం కొనసాగుతోంది. ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో, ‘మజ్ను’ అంతకన్నా హిట్ అవుతుంది’’ అని హీరో నాని పేర్కొన్నారు. నాని, అనూ ఇమ్మాన్యుయెల్, ప్రియాశ్రీ ముఖ్య తారలుగా విరించి వర్మ దర్శకత్వంలో పి.కిరణ్, గోళ్ల గీత నిర్మించిన చిత్రం ‘మజ్ను’. గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నాని విడుదల చేసి హీరో రాజ్ తరుణ్‌కు ఇచ్చారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘దిల్’ రాజు, అనీల్ సుంకర ట్రైలర్ విడుదల చేశారు. నాని మాట్లాడుతూ-‘‘మజ్ను’ అంటే బాధలో ఉండే కథ కాదు. సమస్యల్లో ఉండే ప్రేమికులను మజ్ను అంటుంటాం. ఈ చిత్ర కథాంశం అలాంటిదే. నాకు మళ్లీ ‘అష్టా చమ్మా’ రోజులు గుర్తుకు తెచ్చిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మనం ప్రేమలో ఉన్నప్పుడు అది ఎన్ని రోజులు నిలిచి ఉంటుంది అనే కన్ఫ్యూజన్. మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఇష్టమా ప్రేమా... అనే కన్ఫ్యూజన్ కూడా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది’’ అని విరించి వర్మ చెప్పారు. ‘‘నా కెరీర్లో బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారని నాని చెప్పడం నాకు నిజంగా హ్యాపీ’’ అని గోపీ సుందర్ తెలిపారు. ఈ వేడుకలో పి.కిరణ్, గోళ్ల గీత, దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, మారుతి, హను రాఘవపూడి, కల్యాణ్ కృష్ణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మజ్ను ఆడియో వేడుకకు మెగాస్టార్
దాదాపు 10 ఏళ్లు తెలుగు వెండితెరకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన 150వ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అదే సమయంలో అభిమానులకు ఇండస్ట్రీ వర్గాలకు చేరువయ్యే ఏ అవకాశాన్ని వదులుకోవటంలేదు. గతంలో మెగా హీరోల సినిమా ఫంక్షన్లలో తప్ప పెద్దగా కనిపించని మెగాస్టార్ ఇప్పుడు ఎవరు ఏ ఫంక్షన్‌కు పిలిచినా హాజరువుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోల సినిమాల ఆడియో రిలీజ్‌లకు మెగాస్టార్ వరుసగా హజరవుతున్నారు. ఇటీవల సునీల్ హీరోగా తెరకెక్కిన జక్కన ఆడియో వేడుకలో సందడిచేసిన మెగాస్టార్, ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కిన మజ్ను ఆడియో వేడుకకూ హాజరువుతున్నాడు. ఆదివారం జరగనున్న ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి ప్రధానాక్షరణగా నిలవనున్నారు. అంతేకాదు చిరంజీవి లాంటి టాప్ హీరో చేతుల మీదుగా ఆడియో రిలీజ్ అయితే తమ సినిమాకు ప్రమోషన్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు నిర్మాతలు. నాని, అను ఇమ్మాన్యూల్ హీరో హీరోయిన్లుగా నటించిన మజ్ను సినిమాకు ఉయ్యాలా జంపాల ఫేం విరించి వర్మ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ అవుతోంది. -
ఎవరికీ ప్రేమలేఖ?
‘‘నీ కోసం ఎంత దూరమైనా నడుస్తా.. ఎన్ని సముద్రాలైనా ఈదుతా.. ఎన్ని ఆకాశాలైనా దాటుతా.. ఎందుకంటే, నిన్ను చూసిన రోజే నేను మళ్లీ పుట్టాను. ఆ రోజు నుంచి నాకు నేను కొత్తగా ఉన్నాను. నీ చిరునవ్వే నాకు ఆహారం.. నీ మాటే నాకు సంగీతం..’’ ప్రేమలేఖ రాసుకుంటూ వెళ్తున్నాడో యువకుడు. మరి, ప్రేయసి స్పందన ఏంటో? తెలుసుకోవాలంటే ‘మజ్ను’ సినిమా చూడాలి. నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో పి.కిరణ్, గీత నిర్మించిన సినిమా ‘మజ్ను’. అనూ ఇమ్మాన్యుయేల్, ప్రియాశ్రీ హీరోయిన్లు. ఈ సెప్టెంబర్ 4న ఆడియో, 16న సినిమా విడుదల చేయనున్నారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. హీరోయిన్లు ఇద్దరిలో హీరో ప్రేమలేఖ ఎవరికి రాశాడనేది ఆసక్తికరం. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపిస్తారు. అది ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు నిర్మాతలు. ‘వెన్నెల’ కిశోర్, సత్యకృష్ణ, పోసాని, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు: ప్రవీణ్ పూడి, కెమేరా: జ్ఞానశేఖర్, సంగీతం: గోపీసుందర్. -
మజ్ను ఆడియో రిలీజ్ వాయిదా
నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ మజ్ను. వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న నాని, ఈ సినిమా సక్సెస్ మీద కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆడియో టీజర్లా విడుదల చేసిన కళ్ళు మూసి అనే పాట అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ రోజు రిలీజ్ అవ్వాల్సిన మజ్ను ఆడియో రిలీజ్ వాయిదా పడింది. కారణాలను వెల్లడించకపోయినా.. ఆడియో వేడుక వాయిదా పడినట్టుగా ప్రకటించాడు హీరో నాని. అభిమానులు నిరాశపడకుండా మరో ఆడియో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టుగా తెలిపాడు. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జెమినీ కిరణ్ నిర్మిస్తున్నాడు. నాని సరసన అను ఇమ్మాన్యుల్ హీరోయిన్గా నటిస్తున్న మజ్ను సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. #Majnu audio Launch pushed by a couple of days .. A little more wait :) — Nani (@NameisNani) 25 August 2016 -
ప్రేమకథల మధ్య పోటి
సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ స్క్రీన్ మీద ఆసక్తికరమైన పోటి జరగనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కతున్న రెండు అందమైన ప్రేమకథలు వెండితెర మీద పోటి పడేందుకు రెడీ అవుతున్నాయి. ముఖాముఖి తలపడకపోయినా.. ఒక సినిమా ప్రభావం మరో సినిమా మీద ఖచ్చితంగా పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమమ్. మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరి, సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో ఘనవిజయం సాధించటంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక నాని హీరోగా తెరకెక్కుతున్న మజ్ను కూడా వారం గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఉయ్యాల జంపాల సినిమా తరువాత విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కటం, ప్రస్తుతం నాని వరుస హిట్స్‌తో మంచి ఫాంలో ఉండటంతో ఈ సినిమా పై కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల మధ్య కేవలం వారం గ్యాప్ ఉండటం, రెండు సినిమాలు దాదాపు ఒకే జానర్వి కావటంతో కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఆసక్తికరంగా మారిన ఈ పోటిలో ఎవరు గెలుస్తారో చూడాలి. -
ఆగస్టు 26న మజ్ను ఆడియో
వరుస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యువ నటుడు నాని, హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మజ్ను. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేశాడు హీరో నాని. మంగళవారం ఉదయం సినిమాలోని కళ్లు మూసి తెరిచే లోపే పాటను రిలీజ్ చేసిన నాని, ఆగస్టు 26న ఆడియో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
నాని సినిమాలో రాజ్ తరుణ్
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని మరో ఆసక్తికరమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మజ్ను సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నాని. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుండగా ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు విరించి వర్మ తొలి సినిమాలో హీరోగా నటించిన యువ నటుడు రాజ్ తరుణ్, నాని హీరోగా తెరకెక్కుతున్న మజ్ను సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే మంచు విష్ణుతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటించిన రాజ్ తరుణ్ ఇప్పుడు నానితో కలిసి నటించడానికి ఓకె చెప్పాడు. క్లైమాక్స్‌లో వచ్చే రాజ్ తరుణ్ పాత్ర సినిమాకే హైలెట్ అంటున్నారు చిత్రయూనిట్. -
'బాబాయ్.. ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ ఒకటివ్వు'
'బాబాయ్.. ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ ఒకటివ్వు' అంటూ మొదలైన 'మజ్ను' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'మజ్ను' టీజర్ శుక్రవారం మధ్యాహ్నం రిలీజైంది. ఇప్పటికే విభిన్నమైన ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న నాని టీజర్‌తో మజ్నుపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాడు. ఈ ఏడాది వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్నాడు నాని. 'ఉయ్యాల జంపాల' ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబరు నెలలో విడుదల కానుంది. ఆద్యంతం వినోదాత్మకంగా ఉండనున్న ఈ ప్రేమకథ నాని ఖాతాలో మరో హిట్ పడేలా చేయడం గ్యారెంటీ అంటున్నారు. రైల్వే స్టేషన్లో నాని.. ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ కొనుక్కోవడంతో మొదలై, బాహుబలి రథంలో ప్రేమ యుద్ధానికి వెళ్తూ ముగిసిన ఈ టీజర్‌కి యూ ట్యూబ్‌లో క్రేజీ వ్యూస్ వస్తున్నాయి. మజ్నులో నాని సరసన అను ఎమ్మానుయేల్ అనే నూతన తార హీరోయిన్గా నటిస్తుంది. #MAJNU TEASER .. Here it is :) Babai Ilayaraja sad songs CD okati ivvu 🙈#StartLoving#ThisSeptemberhttps://t.co/Bl42XUUZrH — Nani (@NameisNani) 12 August 2016 -
'ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ ఒకటివ్వు'
-
నాని నాలుగు సినిమాలు
ఈ జనరేషన్ హీరోలు ఏడాది ఒక్క సినిమా చేయడానికి కష్టపడుతుంటే ఓ యంగ్ హీరో మాత్రం ఈ ఏడాది నాలుగు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసిన ఈ హీరో మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. గతంలో అల్లరి నరేష్ ఇదే స్పీడులో సినిమాలో చేసినా వరుస ఫ్లాప్‌లతో కాస్త స్లో అయ్యాడు. సీనియర్ హీరో రవితేజ కూడా ఫాం కోల్పోవటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్లేస్‌ను నేచురల్ స్టార్ నాని తీసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, జూన్‌లో జెంటిల్మన్గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నాని, ఈ సినిమాను సెప్టెంబర్ 17న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. దిల్ రాజు నిర్మాణంలో సినిమా చూపిస్త మామా ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నేను లోకల్ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకురానున్నాడు. ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేం నవీన చంద్ర విలన్‌గా నటిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు నాని. -
మజ్నుగా నాని
వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. వరుసగా రొమాంటిక్ ఎంటర్టైనర్లతో అలరిస్తున్న ఈ యంగ్ హీరో మరోసారి అదే జానర్లో తెరకెక్కిన సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో మజ్ను సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నాని. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు నాని. చాలా కాలం తరువాత ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాని సరసన అను ఎమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న మజ్నుకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. -
నేను లోకల్ అంటున్న నాని
వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, అదే జోరులో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇటీవల విడుదలైన థ్రిల్లర్ మూవీ జెంటిల్మన్ కూడా హిట్ టాక్ తెచ్చుకోవటంతో ఇప్పుడు తదుపరి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'మజ్ను' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా సినిమా చూపిస్త మామా ఫేం త్రినాథ్ రావు దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'నేను లోకల్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. కొద్ది రోజులుగా ప్రయోగాత్మక చిత్రాలు, క్లాస్ చిత్రాలు మాత్రమే చేస్తున్న నాని, ఈ సినిమాతో మాస్ మాసాలా అవతారంలో కనిపించనున్నాడు. -
నాగ్ టైటిల్‌తో నాని
యంగ్ హీరో నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరస హిట్స్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల విడుదలైన జెంటిల్మన్ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావటంతో నెక్ట్స్ సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా కోసం ఓ ఇంట్రిస్టింగ్ టైటిల్‌ను ఫైనల్ చేశాడు. 80స్లో నాగార్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా మజ్ను. ఇప్పుడు ఇదే టైటిల్‌ను తన సినిమాకు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు నాని. అసలు మజ్ను టైటిల్‌తో చైతూ సినిమా చేయాల్సి ఉంది. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న మళయాల సూపర్ హిట్ ప్రేమమ్ రీమేక్‌కు ముందుగా మజ్ను అనే టైటిల్‌నే అనుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చైతూ కాదన్న టైటిల్ నానికి ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి. -
అది అఫీషియల్ టైటిల్ కాదట..!
మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌కు రీమేక్‌గా నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మజ్ను అనే టైటిల్‌ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ టైటిల్‌పై చిత్ర యూనిట్ పునరాలోచనలో పడ్డారు. దీంతో ఫిబ్రవరి 19న అఫీషియల్‌గా టైటిల్ ఎనౌన్స్ చేస్తామని తెలిపాడు నాగచైతన్య. నాగార్జున కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన సినిమా టైటిల్‌ను తన సినిమాకు పెడితే అంచనాలు పెరిగిపోతాయని చైతన్య భయపడుతున్నాడట. దీంతో పాటు మలయాళ ఒరిజినల్ టైటిల్ ప్రేమమ్ తెలుగు కూడా పాపులర్ కావటంతో అదే టైటిల్‌ను తెలుగులో కూడా ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరి ఫస్ట్ లుక్‌లో చైతూ ఏ టైటిల్‌ను రివీల్ చేస్తాడో చూడాలి. నాగచైతన్య సరసన శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయలని భావిస్తున్నారు. -
డిక్టేటర్ డైరెక్టర్‌తో నాగచైతన్య
యంగ్ హీరో నాగచైతన్య యమ స్పీడు మీద ఉన్నాడు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతన్య, ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ ప్రేమమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. మజ్ను పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన తదుపరి చిత్రాలను కూడా ఫైనల్ చేస్తున్నాడు. లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ ఇటీవల డిక్టేటర్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరున్న శ్రీవాస్, నాగచైతన్య హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే చైతన్యకు కథ వినిపించిన శ్రీవాస్, అతని అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు చైతు. -
'అది నేనే, కానీ ఆ సినిమాలో కాదు'
మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌తో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం మలయాళంతో పాటు ఇతర సౌత్ సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీ ప్రేమమ్ తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న మజ్ను సినిమాలో నాగ చైతన్యకు జోడిగా నటిస్తోంది. అయితే ఈ సినిమాను అనుపమ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేస్తూ కొన్ని ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోటోలపై స్పందించిన అనుపమ ఆ ఫోటోలలో ఉన్నది తానే కానీ, అది మజ్ను సినిమా షూటింగ్లో కాదంటూ క్లారిటీ ఇచ్చింది. తాను ఇంతవరకు మజ్ను షూటింగ్లో పాల్గొనలేదన్న అనుపమ, మార్చిలో తాను షూటింగ్లో పాల్గొంటున్నట్టుగా తెలిపింది. అనుపమతో పాటు శృతిహాసన్, మడోనా సెబాస్టియన్లు కూడా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. -
నాగచైతన్యతో మడోనా
భారీ వేట తరువాత నాగచైతన్యకు మూడో జోడి కుదిరింది. ప్రస్తుతం మళయాల సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌కు రీమేక్‌గా రూపొందుతున్న మజ్ను సినిమాలో నటిస్తున్నాడు చైతు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్‌లు హీరోయిన్లుగా ఫైనల్ కాగా ఇప్పుడు మరో పాత్రకు మళయాలి బ్యూటినే ఎంపిక చేశారు. ప్రేమమ్ ఒరిజినల్ వర్షన్లోనటించిన మడోనా సెబాస్టియన్‌ను, తెలుగు వర్షన్లోనూ అదే పాత్రకు ఫైనల్ చేశారు.రకుల్ ప్రీత్ సింగ్, అమైనా దస్తర్ లాంటి చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా ఫైనల్‌గా ఒరిజినల్ వర్షన్లోనటించిన మడోనాకే ఓటేశారు చిత్రయూనిట్. నాగచైతన్య మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్న ఈ సినిమాకు కార్తికేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. -
గతజన్మ స్మృతులతో..!
‘బాహుబలి’, ‘బజ్రంగీ భాయ్‌జాన్’ చిత్రాలతో ఈ ఒక్క ఏడాదే వెయ్యి కోట్ల రచయిత అనిపించుకున్నారు విజయేంద్ర ప్రసాద్. కొంత విరామం తర్వాత ఆయన ‘వల్లీ’ పేరుతో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ డైరెక్ట్ చేస్తున్నారు. నేహా హింగే, రజత్ కృష్ణ, అర్హా ముఖ్యతారలుగా రాజ్‌కుమార్ బృందావన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ గురువారం జరిగింది. ‘‘మనిషి మనసు చదవగలిగే యంత్రం కనిపెట్టడా నికి జీవితాన్ని ధారపోసే ఓ సైంటిస్ట్ కూతురు వల్లి. ఆమె తన తండ్రి లక్ష్యాన్ని సాధించా లనుకుంటుంది. ఆ క్రమంలోనే తన గురువు అశోక్ మల్హోత్రా చేసే ప్రయోగాలకు ఆధారమవు తుంది. ఫలితంగా ఆమెకు తన గత జన్మ స్మృతులు గుర్తుకు వస్తాయి. అప్పుడే తను లైలా అని తెలుస్తుంది. ఈ లైలా ప్రేమ కోసం వేయి సంవ త్సరాలుగా ఎదురుచూస్తున్న మజ్ను, ఇంకో పక్క వల్లిని ప్రేమించే యువకుడు, మరో పక్క ఆమెను ఇబ్బందిపెట్టే లెస్బియన్... మధ్య కథ నడుస్తుంది’’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. షూటింగ్ పూర్తయిందనీ, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయనీ నిర్మాత చెప్పారు. వేడుకలో రాజీవ్ కనకాల, రజత్‌కృష్ణ, అర్హాన్ తదితరులు పాల్గొన్నారు. -
మేకప్ లేకుండా నటిస్తోందట..!
సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీ శృతిహాసన్. గ్లామర్ రోల్స్‌తో పాటు ప్రయోగాత్మక పాత్రలకు కూడా సై అంటున్న ఈ బ్యూటీ, త్వరలో మరో రిస్క్ చేయనుందట. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న ఈ భామ నెక్ట్స్ సినిమాలో మేకప్ లేకుండా నటించడానికి రెడీ అవుతోంది. నాగ చైతన్య హీరోగా మళయాల సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌కు రీమేక్‌గా రూపొందుతున్న మజ్ను సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది శృతి. ఒకసారి ప్రేమలో విఫలమైన ఓ కుర్రాడు తన లెక్చరర్‌ను ప్రేమించే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్యకు లెక్చరర్‌గా నటిస్తుంది శృతిహాసన్. అందుకు తగ్గట్టుగా వయసు ఎక్కువగా కనిపించేందుకు మేకప్ లేకుండా నటించడానికి ప్లాన్ చేసుకుంటోంది. శృతిహాసన్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాకు కార్తికేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. -
అమ్మడు లెక్చరర్ , బాబు స్టూడెంట్
చెన్నై : రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలు భారీ విజయంతో జోరుమీదున్న భామ శ్రుతి హాసన్. దీంతో మరో తెలుగు సినిమా పాత్ర కోసం అపుడే కసరత్తు మొదలుపెట్టిందిట. శ్రీమంతుడు సినిమా తరువాత తెలుగులో చేస్తున్న ఈ మలయాళ రీమేక్ లో శ్రుతి... లెక్చరర్ పాత్ర పర్ఫెక్షన్ కోసం తెగ తాపత్రయపడుతోందిట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకధాటిగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' తెలుగు రీమేక్‌కి సైన్ చేసింది. 'మంజు' అనే టైటిల్ దాదాపు ఖరారైన ఈ చిత్రంలో శ్రుతి లెక్చరర్ పాత్రను పోషించబోతోంది. 'సాయి పల్లవి' అనే క్యారెక్టర్‌కు స్పెషల్ మేకోవర్ ప్లాన్ చేస్తోందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీమంతుడు తరువాత తెలుగులో చేస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌కు జోడిగా అక్కినేని నాగ చైతన్య లీడ్ రోల్లో నటిస్తున్నాడు. నాగ చైతన్య స్టూడెంట్‌గా శ్రుతి లెక్చరర్‌గా కన్పించనున్నారు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అటు మలయాళ ' ప్రేమమ్'లో సెకండ్ హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో కూడా యాక్ట్ చేస్తోంది. -
అల్లుడి కోసం ఒప్పుకున్న వెంకీ
'గోపాల గోపాల' సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్.. త్వరలోనే ఓ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మారుతి, క్రాంతి మాధవ్ లాంటి దర్శకుల చెప్పిన కథలకు ఓకె చెప్పిన వెంకీ, ఎవరు ముందుగా కథ రెడీ చేస్తే వారితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ గ్యాప్‌లో నాగచైతన్య చేస్తున్న సినిమాలో అతిథి పాత్రలో నటించనున్నాడు వెంకీ. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న చైతూ ఆ సినిమా పూర్తవ్వగానే మళయాల సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్' రీమేక్ లో నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడానికి సీనియర్ స్టార్ వెంకటేష్ అంగీకరించాడు. తన మేనల్లుడు నాగచైతన్య స్వయంగా అడగటంతో ఈ క్యారెక్టర్ చేయడానికి వెంకీ వెంటనే ఒప్పేసుకున్నాడు. ఒరిజినల్ వర్షన్లో అనంత్ నాగ్ నటించిన పాత్రలో తెలుగులో వెంకీ దర్శనమివ్వనున్నాడు. 'కార్తీకేయ' ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, దిశాపటానీ, అనుపమా పరమేశ్వరన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమమ్ తెలుగు రీమేక్‌కు మజ్ను అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. -
మజ్నుగా నాగచైతన్య
ఇండస్ట్రీలో వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు తమ సీనియర్లు చేసిన పాటలను, సినిమాలను రీమిక్స్ చేయటం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య. ఇప్పటికే ఏఎన్నార్ నటించిన పాటల రీమిక్స్లతో ఆకట్టుకున్న చైతూ ఇప్పుడు సినిమా టైటిల్ విషయంలో కూడా వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగ చైతన్య.. ఆ సినిమా తరువాత మళయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమమ్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు టైటిల్‌గా నాగార్జున హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'మజ్ను'ను ఫైనల్ చేశారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఒరిజినల్ వర్షన్లో హీరోయిన్గా నటించిన అనుపమా పరమేశ్వరన్ నాగచైతన్యతో జోడీ కడుతుంది.