
'బాబాయ్.. ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ ఒకటివ్వు'
'బాబాయ్.. ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ ఒకటివ్వు' అంటూ మొదలైన 'మజ్ను' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'మజ్ను' టీజర్ శుక్రవారం మధ్యాహ్నం రిలీజైంది. ఇప్పటికే విభిన్నమైన ఫస్ట్ లుక్తో ఆకట్టుకున్న నాని టీజర్తో మజ్నుపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాడు.
ఈ ఏడాది వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్నాడు నాని. 'ఉయ్యాల జంపాల' ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబరు నెలలో విడుదల కానుంది. ఆద్యంతం వినోదాత్మకంగా ఉండనున్న ఈ ప్రేమకథ నాని ఖాతాలో మరో హిట్ పడేలా చేయడం గ్యారెంటీ అంటున్నారు.
రైల్వే స్టేషన్లో నాని.. ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ కొనుక్కోవడంతో మొదలై, బాహుబలి రథంలో ప్రేమ యుద్ధానికి వెళ్తూ ముగిసిన ఈ టీజర్కి యూ ట్యూబ్లో క్రేజీ వ్యూస్ వస్తున్నాయి. మజ్నులో నాని సరసన అను ఎమ్మానుయేల్ అనే నూతన తార హీరోయిన్గా నటిస్తుంది.
#MAJNU TEASER .. Here it is :)
— Nani (@NameisNani) 12 August 2016
Babai Ilayaraja sad songs CD okati ivvu 🙈#StartLoving#ThisSeptemberhttps://t.co/Bl42XUUZrH