
మజ్ను ఆడియో వేడుకకు మెగాస్టార్
దాదాపు 10 ఏళ్లు తెలుగు వెండితెరకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన 150వ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అదే సమయంలో అభిమానులకు ఇండస్ట్రీ వర్గాలకు చేరువయ్యే ఏ అవకాశాన్ని వదులుకోవటంలేదు. గతంలో మెగా హీరోల సినిమా ఫంక్షన్లలో తప్ప పెద్దగా కనిపించని మెగాస్టార్ ఇప్పుడు ఎవరు ఏ ఫంక్షన్కు పిలిచినా హాజరువుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోల సినిమాల ఆడియో రిలీజ్లకు మెగాస్టార్ వరుసగా హజరవుతున్నారు.
ఇటీవల సునీల్ హీరోగా తెరకెక్కిన జక్కన ఆడియో వేడుకలో సందడిచేసిన మెగాస్టార్, ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కిన మజ్ను ఆడియో వేడుకకూ హాజరువుతున్నాడు. ఆదివారం జరగనున్న ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి ప్రధానాక్షరణగా నిలవనున్నారు. అంతేకాదు చిరంజీవి లాంటి టాప్ హీరో చేతుల మీదుగా ఆడియో రిలీజ్ అయితే తమ సినిమాకు ప్రమోషన్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు నిర్మాతలు.
నాని, అను ఇమ్మాన్యూల్ హీరో హీరోయిన్లుగా నటించిన మజ్ను సినిమాకు ఉయ్యాలా జంపాల ఫేం విరించి వర్మ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ అవుతోంది.