Chiranjeevi review on Dasara, says Nani 'killed it' with his makeover - Sakshi
Sakshi News home page

ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను.. ‘దసరా’పై చిరంజీవి రివ్యూ

Published Thu, Apr 13 2023 11:53 AM | Last Updated on Thu, Apr 13 2023 12:24 PM

Chiranjeevi Review On Dasara Movie - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని, ‘మహానటి’ కీర్తి సురేశ్‌ నటించిన తాజా చిత్రం ‘దసరా’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్‌ అదరగొట్టేశాడు. తెలంగాణ యాసలో వీళ్లిద్దరు చెప్పే డైలాగ్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక విమర్శకులు సైతం ‘దసరా’పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మేకింగ్‌పై అందరూ 


( ఫైల్‌ ఫోటో )

తాజగా మెగాస్టార్‌ చిరంజీవి ‘దసరా’టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నాని, కీర్తి సురేశ్‌ల నటనతో పాటు శ్రీకాంత్‌ ఓదెల మేకింగ్‌ చాలా బాగుందని కితాబిచ్చాడు. ‘డియర్‌ నాని.. ‘దసరా’ సినిమా చూశాను. చాగా గొప్ప సినిమా ఇది. నీ నటన చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల పనితీరు చాలా బాగుంది. అసలు ఇది శ్రీకాంత్‌ ఓదెలకు తొలి సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మా మహానటి కీర్తి సురేశ్‌ యాక్టింగ్‌ అదిరిపోయింది. దీక్షిత్‌ శెట్టి కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అదిరిపోయింది. మొత్తంగా టీమంతా కలిసి గొప్ప చిత్రాన్ని ఇచ్చారు’అని చిరంజీవి మెచ్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement