అప్పట్లో స్టార్ హీరోలు..సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేసే వారు. తర్వాత తరం వాళ్లు ఒక్కో సినిమాతో వచ్చారు. ఇప్పటిస్టార్లు మాత్రం వన్ టూ ఇయర్స్ కి ఓ సినిమా చేస్తున్నారు. అయితే కొందరు స్టార్లు మాత్రం రెండు సినిమాలతో పలకరిస్తున్నారు. వీళ్ల దారిలోనే ఇతర హీరోలు ప్రయాణం చేస్తున్నారు. ఇంతకీ పన్నెండు నెలల్లో టూ మూవీస్‌తో థియేటర్లలో సందడి చేస్తున్న ఆ హీరోలు ఎవరు?
చిరంజీవి
ఎందరు హీరోలు వచ్చినా..టాలీవుడ్ మెగాస్టార్ స్థానం చెక్కు చెదరనిది. తనంటే ఏంటో ఎప్పుడూ నిరూపిస్తునే ఉన్నాడు. ఖైదీ నంబర్ 150 రీ ఎంట్రీ మూవీ తర్వాత ఏడాదికి సైరా నరసింహా రెడ్డి మూవీతో వచ్చాడు. ఇక 2022 లో ఈయన నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆచార్య మూవీతో పాటు, గాడ్ ఫాదర్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించాడు చిరు. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్యతో థియేటర్లలో సందడి చేశాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన మ్యాటర్ తెలిసిందే. ఆగస్ట్ నెలలో మరో సినిమా భోళా శంకర్ విడుదల కాబోతుంది. అలాగే వచ్చే ఏడాది రిలీజ్ అయే సినిమాల దర్శకులను కూడా లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు.
రవితేజ
రవితేజ హిట్లు ప్లాపులతో సంబందం లేకుండా దూసుకుపోతున్నాడు. వరసగా సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. 2022లో మాస్ మహారాజ నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఇయర్ వాల్తేరు వీరయ్యతో పలకరించి, రావణాసురగా మెప్పించే ప్రయత్నం చేసాడు. రావణాసురతో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. రావణాసుర తర్వాత ఈ ఇయర్ మాస్ మహారాజ నటించిన మరో సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. స్టూవర్ట్ పురం గజదొంగ నాగేశ్వర రావు జీవిత కథతో టైగర్ నాగేశ్వరరావు రూపొందుతోంది. ఈ మూవీలో నాగేశ్వరరావుగా యాక్ట్ చేస్తున్న మ్యాటర్ తెలిసిందే. వంశీ దర్శకత్వం చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. ఈ మూవీతో రవితేజ నటించిన మూడో సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కాబోతుంది.
ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మితభాషి. సినిమాల ఈవెంట్లలో కూడా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే అభిమానులను తన సినిమాలతో సంతృప్తి పరచాలని నిర్ణయం తీసుకున్నాడు. సంవత్సరానికి రెండు సినిమాలతో మీ ముందుకు వస్తాను అని ఫ్యాన్స్‌కు మాట కూడా ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే.. వరసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అది కూడా పాన్ ఇండియా మూవీస్‌కు సైన్ చేస్తున్నాడు.
గత ఏడాది వరకు రెబల్ స్టార్ నటించిన ఒక్కో సినిమానే విడుదల అవుతూ వచ్చింది. ఈ ఏడాది నుంచి డార్లింగ్ స్టైల్ మార్చాడు. సంవత్సరానికి రెండు సినిమాలతో ఆకట్టుకుంటుంటున్నాడు. రీసెంట్ గా పాన్ ఇండియా మూవీ ఆది పురుష్‌తో థియేటర్లలోకి వచ్చాడు ప్రభాస్. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన సలార్ మూవీ సెప్టెంబర్ 28 న థియేటర్లలోకి రాబోతుంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి పాన్ వరల్డ్ మూవీని ఫిక్స్ చేసాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కేతో టాకీస్‌లోకి రాబోతున్నాడు. అదే ఏడాది మరో సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రాజా డీలక్స్‌తో రాబోతున్నాడు.
నాని
2021 లో నాచురల్ స్టార్ నాని నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత యేడు కూడా టూ మూవీస్‌తో వచ్చాడు నాచురల్ స్టార్. ఇక ఈ ఇయర్ రిలీజ్ అయిన దసరా మూవీతో మొదటి సారి వందకోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. నెక్స్ట్ కెరీర్‌లో 30వ సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు.
విశ్వక్ సేన్
మీడియం రేంజ్ బడ్జెట్లో ఆకట్టుకునే సబ్జెక్టులతో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు విశ్వక్ సేన్. పైగా ఇతర కుర్ర హీరోలకు లేని దర్శకత్వం అనే క్వాలిఫికేషన్ విశ్వక్ సొంతం. ఈ ఇయర్ దాస్ కా ధమ్కీ రిలీజ్ అయింది. విశ్వక్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే బూ అనే హర్రర్ మూవీ లో కూడా ఓ పాత్రలో కనిపించాడు. డైరెక్ట్‌గా ఓటీటీలోకే ఈ చిత్రం వచ్చింది. ఇక గామీ అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. తొందర్లోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు.
నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి-మిస్టర్ పొలిశెట్టి మూవీ ఆగస్ట్ 4 న థియేటర్లలోకి రాబోతుంది. అలాగే మరో మూవీ అనగనగా ఒక రాజు షూటింగ్ చివరి దశలో ఉంది. నాగ శౌర్య ఈ ఇయర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి,రంగబలి లాంటి రెండు సినిమాలతో థియేటర్లలోకి వచ్చాడు. మరోపక్క కుర్ర హీరోలు సంతోష్ శోభన్, కిరణ్ అబ్బవరంతో పాటు మరికొంతమంది హీరోలు కూడా ఏడాదికి రెండు చిత్రాలకు పైగా విడుదల చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment