మజ్నుగా నాగచైతన్య | Nagachaithanya premam remake title majnu | Sakshi
Sakshi News home page

మజ్నుగా నాగచైతన్య

Published Thu, Sep 24 2015 11:29 AM | Last Updated on Wed, Aug 29 2018 5:43 PM

మజ్నుగా నాగచైతన్య - Sakshi

మజ్నుగా నాగచైతన్య

ఇండస్ట్రీలో వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు తమ సీనియర్లు చేసిన పాటలను, సినిమాలను రీమిక్స్ చేయటం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య. ఇప్పటికే ఏఎన్నార్ నటించిన పాటల రీమిక్స్లతో ఆకట్టుకున్న చైతూ ఇప్పుడు సినిమా టైటిల్ విషయంలో కూడా వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు.

ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగ చైతన్య.. ఆ సినిమా తరువాత మళయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమమ్లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు టైటిల్గా నాగార్జున హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'మజ్ను'ను ఫైనల్ చేశారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఒరిజినల్ వర్షన్లో హీరోయిన్గా నటించిన అనుపమా పరమేశ్వరన్ నాగచైతన్యతో జోడీ కడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement