అది అఫీషియల్ టైటిల్ కాదట..! | Majnu Is Not Official Title for Premam Remake | Sakshi
Sakshi News home page

అది అఫీషియల్ టైటిల్ కాదట..!

Published Thu, Feb 18 2016 12:57 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

అది అఫీషియల్ టైటిల్ కాదట..! - Sakshi

అది అఫీషియల్ టైటిల్ కాదట..!

మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్కు రీమేక్గా నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మజ్ను అనే టైటిల్ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ టైటిల్పై చిత్ర యూనిట్ పునరాలోచనలో పడ్డారు. దీంతో ఫిబ్రవరి 19న అఫీషియల్గా టైటిల్ ఎనౌన్స్ చేస్తామని తెలిపాడు నాగచైతన్య.

నాగార్జున కెరీర్లో బిగెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచిన సినిమా టైటిల్ను తన సినిమాకు పెడితే అంచనాలు పెరిగిపోతాయని చైతన్య భయపడుతున్నాడట. దీంతో పాటు మలయాళ ఒరిజినల్ టైటిల్ ప్రేమమ్ తెలుగు కూడా పాపులర్ కావటంతో అదే టైటిల్ను తెలుగులో కూడా ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరి ఫస్ట్ లుక్లో చైతూ ఏ టైటిల్ను రివీల్ చేస్తాడో చూడాలి. నాగచైతన్య సరసన శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement