హిట్ హీరోతో శ్రీనువైట్ల | Nagachaitanya movie with srinu vaitla | Sakshi
Sakshi News home page

హిట్ హీరోతో శ్రీనువైట్ల

Published Sat, Oct 15 2016 3:19 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

హిట్ హీరోతో శ్రీనువైట్ల - Sakshi

హిట్ హీరోతో శ్రీనువైట్ల

ఆగడు, బ్రూస్ లీ సినిమాల రిజల్ట్ తో కష్టాల్లో పడ్డ శ్రీనువైట్ల, తిరిగి ఫాంలోకి రావడానికి అన్నిరకాలుగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలు బిజీగా ఉండటంతో యంగ్ హీరోతో వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా మిస్టర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీను. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. ఓ సూపర్ హిట్ సినిమాతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య హీరోగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు శ్రీనువైట్ల. ఇప్పటికే నాగచైతన్య, నాగార్జునలకు కథ వినిపించి ఓకె కూడా చేయించుకున్నాడు. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న చైతూ త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement