ప్రేమకథల మధ్య పోటి
ప్రేమకథల మధ్య పోటి
Published Wed, Aug 24 2016 8:28 AM | Last Updated on Wed, Aug 29 2018 5:43 PM
సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ స్క్రీన్ మీద ఆసక్తికరమైన పోటి జరగనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కతున్న రెండు అందమైన ప్రేమకథలు వెండితెర మీద పోటి పడేందుకు రెడీ అవుతున్నాయి. ముఖాముఖి తలపడకపోయినా.. ఒక సినిమా ప్రభావం మరో సినిమా మీద ఖచ్చితంగా పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమమ్. మలయాళ సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరి, సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో ఘనవిజయం సాధించటంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక నాని హీరోగా తెరకెక్కుతున్న మజ్ను కూడా వారం గ్యాప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఉయ్యాల జంపాల సినిమా తరువాత విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కటం, ప్రస్తుతం నాని వరుస హిట్స్తో మంచి ఫాంలో ఉండటంతో ఈ సినిమా పై కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల మధ్య కేవలం వారం గ్యాప్ ఉండటం, రెండు సినిమాలు దాదాపు ఒకే జానర్వి కావటంతో కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఆసక్తికరంగా మారిన ఈ పోటిలో ఎవరు గెలుస్తారో చూడాలి.
Advertisement
Advertisement