డిక్టేటర్ డైరెక్టర్తో నాగచైతన్య | naga chaitanya to work with dictator director | Sakshi
Sakshi News home page

డిక్టేటర్ డైరెక్టర్తో నాగచైతన్య

Published Thu, Feb 18 2016 11:11 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

డిక్టేటర్ డైరెక్టర్తో నాగచైతన్య

డిక్టేటర్ డైరెక్టర్తో నాగచైతన్య

యంగ్ హీరో నాగచైతన్య యమ స్పీడు మీద ఉన్నాడు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతన్య, ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ ప్రేమమ్ రీమేక్లో నటిస్తున్నాడు. మజ్ను పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన తదుపరి చిత్రాలను కూడా ఫైనల్ చేస్తున్నాడు.

లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ ఇటీవల డిక్టేటర్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. కమర్షియల్ డైరెక్టర్గా మంచి పేరున్న శ్రీవాస్, నాగచైతన్య హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే చైతన్యకు కథ వినిపించిన శ్రీవాస్, అతని అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు చైతు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement