బిజీ బిజీగా నాని | Nani looking for yet another hit | Sakshi
Sakshi News home page

బిజీ బిజీగా నాని

Published Mon, Sep 19 2016 5:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

బిజీ బిజీగా నాని

బిజీ బిజీగా నాని

సెప్టెంబరు 23వ తేదీన 'మజ్ను'గా థియేటర్లకు రాబోతున్న నాని.. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఏడాదిన్నరగా వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న నాని.. తాజా చిత్రం 'మజ్ను' కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 'ఉయ్యాల జంపాల' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫీల్ గుడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా అలరించనుంది. నాని మార్క్ సెన్సిబుల్ కామెడీ హైలైట్ కానుంది.  

మరోపక్క నాని తదుపరి చిత్రం 'నేను లోకల్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబరులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement