Nenu Local
-
‘జెర్సీ’లో నానికి జోడిగా!
యంగ్ హీరోనాని ప్రస్తుతం సీనియర్ హీరో నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మల్టీస్టారర్ తరువాత దఓ పీరియాడిక్ డ్రామాలో నటించేందుకు అంగీకించాడు నాని. జెర్సీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు. 90లలో క్రికెటర్‌గా ఎదిగేందుకు ఓ యువకుడు పడిన కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నానికి జోడిగా కీర్తి సురేష్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. గతంలో నాని, కీర్తి సురేష్‌లు నేను లోకల్ సినిమాలో కలిసి నటించారు. ఇటీవల మహానటి సినిమాకు ఘనవిజయాన్ని అందుకున్న కీర్తి వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్నారు. మరి ఇంత బిజీలో నాని సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తారో లేదో చూడాలి. -
లోకల్ టచ్‌తో సినిమా..
అనకాపల్లి: గణితం సబ్జెక్ట్‌పై ఆసక్తి కాబోలు.. జీవితంలో ఎక్కడా లెక్క తప్పకుండా అడుగులేస్తున్నారు.. మేం వయసుకు వచ్చాం అం టూ పరిచయం చేసుకని.. ప్రియతమా నీవచట కుశలమా అంటూ పలకరించినా.. సినిమా చూపిస్త మావ అంటూ కడుపుబ్బా నవ్వించారు. సినిమాల్లో అగణితమైన పరిధిని పెంచుకున్నారు. అరుదుగా వచ్చిన అవకాశాలు అంది పుచ్చుకుంటూ ఒక్కో మెట్టూ ఎక్కసాగారు. పదిహేడేళ్ల క్రితం భాగ్యనగరానికెళ్లిన మన అనకాపల్లి మనువడు పొట్నూరు గ్రామస్తుడు..నక్కిన త్రినాథ్ సంక్రాంతి సందర్భంగా అమ్మమ్మ ఇంటికొచ్చి మనతో మాట్లాడారు. సందర్భానుసారంగా లోకల్ టచ్‌ను జోడిస్తూ తన దైన శైలిలో ‘నేను లోకల్’తో ముందుకొచ్చారు. పట్టణంలోని మిత్రుడు మళ్ల సురేంద్రతో పాటు తన బంధువైన ఉపాధ్యాయుడు శీలా జగన్నాథరావు ఇంట్లో ‘సాక్షి’తో మన లోకల్ త్రినాథ్ ముచ్చట్లు.. సాక్షి: సినిమా రంగంలో మీ అరంగ్రేట్ర ఎప్పుడు? త్రినాథ్: డీవీఎన్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడే నేను వేసిన నాటకంలోని నూకరాజు పాత్రకు మా కళాశాల ప్రిన్సిపాల్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. నువ్వు సినిమా రంగంలోకి వెళ్తే మంచి స్థాయికొస్తావ్ అంటూ ఆయన అనడంతో 2000లో హైదరాబాద్‌కు వెళ్లాను. పదేళ్లపాటు ఎన్నో కష్టాలు పడి బీఎస్సీ మేథ్స్ చదివి ట్యూషన్ చెబుతూ 2012లో మొదటిసారిగా ‘మేం వయసుకు వచ్చాం ’సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాను. సాక్షి: దర్శకునిగా ప్రస్థానం? త్రినాథ్: మొదటి సినిమా తర్వాత వరుణ్‌సందేశ్‌తో ‘ప్రియతమా నీవచట కుశలమా’, ‘నువ్వలా నేనిలా ’సినిమాలకు దర్శకత్వం వహించాను. ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మావ ’కు మంచి గుర్తింపు రావడంతో నాని హీరోగా ‘నేను లోకల్’కు దర్శకత్వం వహిం చాను. ఇది నాకు స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. సాక్షి: ‘నేను లోకల్ ’హిట్ తర్వాత మీకు అత్యంత ఆనందం కలిగించిన ప్రశంస ఏది? త్రినాథ్: ఆ సినిమాను చూసాక రాఘవేంద్రరావుగారు నాకు ఫోన్ చేసి చాలా బాగుందని ప్రశంసించారు. ఈ ఒక్క ప్రశంస నాకు చాలా ప్రోత్సాహాన్నిచ్చింది. సాక్షి: అనకాపల్లితో సినీ పరిశ్రమకున్న అనుబంధంపై మీ వ్యాఖ్య..? త్రినాథ్: ఇక్కడి కళాకారులు ఎందరో సినిమా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నేను ‘పెళ్లిసందడి ’సినిమాను స్థానికంగా ఉన్న ఓ థియేటర్లో చూశాను. ఆ సినిమాలో ఎందరో ప్రఖ్యాత కమీడియన్లు పండించిన హాస్యం అందరినీ మైమరిపించింది. నాకూ అనుబంధం ఉన్నందుకు ఆనదంగా ఉంది. సాక్షి: మీ భవిష్యత్ ప్రణాళికలేమిటి...? త్రినాథ్: ప్రస్తుతానికి ఐదు సినిమాలు చేశాను. మంచి దర్శకునిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది అభిలాష. అలాగని పెద్దహీరోలతో చేయాలని కాదు. మంచి కథలు అందించాలి. త్వరలో దిల్‌రాజు నిర్మాణంలో రామ్ హీరోగా మార్చిలో ఓ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మెగా ఫ్యామిలీ నుంచి ఒకరు సినిమాకు దర్శకత్వం చేయమని అడిగారు. -
దర్శకత్వ బాటలో మరో సినిమాటోగ్రాఫర్
సినీరంగంలో సాంకేతిక నిపుణులుగా ప్రూవ్ చేసుకున్న చాలా మంది.. దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్లుగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నవారు దర్శకులుగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే సంతోష్ శివన్, తేజ, రసూల్ ఎల్లోర్, గోపాల్ రెడ్డి లాంటి వారు దర్శకులుగానూ సత్తా చాటారు. అదే బాటలో మరో యువ సినిమాటోగ్రాఫర్, దర్శకుడిగా మారబోతున్నాడు. భలే భలే మొగాడివోయ్, నేను లోకల్, మహానుభావుడు సినిమాలకు సినిమాటోగ్రఫి అందించిన నిజార్ షఫీ, త్వరలో ఓ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. తన తొలి ప్రయత్నానికి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు నిజార్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరెకెక్కనున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించనున్నారు. అంజలి, అనీషా ఆంబ్రోస్, శ్రద్ధ శ్రీనాథ్, నందిత శ్వేతలు కీలక పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు. -
మరోసారి దేవీకే ఫిక్స్ అయ్యారు..!
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ ఉన్న సంగీత దర్శకుల్లో దేవీ శ్రీ ప్రసాద్ ఒకడు. ఎక్కువగా స్టార్ హీరోల చిత్రాలకే సంగీతం అందించే దేవీ శ్రీ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో తీసుకుంటాడు. అందుకే మీడియం రేంజ్ చిత్రాలకు కూడా ఈ మ్యూజిక్ సెన్సేషన్ అందుబాటులో ఉండడు. అయితే ఇటీవల ఈ యువ సంగీత తరంగం మీడియం బడ్జెట్‌తో నాని హీరోగా తెరకెక్కిన నేను లోకల్ సినిమాకు సంగీతం అందించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. దీంతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దిల్ రాజు బ్యానర్లో నాని హీరోగా ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరాం దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు కూడా దేవీ శ్రీతో మ్యూజిక్ చేయించాలని నిర్ణయించాడు దిల్ రాజు. రెమ్యూనరేషన్ కూడా దేవీ కోరినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. దేవీ లాంటి సంగీత దర్శకుడు ఉంటే సినిమా మ్యూజిక్ తోనే సగం సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. మరి ఈ లోకల్ టీం మరోసారి సక్సెస్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి. -
ఫస్ట్ లుక్కే ఫుల్ మార్క్స్
యంగ్ హీరో నాని ఇప్పుడు ఫుల్ ఫాం లో ఉన్నాడు. మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా.. తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ తోనే వరుస సక్సెస్ లు సాధిస్తున్నాడు. అదే సమయంలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ లతో సత్తా చాటిన నాని, తన నెక్ట్స్ సినిమాను కూడా వేగంగా రెడీ చేస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సినిమాలో నాని హీరోగా నటిస్తున్నాడు. నేను లోకల్ రిలీజ్‌కు ముందే ప్రారంభమైన ఈ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ లను గురువారం రిలీజ్ చేశాడు. నాని ట్విట్టర్ ద్వారా రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్‌తో మరోసారి ఫుల్ మార్క్స్ కొట్టేశాడు నాని. 'నిన్ను కోరి' అనే టైటిల్‌తో పాటు నాని లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Vizag nunchi USA varaku. Chinna pillalanunchi pedha valla varaku. Lovers nunchi pellainavalla varaku.#NinnuKori#letsWelcomeLife 😊 pic.twitter.com/vHWbi26jKB — Nani (@NameisNani) 23 February 2017 -
స్పీడు పెంచుతున్న దిల్ రాజు
ఈ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మళ్లీ స్పీడు పెంచుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసిన దిల్ రాజు, ప్రతీ నెలా ఒక సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. జనవరిలో శతమానంభవతి, ఫిబ్రవరిలో నేనులోకల్ సినిమాలను రిలీజ్ చేసిన రాజు, మార్చిలో వెల్లిపోమాకే, ఏప్రిల్ లో చెలియా సినిమాల రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. మే నెలలో భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. వీటితో పాటు ఇప్పటికే రవితేజ, రాజ్ తరుణ్ లు హీరోలుగా సినిమాలు ప్రారంభించిన దిల్ రాజు, సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. నిర్మాతగానే కాక, డిస్ట్రిబ్యూటర్ గానూ మరిన్ని చిత్రాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. -
పవన్ పక్కకు చేరిన నాని
డబుల్ హ్యాట్రిక్ హిట్స్‌తో టాలీవుడ్లో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని. తాజాగా నేనులోకల్ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న నాని.. ఓవర్ సీస్ మార్కెట్లో సత్తా చాటుతున్నాడు. తెలుగు మార్కెట్లో ఫాం చూపిస్తున్న ఈ యంగ్ హీరో ఓవర్సీస్లో మాత్రం టాప్ హీరోలకే చెమటలు పట్టిస్తున్నాడు. ఓవర్ సీస్ మార్కెట్లో అత్యధిక సార్లు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోల లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచాడు నాని. ఆరు మిలియన్ డాలర్ల సినిమా(దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనోక్కడినే, ఆగడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం)లతో మహేష్ బాబు మొదటి స్థానంలో ఉండగా.. నాలుగు సినిమా(బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్)లతో ఎన్టీఆర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత స్థానంలో మూడు సినిమా(అత్తారింటికి దారేది, గోపాల గోపాల, సర్థార్ గబ్బర్‌సింగ్)లతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నేనులోకల్ సినిమాతో మూడోసారి వన్ మిలియన్ మార్క్‌ను దాటి, నాని కూడా పవన్ సరసన చేరాడు. ఈగ సినిమాతో మిలియన్ డాలర్ క్లబ్లో అడుగు పెట్టిన నాని, తరువాత భలే భలే మొగాడివోయ్, నేనులోకల్ సినిమాలతో మరో రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు. -
'నేనులోకల్' మూవీ రివ్యూ
టైటిల్ : నేనులోకల్ జానర్ : యాక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తారాగణం : నాని, కీర్తి సురేష్, నవీన్ చంద్ర, సచిన్ కేడ్కర్ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : త్రినాథ్ రావు నక్కిన నిర్మాత : దిల్ రాజు వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ నేనులోకల్. పక్కా యూత్ ఫుల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు సినిమా చూపిస్త మామ ఫేం త్రినాథ్ రావు నక్కిన దర్శకుడు. నేను శైలజ సినిమాతో లక్కీ బ్యూటి అనిపించుకున్న కీర్తి సురేష్ నటించిన నేనులోకల్, నాని సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేసిందా..? సంక్రాంతి బరిలో బిగ్ హిట్ కొట్టిన దిల్ రాజు మరోసారి కొత్త సంవత్సరంలో రెండో విజయం సాధించాడా..? కథ : బాబు (నాని) ఇంజనీరింగ్ పాస్ కావడానికి కష్టాలు పడుతుంటాడు. అన్ని ఎగ్జామ్స్ సప్లిమెంటరీలో రాయడం చూడలేక.. ఎగ్జామ్ హాల్లో బాబును బరించలేక ఇన్విజిలేటర్ (సచిన్ ఖేడ్కర్) ఇక ఎగ్జామ్ హాల్ లోకి, తన జీవితంలోకి రావొద్దని స్వయంగా స్లిప్ ఇచ్చి మరి బాబును పాస్ చేయిస్తాడు. అలా ఇంజనీరింగ్ పాస్ అయిన బాబును అందరూ నెక్ట్స్ ఏంటి అన్న ప్రశ్నతో ఇబ్బంది పెడతారు. అదే సమయంలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటనలో బాబు, కీర్తి( కీర్తీ సురేష్)ని కలుస్తాడు. అప్పుడు ఫిక్స్ అవుతాడు నెక్ట్స్ కీర్తిని లవ్ చేయాలని. కానీ ఏ ఇన్విజిలేటర్ అయితే ఇక నా జీవితంలోకి రావొద్దని చెబుతాడో.. అతని కూతురే కీర్తి. చిన్నప్పటి నుంచి తను ఏది కోరుకుంటే అది తెచ్చి ఇచ్చిన తండ్రి కోసం.. తను ఎవరిని చూపిస్తే వారినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది కీర్తి. కానీ అంత బలంగా నిర్ణయం తీసుకున్న కీర్తిని కూడా తన అల్లరితో లవ్ లో పడేస్తాడు బాబు. తెల్లవారితే కీర్తి, బాబుకు తన కూడా ప్రేమిస్తుందన్న విషయం చెపుతుందనుకుంటున్న సమయంలో ఈ ప్రేమకథ మలుపు తిరుగుతుంది. వారి ప్రేమకు మరో సమస్య ఎదురవుతుంది. బాబు, కీర్తిల ప్రేమకథకు ఎదురైన ఆ సమస్య ఏంటి..? కీర్తి వాళ్ల నాన్నను బాబు తమ పెళ్లికి ఒప్పించాడా..? నటీనటులు : తనకు బాగా అలవాటైన పాత్రలో నాని మరోసారి తన విశ్వరూపం చూపించాడు. అల్లరి అబ్బాయిగా, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలకు తెగించే ప్రేమికుడిగా అద్భుతంగా నటించాడు. రొటీన్ ట్రయాంగులర్ లవ్ స్టోరినే తన నటనతో పీక్స్‌కు తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ తోనే ఆకట్టుకున్న నాని ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించే ప్రయత్నం చేశాడు. (చూడండి: ‘నేను లోకల్’ ఎర్లీ రివ్యూ..!) నేను శైలజ తరువాత మరోసారి తెలుగు తెర మీద కనిపించిన కీర్తి సురేష్ హుందాగా కనిపించింది. చబ్బి లుక్స్‌లో అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. నటుడిగా నానికి మంచి పోటి ఇచ్చాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో సచిన్ కేడ్కర్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. తెలుగులో ఎక్కువగా నెగెటివ్ రోల్స్ మాత్రమే చేసిన సచిన్ బాద్యత గల తండ్రి పాత్రలో నటించటం కొత్తగా అనిపించింది. సాంకేతిక నిపుణులు : సినిమా చూపిస్త మామ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న త్రినాథ్ రావు నక్కిన మరోసారి అదే తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎలాంటి బాద్యత లేని ఓ కుర్రాడు తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్న కథే మరోసారి తెరకెక్కించినా.. ఈ సారి మరింత ఎంటర్టైనింగ్గా చూపించటంలో సక్సెస్ అయ్యాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్లకు తన మ్యూజిక్‌తో మరింత జోష్ తీసుకువచ్చే దేవీ శ్రీ ప్రసాద్ నేనులోకల్లోనూ తన మార్క్ చూపించాడు. మాస్ బీట్స్‌తో పాటు రొమాంటిక్ మెలోడీస్‌తో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ అందించాడు. దేవీ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. సినిమా మేకింగ్‌లో పర్ఫెక్ట్గా ఉండే దిల్ రాజు మరోసారి తన లెక్క తప్పదని ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్‌గా తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాని పర్ఫామెన్స్ కామెడీ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : రొటీన్ క్యారెక్టరైజేషన్స్ సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ఓవరాల్‌గా నేనులోకల్ రొటీన్ యూత్ ఫుల్ లవ్ స్టోరినే అయినా.. పక్కా టైం పాస్ ఎంటర్టైనర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
‘నేను లోకల్’ ఎర్లీ రివ్యూ..!
నేచురల్ స్టార్ నాని, బబ్లీ బ్యూటీ కీర్తి సురేశ్ జంటగా.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ’నేను లోకల్’.. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానీ హీరోగా వస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులను పలుకరించింది. భారీ అంచనాలతో దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్‌గా రూపొందిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో సినీ ప్రేమికుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. నాని ఒక్కడే వన్ మ్యాన్ షోతో సినిమాను నడిపించాడని, అయినా నాని యాక్టింగ్, కామెడీ సీన్లు సినిమాలో పండాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటిలాగే కీర్తి సురేష్ అందంగా ఆకట్టుకునేలా ఉందని చెప్తున్నారు. ’నేను లోకల్’ సినిమాపై ట్విట్టర్లో వెలువడిన పలు ఎర్లీ ఒపీనియన్స్ ఇవి. #NenuLocal, Feelings are refilled. What an impressive action of both nani and keerthi — balaji.jayamangala (@balajijayamanga) 3 February 2017 Amazing performance brother👌👌 @NameisNani just loved the way you portrayed your character....Congrats!! Keep rocking👍#Nenulocal Hit cenima — Innocent boy (@akhil_katakam) 3 February 2017 "mee ammayi pelli ayyaka 'happy' ga undala 'luxury' ga undala..."...this is my favorite dialogue in the movie #NenuLocal 👌👌👌 — iShravan (@shravanonline) 3 February 2017 Good 1st Half.@NameisNani Acting nd Few Comedy Scenes 👌Next enti nd Champesave nannu 👌 Keerthy 😍Interval Bang#NenuLocal 😊 @KeerthyOfficial — Kalyan.Dhanush Freak (@JaiPalReddy521) 3 February 2017 Done 1st half #NenuLocal ... Fantastic @NameisNani bro...@KeerthyOfficial looks superb.. — UdayReddy Gadiko (@udayreddy14) 3 February 2017 Another entertaining movie into NAni box #NenuLocal — Vaidya Sai Charan (@charan7sai) 3 February 2017 #NenuLocal: Nani does a Ravi Teja act. 'Idiot' formula has been rehashed. New 'coating' to old scenes! Timepass flick if u don't expect much — Jalapathy Gudelli (@JalapathyG) 3 February 2017 మరోవైపు సినీ ప్రముఖుల నుంచి కూడా నానికి, నేను లోకల్ చిత్రయూనిట్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఒక అమ్మాయి తెల్లవారు జామున నాలుగింటికి లేచి చదువుతోందంటే అది మార్చి అని అర్థం, అదే ఒక అబ్బాయి తెల్లవారు జామున నాలుగింటికి లేచి చదువుతున్నాడంటే అది సెప్టెంబర్’ అని అర్థం అంటూ సహజమైన నటనతో నాని ఇప్పటికే ట్రైలర్లో అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. బుద్ధిమంతుడులా అమ్మానాన్నల కోసం కాలేజీకి వెళతానంటూనే.. ఎంబీఏ చదువుతా అమ్మాయిని ఫాలో అవుతానంటూ వాళ్లకి పంచ్ వేస్తాడు. హీరోయిన్ను ఫాలో అవుతూ ఆమెను డిస్ట్రబ్ చేస్తూ ఆమె తండ్రితో వీడు జండూబామ్కి తలనొప్పి రప్పించే రకంగా ఉన్నాడంటూ.. నాని తన నటనతో ట్రైలర్లో హల్చల్ చేశాడు. -
భవిష్యత్తులో వాళ్లే స్టార్స్
‘‘పదేళ్ల తర్వాత సూపర్‌స్టార్ అంటే కంటెంటే. దాన్ని మించిన స్టార్డమ్ ఉండదు. అప్పుడు థియేటర్‌కి వెళ్లి బ్యానర్లు కట్టి, దండలు వేద్దామనే ప్రేక్షకులు ఉండరు. ఏ సినిమాలో దమ్ముంది? ఎందులో కంటెంట్ ఉంది? అనే ఆలోచిస్తారు. కంటెంట్‌ని నమ్ముకున్నోళ్లే భవిష్యత్తులో స్టార్స్. ఆల్రెడీ ఈ మార్పు మొదలైంది. దీనికి కారణం ప్రేక్షకులే. గతేడాది డిఫరెంట్ సినిమాలను ఆదరించి, రెగ్యులర్ సినిమాలను తిరస్కరించారు’’ అని హీరో నాని అన్నారు. నాని, కీర్తీ సురేశ్ జంటగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ‘నేను లోకల్’ ఫిబ్రవరి 3న విడుదలవుతోంది. నాని చెప్పిన సంగతులు... ► ‘దిల్’ రాజుగారితో ఎప్పుడో సినిమా చేయాలి. ఆయన నా దగ్గరకి పంపినన్ని కథలు ఇంకెవరికీ పంపలేదనుకుంటా. ఈ కథ వినగానే రాజుగారితో, మన వెయిటింగ్‌కి ఎండ్ కార్డ్ పడిందని చెప్పా. పాప్‌కార్న్ తింటూ ఫ్రెండ్స్‌తో నవ్వుతూ చూసే మెయిన్ స్ట్రీమ్ సినిమా–‘నేను లోకల్’. ఇందులో బోలెడంత ప్రేమకథ, మంచి పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. వేరే హీరోలు ఇలాంటి సినిమాలు చేశారు. నేను చేయలేదు. నాకు డిఫరెంట్ సినిమా ఇది. ► నా చిన్ని చిన్ని కోరికలను సినిమాల్లో తీర్చుకుంటున్నా. ఓసారి లెక్చరర్ అయితే ఎలా ఉంటుందనే కోరికను ‘మజ్ను’తో తీర్చుకున్నా. విలన్‌గా ‘జెంటిల్మన్’లో చూసుకున్నా. మళ్లీ స్టూడెంట్ అయితే? ఎలా ఉంటుందనుకునే టైమ్‌లో ‘నేను లోకల్’ వచ్చింది. ఇందులో బీటెక్ స్టూడెంట్ బాబుగాడిగా నటించా. ఏం అనిపిస్తే అది మాట్లాడేసే టైపు. వాడి ఫ్యామిలీ ప్రవర్తన కూడా విచిత్రమే. ఈ క్యారెక్టర్స్ వల్ల మంచి కామెడీ క్రియేట్ అయింది. ► లైఫ్‌లో మన ఎక్స్పీరియన్స్ నుంచే పాత్రలు వస్తాయి. నేను ఏ పాత్ర చేసినా ప్రత్యేకంగా హోమ్‌వర్క్ చేయను. నాకలాంటి సందర్భం ఎదురైతే ఏం చేస్తానో ఊహించి, నటిస్తా. ఈ సినిమా విషయానికి వస్తే... నేనే లోకల్. నేను పెరిగిదంతా అమీర్‌పేట్, బల్కంపేట్ ఏరియాల్లోనే. ► ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, సచిన్ ఖేడేకర్, కీర్తీ సురేశ్... మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు ఉండడంతో సెట్స్‌లో దిద్దిన మెరుగులు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇలాంటి కామెడీ సినిమాలకు సెట్స్‌లో జరిగే చిన్న చిన్న మ్యాజిక్స్ ప్రేక్షకులకి భలే కనెక్ట్ అవుతాయి. ‘అష్టా చమ్మా’, ‘అలా మొదలైంది’, ‘భలే భలే మగాడివోయ్’లకు అదే జరిగింది. త్రినాథరావు దర్శకత్వం, ప్రసన్న మాటలూ బాగా కుదిరాయి. దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలు ఇచ్చాడు. ► ఈ సినిమాని హైదరాబాద్‌లో మెయిన్ థియేటర్లో చూడాలనుకున్నా. కానీ, శివ నిర్వాణ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా కోసం అమెరికా వెళ్తున్నా. ఫిబ్రవరి 2న అక్కడ ప్రీమియర్స్‌కి హాజరవుతా. ► సెట్లో మిమ్మల్ని ఎవరైనా ‘బాబు’ అంటుంటారా? అనడిగితే – సాధారణంగా హీరో కుమారులు చిన్నప్పుడు సెట్‌కి వస్తే బాబు అనేవారు. తర్వాత వాళ్లు హీరోలయ్యారు. నేనలా లేను కదా! ఒకవేళ ఎవరైనా నన్ను ‘బాబు’ అని పిలిస్తే వద్దని చెబుతా. ఆ పిలుపు ఆపేవరకూ టార్చర్ చేస్తా. నా దృష్టిలో ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడమూ ఓ లక్. ‘నేను మీ ఫ్యాన్’ అని ప్రేక్షకులెవరైనా వస్తే చాలా హ్యాపీ. ఎందుకంటే... వాడు నా ఫ్యానే. ► మలయాళ చిత్ర పరిశ్రమలో లైట్‌బాయ్ నుండి మోహన్‌లాల్ వరకూ అందరూ ఓ లైన్లో కూర్చుని భోంచేస్తారు. తెలుగులో స్టార్స్‌కి ఎక్ట్స్రా ట్రీట్మెంట్ ఉంటుంది. త్వరలో ఆ పద్ధతి మారుతుంది. ‘మనందరి కంటే సినిమా గొప్పది’ అని బాపుగారి దగ్గర సహాయ దర్శకుడిగా చేస్తున్నప్పుడు తెలుసుకున్నా. జీవితాంతం అదే పాటిస్తా. ► నేనింకా చిన్న పిల్లాణ్ణే అనుకుంటున్నాను. అలాంటిది త్వరలో తండ్రి కాబోతున్నా. ఈ ఫీలింగ్‌ని మాటల్లో వర్ణించలేను. అంజనా (నాని భార్య)కి ఏప్రిల్ రెండో వారంలో డెలివరీ అని డాక్టర్లు చెప్పారు. -
ఫన్నీ వీడియో పోస్ట్ చేసిన నాని
-
ఫిబ్రవరిలో సినిమా సందడి
సంక్రాంతి బరిలో భారీ పోటి తరువాత.. బాక్సాఫీస్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన ఇండస్ట్రీ ప్రముఖులు ఫిబ్రవరిలో వరుస రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు. మీడియం రేంజ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో నెలంతా థియేటర్లు కలకలలాడనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెల సినిమాలకు అన్ సీజన్‌గా భావిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం ఈ అన్ సీజన్ లోనే యంగ్ హీరోలు బరిలో దిగుతున్నారు. ముందుగా ఫిబ్రవరి 3న మూడు సినిమాలు బరిలో దిగుతున్నాయి. నాని హీరోగా తెరకెక్కుతున్న నేను లోకల్‌తో పాటు మంచు విష్ణు హీరోగా రూపొందిన లక్కున్నోడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాదు ఆసక్తికరంగా తమ్ముడి మీద పోటికి బరిలో దిగుతోంది మంచు లక్ష్మి. లక్ష్మి లీడ్ రోల్లో తెరకెక్కిన లక్ష్మీబాంబ్ సినిమా కూడా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ నాగార్జున మరోసారి భక్తాగ్రేసరుడిగా నటించిన ఓం నమో వేంకటేశాయ, ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడు హథీరాం బాబాగా కనిపించనున్నాడు. అదే రోజు మంచు మనోజ్ మాస్ అవతారంలో కనిపిస్తున్న గుంటూరోడు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రానా నావీ కమాండర్‌గా నటిస్తున్న ఘాజీ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 1971లో భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో అదృశ్యమైన సబ్ మెరైన్ ఘాజీ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అదే రోజు రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ పెంపుడు కుక్కల దొంగగా కనిపించనున్నాడు. ఫిబ్రవరిలో ఆఖరి శుక్రవారం అయిన 24న కూడా సినిమా సందడి కొనసాగుతోంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ ఫిబ్రవరి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో యువ నటుడు నిఖిల్ హీరోగా తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ కేశవను కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
లవ్‌లో పడే వరకూ..
బాబుగాడు ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ‘ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంట్రా?’ అని అమ్మాయి లైట్ తీసుకుంటుంది. కానీ, ఆ అమ్మాయి.. తనతో లవ్‌లో పడే వరకూ డిస్ట్రబ్ చేస్తాడు. జండూ బామ్‌కి కూడా తలనొప్పి తెప్పించే టైపులో బాబుగాడు అలియాస్ రాంబాబు ఆ అమ్మాయిని ఏ రేంజ్లో డిస్ట్రబ్ చేశాడో తెలియాలంటే మా సినిమా చూడండి అంటున్నారు నిర్మాత ‘దిల్’ రాజు. నాని, కీర్తీ సురేశ్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మించిన సినిమా ‘నేను లోకల్’. చిత్ర సమర్పకులు ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరి 3న చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కథ–స్క్రీన్‌ప్లే–మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, రచన: సాయికృష్ణ, కెమేరా: నిజార్ షఫి, అసోసియేట్ నిర్మాత: బెక్కం వేణుగోపాల్, సహ నిర్మాత: హర్షిత్‌రెడ్డి. -
ఒక్క రీజన్ చెప్పమంటున్న నాని
సినిమా మేకింగ్ విషయంలోనే కాదు.. ప్రమోషన్ విషయంలో కూడా తన మార్క్ స్పష్టంగా ఉండేలా జాగ్రత్త పడతాడు యంగ్ హీరో నాని. తను హీరోగా నటించిన సినిమాల పబ్లిసిటీ బాధ్యతలు కూడా తానే తీసుకునే ఈ యంగ్ హీరో త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న నేను లోకల్ సినిమాను తన సోషల్ మీడియా పేజ్‌లో ప్రమోట్ చేస్తున్నాడు. ఎప్పటి కప్పుడు సినిమా విశేషాలను అభిమానులతో పంచుకోవటంతో పాటు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లను రిలీజ్ చేస్తుంటాడు. తాజాగా నేను లోకల్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తూ ఓ ఇంట్రస్టింగ్ వీడియోను పోస్ట్ చేశాడు నాని. ఫిబ్రవరి 3న రిలీజ్ అవుతున్న నేనులోకల్ సినిమా ప్రమోషన్లో భాగంగా క్యాలెండర్లో ఫిబ్రవరి మూడు తేదీని చూపిస్తూ.. 'సినిమా చూడటానికి ఒక్క రీజన్ చెప్పమని మీరడగొచ్చు, కానీ చూడకుండా ఉండటానికి ఒక్క రీజన్ చెప్పండి. అందుకే ఫిబ్రవరి 3న థియేటర్‌కి వచ్చేయండి' అంటూ వినూత్నంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. నాని సరసన కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు త్రినాథ్ రావు నక్కిన దర్శకుడు. సంక్రాంతి బరిలో శతమానం భవతి మంచి హిట్ సాధించిన దిల్ రాజు నిర్మాత. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
ఒక్క రీజన్ చెప్పమంటున్న నాని
-
ఈ 30 ఏళ్లలో రవితేజ, నాని మాత్రమే వచ్చారు
– ‘దిల్’ రాజు ‘‘ఓ ఎన్టీఆర్, ఓ ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు... తెలుగు చిత్ర పరిశ్రమ పుట్టినప్పుడు ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన వీళ్లందరూ స్వయంకృషితో హీరోలయ్యారు. తర్వాత చిరంజీవి వచ్చి ఇరగదీశారు. ఆ తర్వాత ఈ 30 ఏళ్లలో స్వయంకృషితో హీరోలయింది రవితేజ, నాని మాత్రమే’’ అన్నారు ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు. నాని, కీర్తీ సురేశ్ జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన చిత్రం ‘నేను లోకల్’. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్... అనేది ఉపశీర్షిక. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. శనివారం కాకినాడలో ఆడియో సీడీలను విడుదల చేశారు. నాని మాట్లాడుతూ – ‘‘థియేట్రికల్ ట్రైలర్ చూసి షాకయితే ఎలా? ఫుల్ సినిమా చూస్తే మంచి క్రేజీగా ఉంటుంది. కాకినాడ స్పెషల్ ఏంటని కీర్తీ సురేశ్ అడిగితే.. ‘కాకినాడ కాజా’ అన్నాను. ‘కాజా అంటే ఏంటి?’ అనడిగింది. ఏం చెప్పాలో తెలియలేదు. కాజా రుచి చూసి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పా. అలాగే, ‘నేను లోకల్’ గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. థియేటర్లో బొమ్మ చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో నన్ను బాగా డ్యాన్స్ చేయించాడు. ‘దిల్’ రాజుగారి గొప్పతనంలో 90 శాతం ఆయన టీమ్ శిరీష్, హర్షిత్, బెక్కం వేణుగోపాల్లదే. బయటకు మాత్రం క్రెడిట్ ఈయన కొట్టేస్తారు. వాళ్లందరూ కష్టపడి పనిచేసిన చిత్రమిది. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులందర్నీ డిస్ట్రబ్ చేస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘క్యారెక్టరైజేషన్‌తో కూడిన ‘ఇడియట్’, ‘ఆర్య’ వంటి ప్రేమకథలంటే నాకు ఇష్టం. ఇది ఆ తరహా చిత్రమే. ఓ ప్రేమకథకి ఒక క్యారెక్టరైజేషన్ యాటిట్యూడ్‌గా ఉంటే... ఎలా ఉంటుందనేది ‘నేను లోకల్’. ‘ఇడియట్’, ‘ఆర్య’ తరహాలో పెద్ద హిట్టవుతుంది. వరుసగా ఐదు సక్సెస్‌లతో జోరు మీదున్న నానీకి సెకండ్ హ్యాట్రిక్ అవుతుంది’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘రాజుగారితో నేను చేసిన ఆరో చిత్రమిది. ఆయనెప్పుడూ వందశాతం గ్యారెంటీ హిట్ చిత్రాలు తీస్తారు. అలాంటి హిట్ చిత్రమిది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, కాకినాడ మున్సిపల్ కమీషనర్ అలీం భాషా, చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, నిర్మాత శిరీష్, హీరోయిన్ కీర్తీ సురేశ్, రచయిత ప్రసన్నకుమార్, హీరో నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘నేను.. లోకల్’ ఆడియో విడుదల
‘సాగర సంబరాల’ వేదికపై సందడి కాకినాడ రూరల్ : యువహోరీ నాని నటించిన ‘నేను..లోకల్’ ఆడియో విడుదల సాగర సంబరాల్లో వేలాదిగా తరలి వచ్చిన ప్రజల మధ్య శనివారం రాత్రి జరిగింది. సినిమాలోని మొదటి పాట ‘నెక్సŠట్ ఏమిటి’ వీడియో ప్రోమోను రూరల్ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు, ‘చంపేసావే’ ప్రోమోను కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, శ్రీదేవి దంపతులు విడుదల చేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ తాను సంగీతదర్శకత్వం వహించిన చిత్రం ఆడియో విడుదలను తన సొంత జిల్లాలో అదీ సాగరతీరంలో జరిగే సంబరాల్లో చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పాటలన్నీ అద్భుతంగా ఉంటాయన్నారు. హీరో నాని మాట్లాడుతూ ‘నేను.. లోకల్’ ఆడియో విడుదలకు పర్యాటక శాఖ మంచి అవకాశం ఇచ్చిందని, సాగరసంబరాల్లో ప్రజల మధ్య ఆడియో విడుదలను చూస్తే సినిమా నూరు రోజుల పండగ చేసుకున్నట్లు ఉందని అన్నారు. పాటలను పాడి డ్యా¯Œ్సలు వేశారు. అనంతరం ‘డెస్టినేష¯ŒS’ అనే పాట వీడియో ప్రోమోను మున్సిపల్ కమిషనర్ ఆలీం బాషా, శ్రీనికేత¯ŒS అధినేత దొరబాబు విడుదల చేశారు. సినిమా యూనిట్‌తో పాటు ఏఎస్పీ దామోదర్, టూరిజం డీఈఈ భీమశంకరం, హీరోయి¯ŒS కీర్తి, సురేష్, నిర్మాత దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
నేను లోకల్ ఆడియో రిలీజ్ హైట్స్
-
అదే ట్రెండ్ ఫాలో అవుతున్న నాని
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ డిఫరెంట్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో ప్రతీ సినిమాకు ఆడియో వేడుకను భారీగా నిర్వహించేవారు. ఆడియో రిలీజ్ నుంచే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కొంత మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలకు ఆడియో వేడుకలు నిర్వహించకుండా పాటలను డైరెక్ట్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు చాలా మంది ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఈ మధ్య కాలంలో సరైనోడు, ధృవ సినిమాలతో పాటు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 సినిమాకు కూడా ఆడియో వేడుక నిర్వహించలేదు. అదే బాటలో నడిచేందుకు నిర్ణయించుకున్నాడు యంగ్ హీరో నాని. దిల్ రాజు నిర్మాతగా.., త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో.., నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా నేను లోకల్. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు ఆడియో వేడుకను నిర్వహించకుండా పాటలను డైరెక్ట్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. ముందుగా సినిమాలోని 'నెక్ట్స్ ఏంటి' అనే పాటను జనవరి 6న సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్ననేను లోకల్ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. This 6th @ 6PM First song from #NenuLocal will be out online :)#NextEnti Happy New Year :)) pic.twitter.com/YDPWLxw6pE— Nani (@NameisNani) 4 January 2017 -
నానీని ఇబ్బంది పెడుతున్న రామ్‌చరణ్
వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని ప్రస్తుతం నేను లోకల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అనుకున్న సమయానికి నాని సినిమా రిలీజ్ కాకుండా రామ్‌చరణ్ అడ్డుపడుతున్నాడట. అంటే రామ్ చరణ్ నానికి సినిమా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నాడని కాదు. ధృవ సినిమా రిలీజ్ కూడా ఇదే నెలలో ఉండటంతో ఇతర సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఇబ్బందులు తప్పటం లేదు. డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ధృవ సినిమాతో భారీ కలెక్షన్లను టార్గెట్ చేశాడు రామ్ చరణ్. అందుకే సినిమా రిలీజ్ అయిన వారం తరువాత కూడా పెద్ద సినిమాలేవి అడ్డు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా డిసెంబర్ 16న రిలీజ్ కావాల్సిన సూర్య సింగం 3 సినిమాను వారం పాటు వాయిదా వేయించాడు. దీంతో సింగం 3 డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగం వాయిదా పడటంతో డిసెంబర్ 23న రావాల్సిన నాని, నేను లోకల్ రిలీజ్ విషయంలో కూడా డైలమా ఏర్పడింది. సింగంతో పోటి పడాలా.. లేక తను కూడా సినిమాను వాయిదా వేసుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నాడు నేచురల్ స్టార్. -
సోలోగా వస్తున్న నాని
వరుస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నానికి టైం కూడా బాగా కలిసొస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు హిట్స్ అందించిన నాని, ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దిల్‌రాజు నిర్మాణంలో త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో నేనులోకల్ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ చివరలో రిలీజ్ చేస్తున్నాడు. సాధారణంగా టాలీవుడ్లో క్రిస్టమస్ సీజన్ అంటే బడా స్టార్ల సినిమాలు పోటిలో ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం పరిస్థితి అలా లేదు. సీనియర్ హీరోలందరూ సంక్రాంతికే బరిలో దిగుతుంటే, యంగ్ జనరేషన్ స్టార్లు సమ్మర్ రిలీజ్‌ల కోసం ప్రీపేర్ అవుతున్నారు. దీంతో క్రిస్టమస్ సీజన్లో నాని తప్ప మరే హీరో బరిలో దిగటం లేదు. రామ్‌చరణ్ ధృవ సినిమా క్రిస్టమస్‌కు రెండు వారాల ముందే రిలీజ్ అవుతుండటంతో నేనులోకల్పై పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చని భావిస్తున్నారు. ఇక నాని సినిమాకు వారం ముందే థియేటర్లలోకి వస్తున్న సూర్య, సింగం 3 ఒక్కటే నానికి పోటి అయ్యే అవకాశం ఉంది. సూర్యకు టాలీవుడ్‌లోమంచి ఫాలోయింగే ఉన్నా సింగం 3 పక్కా మాస్ ఎంటర్టైనర్ కావటంతో., ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ఉన్న నానికి పెద్దగా పోటి కాకపోవచ్చన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
నానితో ప్రియాంక చోప్రా..?
బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటు పలు అంతర్జాతీయ టీవీ షోలతో బిజీ బిజీగా ఉన్న హాట్ బ్యూటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం నిర్మాణ రంగంలోనూ బిజీ అవుతోంది. పర్పల్ పెబల్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించిన ప్రియాంక, ఆ బ్యానర్లో ఓ మరాఠి చిత్రాన్నినిర్మించింది. తొలి ప్రయత్నం సక్సెస్ కావటంతో ఇప్పుడు మరిన్ని ప్రాంతీయ భాషల్లో చిత్రాలు నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటుంది. తన రెండో సినిమాను టాలీవుడ్లో నిర్మించేందుకు రెడీ అవుతోంది ప్రియాంక. ప్రియాంక నిర్మించనున్న తొలి సౌత్ సినిమాలో నాని హీరోగా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే యష్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన తొలి సౌత్ సినిమా ఆహా కళ్యాణంలో హీరోగా నటించిన నాని, ఇప్పుడు ప్రియాంక సినిమాతో బాలీవుడ్ సినీ జనాలకు మరింత చేరువవుతున్నాడు. ప్రస్తుతం నేనులోకల్తో పాటు, శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న మరో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రియాంక నిర్మాణంలో నాని నటించటం కాయం అయితే ఈ రెండు సినిమాల తరువాతే ఆ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. -
నానీకి పోటి వస్తున్నకామెడీ స్టార్లు
వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని, ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో నేను లోకల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల వరుస హిట్లతో మంచి ఫాంలో ఉన్న నాని, ఈ సినిమాతో అదే జోరును కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అయితే ఇద్దరు కామెడీ స్టార్లు మాత్రం నాని స్పీడుకు బ్రేకులు వేసేందుకు రెడీ అవుతున్నారు. తొలి సారిగా హీరోలుగా మారుతున్న ఇద్దరు కామెడీ స్టార్లు డిసెంబర్ 23నే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ స్టార్ కమెడియన్‌గా యమా బిజీగా ఉన్న 30 ఇయర్స్ పృథ్వీ లీడ్ రోల్లో తెరకెక్కిన మీలో ఎవరు కోటీశ్వరుడుతో పాటు సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాలు డిసెంబర్ 23న రిలీజ్ అవుతున్నాయి. నాని సినిమా కూడా కామెడీ ఎంటర్టైనరే కావటంతో ఈ రెండు సినిమాల ప్రభావం నాని సినిమా మీద పడే అవకాశం ఉంది. ఈ కామెడీ స్టార్ లు నాని స్పీడుకు బ్రేకులేస్తారేమో చూడాలి. -
నాన్నవుతున్నాడోచ్!
యస్.. మీరు చదువుతోంది నిజమే. న్యాచురల్ స్టార్ నాని త్వరలో నాన్న కాబోతున్నారు. అంజన (నాని భార్య) ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. దంపతులు ఇద్దరూ ఆదివారం స్నేహితులందర్నీ ఆహ్వానించి స్వగృహంలో పార్టీ ఇచ్చారు. ఐదేళ్ల ప్రేమ తర్వాత, 2012 అక్టోబర్ 27న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘జెంటిల్మన్’, ‘మజ్ను’... రానున్న ‘నేను లోకల్’తో వరుసగా మంచి సినిమాలతో జోరు మీదున్న ఈ హీరో కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఇది తీపి వార్తే. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నాని కూడా ఫుల్ హ్యాపీ. -
నాని కూడా ఆ లిస్ట్‌లో చేరబోతున్నాడు..!
హీరోగా మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, త్వరలో పర్సనల్ లైఫ్‌లో కూడా ప్రమోషన్ పొందబోతున్నాడు. ఇటీవల వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ హీరో పర్సనల్ లైఫ్‌లో అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నాడు. ప్రస్తుతం నేను లోకల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈ నేచ్యురల్ యాక్టర్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ తీసుకుంటున్నాడు. ఈ జనరేషన్ హీరోల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, అల్లరి నరేష్, ఆది లాంటి హీరోలు ఇప్పటికే ఫాదర్స్ లిస్ట్‌లో చేరిపోగా తాజాగా నాని కూడా ఆ లిస్ట్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. మరికొద్ది నెలల్లో నాని భార్య అంజన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. నాని, అంజనాల కుటుంబ సభ్యులు తన కుటుంబంలోకి రానున్న కొత్త వెలుగుకు స్వాగతం పలకటానికి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. -
నాని 'నేను లోకల్' ఫస్ట్ లుక్
యంగ్ హీరో నాని యమా స్పీడు మీద ఉన్నాడు. ఇప్పటికే ఈ ఏడాది మూడు సినిమాలను రిలీజ్ చేసిన నాని, మరో సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో సినిమా చూపిస్తా మామ ఫేం త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నేను లోకల్. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు. నాని ఫుల్ మాస్ లుక్ లో సిగరెట్ తాగుతున్న ఈ స్టిల్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న నేను లోకల్ ఈ ఏడాది క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
బిజీ బిజీగా నాని
సెప్టెంబరు 23వ తేదీన 'మజ్ను'గా థియేటర్లకు రాబోతున్న నాని.. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఏడాదిన్నరగా వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న నాని.. తాజా చిత్రం 'మజ్ను' కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 'ఉయ్యాల జంపాల' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫీల్ గుడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా అలరించనుంది. నాని మార్క్ సెన్సిబుల్ కామెడీ హైలైట్ కానుంది. మరోపక్క నాని తదుపరి చిత్రం 'నేను లోకల్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబరులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్టీఆర్ పాట.. నాని ఆట
హీరోగా తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో ఎన్టీఆర్. హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫాంలో ఉన్న జూనియర్, గాయకుడిగానూ సత్తా చాటుతున్నాడు. తాను హీరోగా తెరకెక్కిన యమదొంగ, కంత్రి, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల్లో గాయకుడిగా అలరించిన జూనియర్, ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం ఓ పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదే జోరులో ఇప్పుడు ఓ తెలుగు హీరో కోసం గాయకుడిగా మారనున్నాడు. మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో నేను లోకల్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దేవీతో మంచి స్నేహం ఉన్న ఎన్టీఆర్, నేను లోకల్ సినిమాలో పాట పాడేందుకు అంగీకరించాడట. త్వరలోనే ఈ పాటను రికార్డ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. -
నాని నాలుగు సినిమాలు
ఈ జనరేషన్ హీరోలు ఏడాది ఒక్క సినిమా చేయడానికి కష్టపడుతుంటే ఓ యంగ్ హీరో మాత్రం ఈ ఏడాది నాలుగు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసిన ఈ హీరో మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. గతంలో అల్లరి నరేష్ ఇదే స్పీడులో సినిమాలో చేసినా వరుస ఫ్లాప్‌లతో కాస్త స్లో అయ్యాడు. సీనియర్ హీరో రవితేజ కూడా ఫాం కోల్పోవటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్లేస్‌ను నేచురల్ స్టార్ నాని తీసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, జూన్‌లో జెంటిల్మన్గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నాని, ఈ సినిమాను సెప్టెంబర్ 17న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. దిల్ రాజు నిర్మాణంలో సినిమా చూపిస్త మామా ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నేను లోకల్ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకురానున్నాడు. ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేం నవీన చంద్ర విలన్‌గా నటిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు నాని. -
నాని లోకల్.. కీర్తి నాన్ లోకల్!
‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. చంటిగాడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. లోకల్’ అనేది ‘ఇడియట్’లో రవితేజ సూపర్‌హిట్ డైలాగ్. ఇప్పుడు నాని ‘నేను లోకల్’ అంటున్నారు. నాని, కీర్తీ సురేశ్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న చిత్రానికి ‘నేను లోకల్’ టైటిల్ ఖరారు చేశారు. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్... అనేది ఉపశీర్షిక. ఓ లోకల్ అబ్బాయి, నాన్‌లోకల్ అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం కూడా ‘ఇడియట్’ తరహాలో ఉంటుందట. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమేరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. అనంతరం నాని మాట్లాడుతూ - ‘‘విభిన్నమైన వినోదాత్మక ప్రేమకథా చిత్రమిది. నాకు సమానమైన పాత్రలో నవీన్‌చంద్ర నటిస్తున్నారు’’ అన్నారు. త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ - ‘‘పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో నాని, మన ఇంట్లో అమ్మాయిలా కీర్తి సురేశ్, కీలక పాత్రలో నవీన్ చంద్ర కనిపిస్తారు. ‘దిల్’ రాజు, నాని, దేవిశ్రీ ప్రసాద్.. ముగ్గురితో పనిచేయాలనే కోరిక ఈ ఒక్క చిత్రంతో నెరవేరుతోంది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘మాస్ ఎంటర్టైనర్ ఇది. ‘ఆర్య’ తరహాలో క్యారెక్టర్ బేస్డ్ లవ్‌స్టోరీ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: ప్రసన్న, కెమేరా: నిజార్ షఫీ, అసోసియేట్ నిర్మాత: బెక్కం వేణుగోపాల్, సహ నిర్మాత: హర్షిత్‌రెడ్డి. -
'నేను లోకల్' అంటున్న నాని
వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని మరో సినిమాకు కమిట్ అయ్యాడు. 'సినిమా చూపిస్త మామ' ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రానికి 'నేను లోకల్' అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. నాని సరసన 'నేను.. శైలజ' ఫేం కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం కామెడీ ఎంటర్టెయినర్గా తెరకెక్కనుంది. కాగా నాని ప్రస్తుతం నటిస్తున్న 'మజ్ను' సినిమా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మజ్ను చిత్రానికి 'ఉయ్యాల జంపాల' ఫేం విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన అను ఎమ్మానుయేల్ అనే నూతన తార హీరోయిన్గా నటిస్తోంది. -
నేను లోకల్ అంటున్న నాని
వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, అదే జోరులో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇటీవల విడుదలైన థ్రిల్లర్ మూవీ జెంటిల్మన్ కూడా హిట్ టాక్ తెచ్చుకోవటంతో ఇప్పుడు తదుపరి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'మజ్ను' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా సినిమా చూపిస్త మామా ఫేం త్రినాథ్ రావు దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'నేను లోకల్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. కొద్ది రోజులుగా ప్రయోగాత్మక చిత్రాలు, క్లాస్ చిత్రాలు మాత్రమే చేస్తున్న నాని, ఈ సినిమాతో మాస్ మాసాలా అవతారంలో కనిపించనున్నాడు.